- Telugu News Photo Gallery Avoid reheat food items do not eat these things after reheating Telugu News
Re-heat : ఈ 5 ఆహారాలను మళ్లీ వేడి చేసి తింటే తింటున్నారా..? అయితే, మీరు డేంజర్‌లో పడినట్టే..!
మన బిజీ జీవనశైలి మన ఆహారంపై చాలా ప్రభావాన్ని చూపుతుంది. సమయాభావం వల్ల తేలిగ్గా తయారుచేసుకునే వాటిని తినడానికి ప్రజలు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. అయితే, ఆహారం తయారుచేసేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉన్నా ఒక్కోసారి అది మిగులుతుంది. అప్పుడు వాటిని మళ్లీ వేడి చేసి తింటుంటాం. కానీ, కొన్ని ఆహార పదార్థాలను మళ్లీ వేడి చేసి తినకూడదు. అలా తినడం ఆరోగ్యానికి హానికరం.
Updated on: Feb 18, 2024 | 1:53 PM

కొన్నిసార్లు మనం ఉద్దేశపూర్వకంగా ఆహారాన్ని అతిగా వండుకుంటాం. సమయాభావం వల్ల మళ్లీ వేడి చేసి తింటాం. కానీ, ఆహారాన్ని మళ్లీ వేడి చేయడం వల్ల దానిలోని పోషకాలు నాశనం కావడమే కాకుండా మన ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే అనేక రసాయనాలు విడుదలవుతాయి. కాబట్టి అలాంటి కొన్ని ఆహారాలు ఏమిటో తెలుసుకుందాం.

బీట్‌రూట్‌ను ఎప్పుడూ మళ్లీ వేడి చేసి తినకూడదు. దీన్ని మళ్లీ వేడి చేయడం ద్వారా, అందులోని నైట్రేట్‌లు నాశనమై, ప్రయోజనకరంగా కాకుండా ఆరోగ్యానికి హానికరం.

మనం సాధారణంగా పూరీ, పకోడీ లేదా డీప్ ఫ్రై చేసిన వస్తువుల కోసం పాన్‌లో ఎక్కువ నూనె వేస్తాము. ఆపై మిగిలిన నూనెను మళ్లీ వేడి చేసి వాడతారు, ఇది ఆరోగ్యానికి ప్రమాదకరం.

వేడి వేడి చికెన్ ఎంత రుచికరమైనదో, మరుసటి రోజు వేడి చేసుకునే తింటే అంతే ప్రమాదకరం అంటున్నారు నిపుణులు. ఈ వంటకాన్ని రిఫ్రిజిరేటర్ నుండి తీసి వేడి చేసినప్పుడు, దాని ప్రోటీన్ పూర్తిగా మారిపోతుంది. ఫలితంగా జీర్ణవ్యవస్థ సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అధిక ఉష్ణోగ్రత వద్ద వేడి చేయకుండా జాగ్రత్త వహించండి.

ఆకు కూరలు మళ్లీ వేడి చేసి తినకూడదు. పాలకూర, బచ్చలికూర వంటివి మళ్లీ వేడి చేయడం వల్ల దానిలోని నైట్రేట్ మూలకాలను హానికరమైన మూలకాలుగా మారుస్తుంది, ఇవి శరీరానికి చాలా ప్రమాదకరమైనవి.

ఆలూతో చేసిన వంటకాలను మళ్లీ వేడిచేయకూడదు. అలా చేస్తే అందులో క్లోస్ట్రిడియం బోటులినమ్ అనే బ్యాక్టీరియా పెరుగుతుంది. వేడి చేయడం ద్వారా వాటిల్లో ఉండే బి-6, పొటాషియం, విటమిన్-సి విచ్చిన్నం అవుతాయి. అప్పుడు ఆ కర్రీని తింటే పోషకాలేమీ లభించకపోగా.. ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.





























