Foods for Sleep: రాత్రివేళ నిద్రపట్టక అవస్థ పడుతున్నారా..? అయితే, గాఢనిద్ర కోసం ఈ ఆహారాలు తినండి!!

అనేక కారణాల వల్ల మీకు మంచి నిద్ర రాకపోవచ్చు. కాబట్టి కారణం కనుగొని పరిష్కారం కోసం ప్రయత్నించండి.. అయితే, మీకు మంచి నిద్ర రావడానికి సహాయపడే కొన్ని రకాల పండ్ల తినాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం...

Foods for Sleep: రాత్రివేళ నిద్రపట్టక అవస్థ పడుతున్నారా..? అయితే, గాఢనిద్ర కోసం ఈ ఆహారాలు తినండి!!
Foods For Sleep
Follow us

|

Updated on: Feb 19, 2024 | 5:48 PM

ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో నిద్ర పాత్ర చాలా ముఖ్యమైనది. శరీరానికి అవసరమైన, సరైన నిద్రపోకపోవడం శారీరక, మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. ఇది బలహీనమైన రోగనిరోధక శక్తి, అధిక రక్తపోటు, మానసిక ఒత్తిడి వంటి సమస్యలకు దారి తీస్తుంది. అనేక కారణాల వల్ల మీకు మంచి నిద్ర రాకపోవచ్చు. కాబట్టి కారణం కనుగొని పరిష్కారం కోసం ప్రయత్నించండి.. అయితే, మీకు మంచి నిద్ర రావడానికి సహాయపడే కొన్ని రకాల పండ్ల తినాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం…

అరటిపండ్లు..

అరటి పండ్లలో మెగ్నీషియం, పొటాషియం సమృద్ధిగా ఉంటుంది. అరటిపండ్లను రాత్రిపూట తినడం వల్ల శరీర కండరాలు రిలాక్స్ అవుతాయి. ఇందులో ఉండే సహజసిద్ధమైన కార్బోహైడ్రేట్స్, పొటాషియం, మెగ్నీషియం.. మంచి నిద్రకు సాయపడతాయి. అరటి పండ్లు తినడం వల్ల ఒత్తిడి నుంచి ఉపశమనం కలుగుతుంది. మన శరీరానికి అవసరమైన పోషకాలు, విటమిన్ సి, విటమిన్ బి 6 తో సహా ఎన్నో ఇతర ముఖ్యమైన ఖనిజాలు, ఫోలేట్ మొదలైనవి అరటిపండ్లలో పుష్కలంగా ఉంటాయి. ఇవి మనకు తెలియని ఎన్నో ఆరోగ్య సమస్యలను పరిష్కరిస్తాయని నిపుణులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

చెర్రీస్‌..

రాత్రి పూట చెర్రీస్ తినడం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. చెర్రీస్‌లో మెలటోనిన్ పుష్కలంగా ఉంటుంది. ఇది మంచి నిద్రకు ఉపయోగపడుతుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, పడుకునే ముందు కొన్ని చెర్రీస్ తినడం వల్ల నిద్ర మెరుగుపడుతుంది. కావాలంటే చెర్రీ జ్యూస్ కూడా తాగొచ్చు. కాబట్టి రాత్రిపూట క్రమం తప్పకుండా చెర్రీ జ్యూస్ తాగడం వల్ల నిద్ర బాగా పడుతుంది.

కివీ ఫ్రూట్స్‌…

కివిలో విటమిన్ సి, ఇ, పొటాషియం, ఫోలేట్, సెరోటోనిన్, యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయి. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు నిద్రను మెరుగుపరుస్తాయి. అంతేకాదు.. ఇది గుండె జబ్బులు, స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఇందులో ఉండే ఫోలేట్, పొటాషియం, విటమిన్ కె కూడా ఆరోగ్యానికి ఎంతో దోహదం చేస్తాయి. అంతేకాదు ఆరోగ్యకరమైన రక్తపోటును నిర్వహించడంలో కీలకంగా పనిచేస్తాయి. కివీస్ లో సెరోటోనిన్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. కివిని పడుకునే ముందు తింటే నిద్ర నాణ్యత పెరుగుతుంది.

ద్రాక్ష..

రాత్రిపూట నిద్ర పట్టనివాళ్ళు ద్రాక్ష పండ్లను కూడా తినొచ్చు. ద్రాక్షా పండ్లలో కూడా నిద్రకు కారణమయ్యే మెలటోనిన్ ఉంటుంది. చాలా మంది ఓట్స్‌ను ఉదయం బ్రేక్ ఫాస్ట్ గా మాత్రమే తీసుకుంటారు. కానీ రాత్రిపూట నిద్ర పట్టనివాళ్లు రాత్రి సమయంలో పడుకునే ముందు తింటే నిద్రకు కారణమయ్యే హార్మోన్ల ఉత్పత్తి జరుగుతుంది. దాంతో హాయిగా నిద్రపోతారు.

గోరు వెచ్చని పాలు..

మంచి నిద్ర పట్టాలంటే ఒక గ్లాసు గోరు వెచ్చని పాలు తాగాలని ఆయుర్వేదంలో ఉంది. జాజికాయ, బాదం, యాలకులను దంచి పాలలో కలుపుకొని తాగినా నిద్ర పడుతుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

పారిస్ లో చిరంజీవి ఫ్యామిలీ.. స్పెషల్ అట్రాక్షన్‌గా క్లింకార..
పారిస్ లో చిరంజీవి ఫ్యామిలీ.. స్పెషల్ అట్రాక్షన్‌గా క్లింకార..
రంభ, ఊర్వశి, మేనకలను కలగలిపిన అనుపమ అందం.!
రంభ, ఊర్వశి, మేనకలను కలగలిపిన అనుపమ అందం.!
వరుణుడి ప్రతాపం.. ఈ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..
వరుణుడి ప్రతాపం.. ఈ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..
అతనితో కీర్తి సురేశ్ పెళ్లి.. ఫుల్ క్లారిటీ ఇచ్చేసిందిగా..
అతనితో కీర్తి సురేశ్ పెళ్లి.. ఫుల్ క్లారిటీ ఇచ్చేసిందిగా..
కాంటాక్ట్ లెన్స్‌ వల్ల నటి జాస్మిన్ భాసిన్‌కు తీవ్ర అనారోగ్యం..
కాంటాక్ట్ లెన్స్‌ వల్ల నటి జాస్మిన్ భాసిన్‌కు తీవ్ర అనారోగ్యం..
వికసిత్‌ భారత్‌ లక్ష్యం.. నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ
వికసిత్‌ భారత్‌ లక్ష్యం.. నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ
క్యూట్ నెస్ ఓవర్ లోడెడ్.. ఈ క్యూటీపై అందాలకి పడని హృదయం ఉంటుందా.!
క్యూట్ నెస్ ఓవర్ లోడెడ్.. ఈ క్యూటీపై అందాలకి పడని హృదయం ఉంటుందా.!
చిన్న పిల్లాడితో లిప్ కిస్‌లా? ఆ లేడీ యాంకర్ పై చిన్మయి ఆగ్రహం
చిన్న పిల్లాడితో లిప్ కిస్‌లా? ఆ లేడీ యాంకర్ పై చిన్మయి ఆగ్రహం
ఏయే వయసులవారికి ఎంతెంత నిద్ర అవసరమో తెలుసా?
ఏయే వయసులవారికి ఎంతెంత నిద్ర అవసరమో తెలుసా?
రెబల్ స్టార్ ప్రభాస్ సాధించాడు.. ఇక ఇప్పుడు ఈ హీరోల వంతు
రెబల్ స్టార్ ప్రభాస్ సాధించాడు.. ఇక ఇప్పుడు ఈ హీరోల వంతు