Ayodhya Kanaka Bhawan: అయోధ్యతో శ్రీకృష్ణుడికి కూడా సంబంధం ఉందని మీకు తెలుసా.. కనక భవనంలో శాసనాలు లభ్యం..
రామ జన్మ భూమి అయోధ్యతో ద్వాపర యుగంలోని శ్రీకృష్ణుడికి కూడా సంబంధం ఉందని మీకు తెలుసా.. ఇందుకు సంబంధించిన ఓ పురాణ కథ ప్రచారంలో ఉంది. శ్రీకృష్ణుడు శ్రీ రాముడి జన్మ భూమి అయోధ్యకు వచ్చాడని పేర్కొన్నారు. ఆ సమయంలో అయోధ్యలో చాలా శిథిలావస్థలో ఉన్న భవనాన్ని చూశాడు. ఆ తర్వాత శ్రీకృష్ణుడు ఈ భవనాన్ని పునరుద్ధరించాడని చెబుతారు. ఈ రోజు అయోధ్యకు శ్రీ కృష్ణుడికి ఉన్న రిలేషన్ గురించి ఆ పౌరాణిక కథను గురించి తెలుసుకుందాం..
జనవరి 22న అయోధ్యలో రామమందిర ప్రతిష్ఠాపన మహోత్సవానికి సన్నాహాలు జరుగుతున్నాయి. దేశం నలుమూలల నుండి భారీ సంఖ్యలో భక్తులు రామయ్య జన్మ భూమికి చేరుకోవడానికి ఏర్పాట్లు చేరుకుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న రామభక్తులు ఈ క్షణం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రామ జన్మ భూమి అయోధ్యతో ద్వాపర యుగంలోని శ్రీకృష్ణుడికి కూడా సంబంధం ఉందని మీకు తెలుసా.. ఇందుకు సంబంధించిన ఓ పురాణ కథ ప్రచారంలో ఉంది. శ్రీకృష్ణుడు శ్రీ రాముడి జన్మ భూమి అయోధ్యకు వచ్చాడని పేర్కొన్నారు. ఆ సమయంలో అయోధ్యలో చాలా శిథిలావస్థలో ఉన్న భవనాన్ని చూశాడు. ఆ తర్వాత శ్రీకృష్ణుడు ఈ భవనాన్ని పునరుద్ధరించాడని చెబుతారు. ఈ రోజు అయోధ్యకు శ్రీ కృష్ణుడికి ఉన్న రిలేషన్ గురించి ఆ పౌరాణిక కథను గురించి తెలుసుకుందాం..
శ్రీ కృష్ణుడు పునర్నిర్మాణం చేశాడా?
హిందూ మతపరమైన కథనాల ప్రకారం జరాసంధుడి సంహారం అనంతరం శ్రీ కృష్ణుడు అయోధ్య నగరానికి వచ్చాడు. ఇక్కడ శిథిలావస్థలో గుట్ట రూపంలో ఉన్న కనక భవనాన్ని కృష్ణుడు చూశాడు. మట్టిదిబ్బను చూసి చాలా సంతోషించిన శ్రీ కృష్ణుడు కోటను మరమ్మత్తు చేసాడు. సీతారాముల విగ్రహాలను కూడా కనక భవన్‌లో ఉంచారు. నేటికీ ఇక్కడ కనిపించే కనక్ భవన్‌లో భద్రపరిచిన మహారాజా విక్రమాదిత్య శాసనాలే ఇందుకు నిదర్శనం.
శ్రీ కృష్ణ భగవానుడు మట్టిదిబ్బపై గొప్ప ఆనందాన్ని అనుభవించాడని, ఆ తర్వాత దానిని మరల మరమ్మత్తు చేయాలని నిర్ణయించుకున్నాడని శ్లోకాలు కూడా వ్రాయబడ్డాయి. మట్టిదిబ్బను మరమ్మతు చేయడంతో పాటు, శ్రీకృష్ణుడు ఆ గుట్టలో రాముడు, సీత దేవి విగ్రహాలను కూడా ప్రతిష్టించాడు. శ్రీకృష్ణుడు అనంతరం కొన్ని యుగాల తరువాత గంధర్వసేన్ కుమారుడు విక్రమాదిత్య మహారాజు కనక భవనాన్ని పునరుద్ధరించాడు.
మహారాజా విక్రమాదిత్య కాలంలో కనక భవననానికి ఓ రేంజ్ లో వైభవం ఉండేది. కానీ కొన్ని వేల సంవత్సరాల తర్వాత ఈ వైభవం మసకబారింది. తర్వాత ఓర్చా రాణి వృషభాను కనక భవనానికి భిన్నమైన వైభవాన్నితీసుకొచ్చింది.
కనక భవనం రాణి కైకేయికి చెందినదా?
అయోధ్యలోని కనక భవనాన్ని దాశరధ మహారాజు మూడో భార్య కైకైయి రాజభవనం అని నమ్ముతారు. దీనిని రాజు దశరథుడు అతని భార్య రాణి కైకాయికి బహుమతిగా ఇచ్చాడు. ఈ భవనాన్ని కైకైయి తమ కోడలైన సీతాదేవికి ఇచ్చినట్లు తెలుస్తోంది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు