ఇంటి గుమ్మంలో నల్ల చిరుత… ఇంతకీ తలుపు కొట్టిందా ?? లేదా ??
ఎక్కడ నుంచి వచ్చిందో ఏమో. నల్ల చిరుత ఒకటి ఓ ఇంటి వద్దకు వచ్చి చక్కర్లు కొట్టింది. ఇంటి ప్రధాన ద్వారం నుంచే అది అలా హుందాగా నడుచుకుంటూ పోయింది. ఆ సమయంలో ఎవరైనా తలుపు తీసి ఉంటే పరిస్థితి ఏంటో ఊహించుకుంటేనే ఒళ్లు జలదరిస్తోంది. తమిళనాడులోని నీలగిరి ప్రాంతంలో ఘటనకు సంబంధించిన వీడియోను ఐఎఫ్ఎస్ అధికారి పర్వీన్ కశ్వాన్ తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. ఈ ఘటన గతేడాది ఆగస్టులో నీలగిరి జిల్లాలో జరిగింది.
ఎక్కడ నుంచి వచ్చిందో ఏమో. నల్ల చిరుత ఒకటి ఓ ఇంటి వద్దకు వచ్చి చక్కర్లు కొట్టింది. ఇంటి ప్రధాన ద్వారం నుంచే అది అలా హుందాగా నడుచుకుంటూ పోయింది. ఆ సమయంలో ఎవరైనా తలుపు తీసి ఉంటే పరిస్థితి ఏంటో ఊహించుకుంటేనే ఒళ్లు జలదరిస్తోంది. తమిళనాడులోని నీలగిరి ప్రాంతంలో ఘటనకు సంబంధించిన వీడియోను ఐఎఫ్ఎస్ అధికారి పర్వీన్ కశ్వాన్ తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. ఈ ఘటన గతేడాది ఆగస్టులో నీలగిరి జిల్లాలో జరిగింది. పర్వీన్ తాజాగా ఈ వీడియోను పోస్టు చేయగా ఇప్పటి వరకు 1.39 లక్షల మందికి పైగా వీక్షించారు. ‘‘ఎవరైనా మీ ఇంటిని ఇలా సందర్శిస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి. నల్ల చిరుతలు ఎక్కడ కనిపిస్తాయో తెలుసా?’’ అని కశ్వాన్ ఆ వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు తమ భయాన్ని కామెంట్ల రూపంలో పెడుతున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వందే భారత్ రైలుకు “కవచ్” రక్ష.. ఉత్తర్‌ప్రదేశ్‌లోని మథుర, పాల్వాల్ మధ్య పరీక్ష
పొదుపు చేయలేదు.. జాబ్ పోయింది.. టెకీ ఆవేదన
ప్రాణాలకు తెగించి వృద్ధ దంపతుల వీరోచిత పోరాటం
మెస్సికి కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చిన అనంత్ అంబానీ..
నీరు తోడుతుండగా వచ్చింది చూసి.. పరుగో పరుగు..
జోరు వానలో చిక్కుకున్న ఏనుగు.. గొడుగుగా మారిన తల్లి ఏనుగు..
6 నెలలు చికెన్ మాత్రమే తిన్న యువతి.. చివరకు ఆస్పత్రిలో చేరి..
తవ్వకాల్లో బయటపడ్డ దుర్గమాత విగ్రహం

