Viral Video: మార్కెట్లోకి కొత్త రకం దోశ.. వీడియో చూసి ముక్కు మీద వేలేసుకుంటున్న నెటిజన్స్..
టిఫిన్ అనగానే అందరికి ముందుగా గుర్తుకొచ్చేది ఇడ్లి, దోశ. దక్షిణ భారత వంటకంఇప్పుడు దేశ విదేశాల్లో ఇష్టమైన ఆహార పదార్థంగా మారింది. దోశ పేరు వినగానే భారతీయుల నోళ్లలో నీళ్లు తిరుగుతాయి. ఈ ప్రఖ్యాత వంటకాన్ని మరింత రుచిగా చేసేందుకు అనేక ప్రయోగాలు చేశారు. వాటిల్లో సక్సెస్ అయిన కోట్లకు అధిపతి అయిన గణపతి వంటి వారి గురించి అందరికీ తెలిసిందే.. అయితే తాజాగా నెట్టింట్లో దోశ మీద ప్రయోగం చేస్తున్న ఓ వీడియో చక్కర్లు కొడుతోంది.

ప్రస్తుతం సోషల్ మీడియాలో మొత్తం ప్రపంచం దర్శనం ఇస్తుంది. రకరకాల వీడియోలు నెట్టింట్లో చక్కర్లు కొడుతూ సందడి చేస్తున్నాయి. నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. అలాంటి వీడియోలో ఒకటి రకరకాల ఆహారపదార్ధాల తయారీకి సంబంధించిన వీడియోలు.. ఇంటర్నెట్ ప్రపంచంలో ఎక్కువగా ఇష్టపడే వీడియోలు ఆహారం, పానీయాలకు సంబంధించిన వీడియోలని చెప్పవచ్చు. ఆహార పదార్ధాల తయారీలో ప్రయోగాలు చేయడమే కాదు.. చూడడానికి కూడా ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ముఖ్యంగా ప్రయోగం పేరుతో చేస్తున్న వీడియోలు ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. తాజాగా ఓ స్ట్రీట్ ఫుడ్ కి చెందిన వ్యక్తి ‘బ్లూ దోశ ని తయారు చేస్తున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.
టిఫిన్ అనగానే అందరికి ముందుగా గుర్తుకొచ్చేది ఇడ్లి, దోశ. దక్షిణ భారత వంటకంఇప్పుడు దేశ విదేశాల్లో ఇష్టమైన ఆహార పదార్థంగా మారింది. దోశ పేరు వినగానే భారతీయుల నోళ్లలో నీళ్లు తిరుగుతాయి. ఈ ప్రఖ్యాత వంటకాన్ని మరింత రుచిగా చేసేందుకు అనేక ప్రయోగాలు చేశారు. వాటిల్లో సక్సెస్ అయిన కోట్లకు అధిపతి అయిన గణపతి వంటి వారి గురించి అందరికీ తెలిసిందే.. అయితే తాజాగా నెట్టింట్లో దోశ మీద ప్రయోగం చేస్తున్న ఓ వీడియో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్ కి చెందినదిగా తెలుస్తోంది. ఒక వ్యక్తి ప్రకాశవంతమైన నీలం దోశను తయారు చేసాడు. అయితే ఈ దోశను చూసిన ఆహార ప్రియులు తయారీదారుడిని తిట్టిపోస్తున్నారు.
ఇక్కడ వీడియో చూడండి
Anyone for blue dosa?Don't know which coloring is used. Any idea @Kumar90659971 ? pic.twitter.com/pjvd1te8Ow
— Shashi Iyengar | Accredited Metabolic Health Coach (@shashiiyengar) December 25, 2023
వైరల్ అవుతున్న వీడియోలో నీలం దోశను తయారు చేయడానికి చెఫ్ రెడీ అయ్యాడు. మొదట పెనం మీద నీలం పిండిని పాన్‌పై వేసి పరిచాడు. అనంతరం ఉప్మా, చీజ్, సాస్ వంటి వాటిని జోడించడం ద్వారా దోసను తయారు చేశాడు. కొంచెం సేపు వేగనిచ్చి బ్లూ దోస రెడీ చేశాడు. అనంతరం కస్టమర్‌కు సర్వ్ చేశాడు.
ఇన్‌స్టాలో @shashiiyengar అనే ఖాతాలో ఈ వీడియో షేర్ చేయబడింది. లక్ష మందికి పైగా ప్రజలు ఈ క్లిప్ చూడగా… అనేక మంది తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ఈ వీడియో చూసిన వారంతా చాలా మంది.. ఇష్టంగా తినే ఆహారంపై ఇటువంటి వింత ప్రయోగాలు చేసేవారిని శిక్షించాలని కోరుతుండగా, మరికొందరు జైలుకు పంపాలని కామెంట్ చేస్తున్నారు. ఒకరు ఈ వంటకం చూడడానికి చాలా బాగుంది.. దీని రుచి ఎలా ఉంటుందో తెలియదు. అదే సమయంలో స్ట్రీట్ ఫుడ్స్ ఎలాగూ వింతగా ఉంటాయి.. సంప్రదాయ ఆహార పదార్థాలతో ఆడుకుంటున్నారని మరో యూజర్ అంటున్నారు.
మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..