Watch Video: అయ్యో..పాపం! హ్యాపీగా పెళ్లికి వస్తే.. పరుగులు పెట్టించిన తేనెటీగలు..ఆ తర్వాత ఏం జరిగిందో చూస్తే..

కల్యాణ వేధికపై వధూవరులు వివాహ తంతు నిర్వహిస్తున్నారు. కుటుంబ సభ్యులు, సన్నిహితులు ఎవరి సంతోషంలో వారు హడావుడిగా ఉన్నారు. మరో క్షణంలో వధువు మేడలో వరుడు తాళికట్టే ముహూర్తం వచ్చేసింది..బాజా భజంత్రీలు మోగాయి. అంతలోనే ఊహించని సంఘటన.. అందరిలో ఉత్కంఠ.. ఒక్క క్షణంలో అక్కడి పరిస్థితి అంతా తారుమారై పోయింది. సంతోషంగా ఉన్న వారంతా హాహాకారాలు చేస్తూ పరుగులు తీశారు..

Watch Video: అయ్యో..పాపం! హ్యాపీగా పెళ్లికి వస్తే.. పరుగులు పెట్టించిన తేనెటీగలు..ఆ తర్వాత ఏం జరిగిందో చూస్తే..
Swarm Bee Attacks
Follow us
Jyothi Gadda

|

Updated on: Feb 19, 2024 | 6:12 PM

పెళ్లి వేడుక క్షణాల్లో మాయమై రణరంగంగా మారింది.. సంతోషంగా వివాహ వేడుకలో పాల్గొన్న వారంతా ప్రాణాలు అరచేతిలో పట్టుకుని పరుగులు తీయాల్సి వచ్చింది. కల్యాణ వేధికపై వధూవరులు వివాహ తంతు నిర్వహిస్తున్నారు. కుటుంబ సభ్యులు, సన్నిహితులు ఎవరి సంతోషంలో వారు హడావుడిగా ఉన్నారు. మరో క్షణంలో వధువు మేడలో వరుడు తాళికట్టే ముహూర్తం వచ్చేసింది..బాజా భజంత్రీలు మోగాయి. అంతలోనే ఊహించని సంఘటన.. అందరిలో ఉత్కంఠ.. ఒక్క క్షణంలో అక్కడి పరిస్థితి అంతా తారుమారై పోయింది. సంతోషంగా ఉన్న వారంతా హాహాకారాలు చేస్తూ పరుగులు తీశారు.. కారణం స్థానికుల తేనెటీగల దాడి. నవ వధూవరులతో సహా పెళ్లికి వచ్చిన చాలా మందిపై తేనెటీగలు దాడి చేశాయి..వారిలో 12 మందిని ఆస్పత్రిలో చేర్పించాల్సి వచ్చింది. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఘటన మధ్యప్రదేశ్‌లోని గుణాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..

పెళ్లికి ఆహ్వానితులైన బంధువులు, స్నేహితులు అందరూ కల్యాణ మండంలో కూర్చుని ఉన్నారు. మరోవైపు రకరకాల వంటకాలు, ఆహారం సిద్ధంగా ఉంచారు. వేదికపై కొత్త జంట కూర్చుని ఉంది. పూరోహితుడు మంత్రాలు చదువుతున్నాడు.. భాజా భజంత్రీలు మోగుతున్నాయి. మరోవైపు చిన్న పిల్లలు తమ తమ సరదాల్లో మునిగిపోయారు. కానీ ఒక్క క్షణంలో కూర్చున్న అతిథులు వేర్వేరు దిశల్లో పరుగెత్తడం ప్రారంభించారు. అక్కడ ఏం జరుగుతుందో కొత్త జంట గ్రహించే లోపుగానే.. తేనెటీగలు దాడి చేశాయి. తేనెటీగల దాడిలో చాలా మంది తీవ్రంగా గాయపడ్డారు. కొందరు పరిగెత్తుతుండగా కిందపడి గాయాలపాలయ్యారు. వీరిలో12 మంది ఆసుపత్రి పాలయ్యారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

గుణ నివాసి అయిన వధువు, వరుడి కుటుంబాలు వివాహ వేడుక కోసం హాల్‌ను బుక్ చేసుకున్నారు. మండపాన్ని పరిశీలించిన అనంతరం కుటుంబ సభ్యులు తేనెటీగల గూడుపై చౌల్ట్రీ సిబ్బందికి సమాచారం అందించారు. ఇక్కడ తేనెటీగలు ఎవరినీ ఇబ్బంది పెట్టలేదని, ఎలాంటి భయం పెట్టుకోవద్దని హాల్‌ నిర్వాహకులు హామీ ఇచ్చారు. దాంతో సంతృప్తి చెందని కుటుంబ సభ్యులు తేనెటీగలను తరిమివేసి మండపం సిద్ధం చేయాలని సూచించారు. కానీ, మండపం సిబ్బంది, యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించారని పెళ్లివారు మండిపడ్డారు. పెళ్లికి ముందు రోజు మండపానికి వెళ్లిన కుటుంబ సభ్యులు మళ్లీ ఇదే విషయాన్ని సిబ్బందికి తెలియజేశారు. ఇవేవీ పట్టించుకోకుండా సిబ్బంది అదే నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపించారు.. పెళ్లి రోజున అతిథులంతా వచ్చిన తర్వాత తేనెటీగలు దాడి చేశాయని ఆవేదన వ్యక్తం చేశారు.

జరిగిన సంఘటనపై బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. పోలీసులు కేసు నమోదు చేసి సిబ్బందిని విచారించారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..