Need A Bride: నాకొక శ్రీమతి కావాలి..! పెళ్లి వయసు దాటిపోతోంది మొర్రో అంటూ ఈ-రిక్షా డ్రైవర్ ఆవేదన..

తనకు పెళ్లి వయసు దాటిపోతోందని చెప్పాడు.. కానీ, సొసైటీలో ఆడపిల్లలు లేకపోవడంతో తనకు తగిన భాగస్వామి దొరకడం లేదని వాపోయాడు.. అందుకే ఈ ఆలోచన చేశానని చెప్పాడు. అంతేకాదు పెళ్లి చేసుకోవడానికి కుల, మత తారతమ్యం కూడా లేదని స్పష్టం చేశాడు. పోస్ట్‌లో దీపేంద్ర రాథోడ్‌ వ్యక్తిగత సమాచారం ప్రస్తావించబడింది. తన వివాహ ప్రతిపాదనను అంగీకరించే ఏ స్త్రీ అయినా తనను సంప్రదించవచ్చని కోరాడు.

Need A Bride: నాకొక శ్రీమతి కావాలి..! పెళ్లి వయసు దాటిపోతోంది మొర్రో అంటూ ఈ-రిక్షా డ్రైవర్ ఆవేదన..
Need A Bride
Follow us
Jyothi Gadda

|

Updated on: Feb 19, 2024 | 5:16 PM

వివాహం.. భారతదేశంలో వివాహం అనేది ఒక పవిత్ర బంధం. గతంలో రిలేషన్ షిప్ లో వివాహాలు జరిగేవి. గతంలో బంధుత్వ సంబంధాన్ని వదిలి వేరే ఊరి నుంచి తెలియని అబ్బాయిని వెతికి తీసుకురావడం లేదా గుర్తు తెలియని వేరే ఊరి అమ్మాయిని పెళ్లి చేసుకోవడం చేసేవారు కాదు… అయితే కాలంతో పాటు మనుషులు కూడా మారుతున్నారు. మంచి సంబంధం అంటే కాస్త దూరమైనా సరే.. పరస్పర సంబంధాన్ని పెంచుకుంటున్నారు. ఇవేకాకుండా సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందడంతో ఆన్‌లైన్‌లో వధూవరులకు సంబంధించిన పలు రకాల ప్లాట్‌ఫారమ్‌లు కూడా పుట్టుకొస్తున్నాయి. పెళ్లికూతూరు, పెళ్లి కొడుకు కోసం కాళ్లరిగిపోయేలా వెతకాల్సిన పని లేకుండా మ్యాట్రిమోనీ ద్వారా అన్వేషణ జరుగుతోంది. అయితే ఈ-రిక్షాలో ఓ యువకుడు ప్రత్యేకంగా వధువు కోసం వెతుకుతున్నాడు. ఈ దృశ్యం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన పోస్ట్‌లో కనిపిస్తున్న యువకుడి పేరు దీపేంద్ర రాథోడ్. 29 ఏళ్ల దీపేంద్ర రాథోడ్ తన కోసం వధువును వెతకడానికి ఒక ప్రత్యేకమైన విధానాన్ని అనుసరించాడు. ఇ-రిక్షా నడుపుతూ, అతను పెళ్లి కోసం అమ్మాయిని వెతుకుతున్నాడు. అతని ఇ-రిక్షాలో తన వ్యక్తిగత సమాచారాన్ని అంటే, పుట్టిన తేదీ, ఎత్తు, రంగు, గోత్రం వంటివి రాసి ఉంచిన పోస్టర్‌ను అంటించాడు. దాంతో ఈ పోస్ట్ కాస్త నెట్టింట వైరల్‌గా మారింది.

దీనిపై దీపేంద్ర రాథోడ్ మాట్లాడుతూ, తనకు పెళ్లి వయసు దాటిపోతోందని చెప్పాడు.. కానీ, సొసైటీలో ఆడపిల్లలు లేకపోవడంతో తనకు తగిన భాగస్వామి దొరకడం లేదని వాపోయాడు.. అందుకే ఈ ఆలోచన చేశానని చెప్పాడు. అంతేకాదు పెళ్లి చేసుకోవడానికి కుల, మత తారతమ్యం కూడా లేదని స్పష్టం చేశాడు. ఆటో రిక్షాపై అతికించిన పోస్ట్‌లో దీపేంద్ర రాథోడ్‌ వ్యక్తిగత సమాచారం ప్రస్తావించబడింది. తన వివాహ ప్రతిపాదనను అంగీకరించే ఏ స్త్రీ అయినా తనను సంప్రదించవచ్చని చెప్పాడు. దీనికి దీపేంద్ర రాథోడ్ తల్లిదండ్రులు కూడా మద్దతు ఇచ్చారు. అలాగే తమ కొడుక్కి త్వరగా పెళ్లి కూతురు దొరకాలని ఆశిస్తూ..పూజలు, వ్రతాలు చేస్తున్నారట.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..