- Telugu News Photo Gallery If you want to check the knee pains just eat this one, check here is details in Telugu
Knee Pain Relief Tips: మోకాళ్ల నొప్పులకు చెక్ పెట్టాలంటే.. ఇది ఒక్కటి తింటే చాలు!
ప్రస్తుత కాలంలో వయసుతో సంబంధం లేకుండా ఎన్నో అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. వాటిల్లో మోకాళ్ల నొప్పులు కూడా ఒకటి. ఈ సమస్య యువతలో కూడా కనిపిస్తుంది. అధిక బరువు, పోషకాహార లోపం వల్ల ఈ ప్రాబ్లమ్స్‌తో ఇబ్బంది పడుతున్నారు. అలాగే క్యాల్షియం లోపం వల్ల కూడా మోకాళ్ల నొప్పులు వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. క్యాల్షియం లోపం ఉన్నవారు.. కింద పడిపోయినా, చిన్న ప్రమాదాలు జరిగినా ఎముకలు విరిగిపోవడం..
Updated on: Feb 19, 2024 | 1:38 PM

ప్రస్తుత కాలంలో వయసుతో సంబంధం లేకుండా ఎన్నో అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. వాటిల్లో మోకాళ్ల నొప్పులు కూడా ఒకటి. ఈ సమస్య యువతలో కూడా కనిపిస్తుంది. అధిక బరువు, పోషకాహార లోపం వల్ల ఈ ప్రాబ్లమ్స్‌తో ఇబ్బంది పడుతున్నారు. అలాగే క్యాల్షియం లోపం వల్ల కూడా మోకాళ్ల నొప్పులు వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

క్యాల్షియం లోపం ఉన్నవారు.. కింద పడిపోయినా, చిన్న ప్రమాదాలు జరిగినా ఎముకలు విరిగిపోవడం, కీళ్ల నొప్పులు రావడం జరుగుతూ ఉంటాయి. ఈ సమస్య నుంచి బయట పడాలంటే.. క్యాల్షియం అధికంగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవాలి.

కీళ్ల నొప్పులు, అర్థరైటీస్ నొప్పులు వంటి సమస్యలు తగ్గుతాయి. మోకాళ్ల, కీళ్ల నొప్పులు ఉన్నవారు కొన్ని రకాల చిట్కాలు పాటిస్తే.. ఉపశమనం లభిస్తుంది. మరి అవేంటో ఇప్పుడు చూద్దాం.

ముందుగా ఒక కడాయిలో ఆలీవ్ ఆయిల్ తీసుకోవాలి. ఇందులో ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, పసుపు, కొద్దిగా మునకాగు, పచ్చి మిర్చి తరుగు, అల్లం తరుగు, ఉప్పు వేసి బాగా వేయించాలి. ఇవి వేగిన తర్వాత అటుకులు వేసి బాగా కలుపుకోవాలి.

ఇప్పుడు మంటను మీడియంలోకి పెట్టి.. కొత్తిమీర, పెరుగు వేసి అంతా కలిసేలా కలపాలి. ఇలా పెరుగు అటుకులు తినడం వల్ల కీళ్ల నొప్పుల నుంచి మంచి ఉపశమనం లభిస్తుంది. లేనివారు అప్పుడప్పుడు తింటే కీళ్ల నొప్పులు రాకుండా ఉంటాయి.




