Ayodhya: అయోధ్య రామయ్య దర్శనం కోసం ముస్లీం మహిళ పాదయాత్ర.. !
పాదయాత్రతో అలసట వచ్చిన్నప్పటికి తమ ముగ్గురుకి శ్రీ రాముడిపై ఉన్న భక్తి తమను ముందుకు నడిచే విధంగా శక్తిని ఇస్తుందని చెప్పారు. ఈ ముగ్గురు స్నేహితులను కలిసిన పలువురు అందుకు సంబందించిన స్టోరీలను, ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుండడంతో ఈ ముగ్గురు ఇప్పటికే సోషల్ మీడియాలో సంచలనంగా మారారు. రాముని ఆరాధనకు ఏ ప్రత్యేక మతం లేదని.. రామయ్య ఏ ప్రాంతానికి పరిమితం కాదని.. రామయ్య మీద భక్తీ సరిహద్దులను దాటి ప్రపంచం మొత్తాన్ని చుట్టుముడుతుందని షబ్నం గట్టిగా నమ్ముతుంది. "రాముడు కుల, మతాలకు అతీతం అని అతను అందరికీ చెందినవాడు" అని షబ్నమ్ చెబుతుంది.

అయోధ్యలో బాల రామయ్య కొలువు దీరే సమయం ఆసన్నమవుతోంది. కోట్లాది మంది హిందువుల కల తీరే సమయనికి అయోధ్య సర్వాంగసుందరంగా అలంకరించుకుంటుంది. మరోవైపు అయోధ్య రామయ్య సేవలో మేము సైతం అంటూ పలువురు రామయ్య భక్తులు రకరాకాల వస్తువులను కానుకగా సమర్పిస్తున్నారు. అయితే రామయ్య సేవకు నేను సైతం అంటోంది ఓ ముస్లిం యువతి.. కాషాయ జెండా చేతబూని అయోధ్య రామమందిర బ్యానర్ తో రాములోరి గుడికి బయలు దేరింది. మూస పద్ధతులకు సవాల్ చేస్తూ.. సర్వమత సమానత్వాన్ని చాటే విధంగా దేశ ఆర్ధిక రాజధాని ముంబైకి చెందిన షేక్ షబ్నం అనే యువతి ముంబై నుండి అయోధ్యకు పాదయాత్రగా తన ప్రయాణాన్ని ప్రారంభించింది. తన స్నేహితులైన రామన్ రాజ్ శర్మ, వినీత్ పాండేతో కలిసి షబ్నమ్ 1,425 కిలోమీటర్ల దూరం కాలినడకన ప్రయాణించడానికి బయలుదేరింది. ప్రస్తతం షబ్నం వార్తల్లో నిలిచింది. ఎందుకంటే షబ్నమ్ ప్రయాణం ప్రత్యేకమైనది.
జన్మతః ముస్లిం అయిన రాముని పట్ల ఆమెకు అచంచలమైన భక్తి. శ్రీరాముడిని ఆరాధించడానికి హిందువు కానవసరం లేదని షబ్నం గర్వంగా చెబుతుంది. మంచి మనిషిగా ఉండడమే ముఖ్యం. ప్రస్తుతం షబ్నం మధ్యప్రదేశ్‌లోని సింధవకు చేరుకుంది. ప్రతిరోజూ 25-30 కిలోమీటర్లు మేర నడుస్తూ ముంబై నుంచి ఇప్పటికి మధ్యప్రదేశ్ లో అడుగు పెట్టింది.
ఇంతటి సుదీర్ఘ తీర్థయాత్ర చేస్తున్నాం.. పాదయాత్రతో అలసట వచ్చిన్నప్పటికి తమ ముగ్గురుకి శ్రీ రాముడిపై ఉన్న భక్తి తమను ముందుకు నడిచే విధంగా శక్తిని ఇస్తుందని చెప్పారు. ఈ ముగ్గురు స్నేహితులను కలిసిన పలువురు అందుకు సంబందించిన స్టోరీలను, ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుండడంతో ఈ ముగ్గురు ఇప్పటికే సోషల్ మీడియాలో సంచలనంగా మారారు.
రాముని ఆరాధనకు ఏ ప్రత్యేక మతం లేదని.. రామయ్య ఏ ప్రాంతానికి పరిమితం కాదని.. రామయ్య మీద భక్తీ సరిహద్దులను దాటి ప్రపంచం మొత్తాన్ని చుట్టుముడుతుందని షబ్నం గట్టిగా నమ్ముతుంది. “రాముడు కుల, మతాలకు అతీతం అని అతను అందరికీ చెందినవాడు” అని షబ్నమ్ చెబుతుంది. ఈ నమ్మకమే తనను ఇంత దూరం పాదయాత్రగా బయలు దేరడానికి ప్రేరణగా నిలిచింది అని చెప్పింది. అబ్బాయిలు మాత్రమే ఇలాంటి కష్టతరమైన ప్రయాణాలు చేయగలరనే అపోహను సవాలు చేయడం కూడా తన లక్ష్యమని పేర్కొంది.
షబ్నం పాదయాత్రకు సవాళ్లు
అయితే షబ్నం పాదయాత్రకు సవాళ్లు తప్పలేదు. ఆమెకు భద్రత కల్పించడమే కాకుండా ఆమెకు భోజనం, వసతి ఏర్పాట్లు చేయడంలో కూడా పోలీసులు కీలకంగా వ్యవహరిస్తున్నారు. మహారాష్ట్రలోని సున్నితమైన ప్రాంతాల మీదుగా యువతి వెళుతున్నప్పుడు, పోలీసులు ఆమెకు భద్రత కల్పించారు. కొన్ని సమస్యాత్మక పరిస్థితుల నుండి రామయ్య భక్తులకు సహాయం చేశారు. అయితే కాషాయ జెండా పట్టుకుని ముందుకు సాగుతున్నప్పుడు.. ముస్లింలతో సహా అనేక మంది వ్యక్తులు ఆమెకు ‘జై శ్రీరామ్’ అని పలకరిస్తూ సంఘీభావాన్ని తెలియజేశారని షబ్నం పేర్కొంది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..