డ్రై ఫ్రూట్స్ తినడం వల్ల శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే ప్రతి రోజూ ఉదయాన్నే నానబెట్టిన ఎండుద్రాక్షను తింటే శరీరంలోని రక్తహీనత తొలగిపోతుంది. ఎండుద్రాక్షలో హిమోగ్లోబిన్‌ను పెంచే ఐరన్ ఉంటుంది.
ఎండుద్రాక్ష నానబెట్టిన నీరు గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. శరీరం నుండి హానికరమైన కొలెస్ట్రాల్‌ను తొలగిస్తుంది. విటమిన్లు, ఖనిజాలను కలిగి ఉంటుంది. కాలేయం, మూత్రపిండాలను బాగా ఉంచుతుంది. ఇది శరీరం నుండి విషాన్ని కూడా తొలగిస్తుంది. ఈ నీటితో జీర్ణశక్తి పెరుగుతుంది.