Sabarimala Temple: మకర పూజ కోసం రేపు తిరిగి తెరుచుకోనున్న శబరిమల అయ్యప్ప ఆలయం..

మూడు రోజుల అనంతరం రేపు ఆలయాన్ని మకర దీప పూజల కోసం డిసెంబర్ 30న సాయంత్రం 5:00 గంటలకు తిరిగి తెరవబడుతుంది. డిసెంబర్ 31వ తేదీ తెల్లవారుజామున 3:30 గంటల నుంచి నెయ్యి అభిషేకం నిర్వహించనున్నారు.అంతేకాదు జనవరి 13న ప్రసాద శుద్ధక్రియ, 14న బింబ శుద్ధక్రియలను నిర్వహించనున్నారని.. జనవరి 15న మకరజ్యోతి ఉత్సవం జరుగుతుందని ట్రావెన్‌కోర్‌ దేవస్థానం బోర్డు ప్రకటించింది.

Sabarimala Temple: మకర పూజ కోసం రేపు తిరిగి తెరుచుకోనున్న శబరిమల అయ్యప్ప ఆలయం..
Ayyappa Temple
Follow us

|

Updated on: Dec 29, 2023 | 7:56 AM

హరిహర తనయుడు అయ్యప్ప కొలువైన ప్రవిత్ర పుణ్య క్షేత్రం కేరళలోని ప్రఖ్యాత శబరిమల ఆలయం డిసెంబర్ 30న మళ్లీ తిరిగి తెరచుకోనుంది. మకర దీప (మకరవిలక్కు) ఉత్సవాల్లో భాగంగా తిరిగి రేపు అయ్యప్ప ఆలయ ద్వారాలను తెరిచి భక్తులకు స్వామి దర్శనం కల్పించనున్నారు. మకర దీప పూజల కోసం డిసెంబరు 30న సాయంత్రం 5:00 గంటలకు తిరిగి నడక తెరవబడుతుంది.

శబరిమలైలో మండల పూజలతో ఈ ఏడాది మండల కాలం ముగిసింది. దీంతో అయ్యప్ప స్వామి ఆలయం ‘మండల పూజ’ తర్వాత డిసెంబర్ 27న బుధవారం రాత్రి కలశాభిషేకం, కలాపాభిషేకం నిర్వహించారు. అనంతరం బంగారు వస్త్రాన్ని ధరించి ప్రత్యేక పూజలు నిర్వహించి మండల పూజా కార్యక్రమాలను ముగించారు. ఇందులో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. తాత్కాలికంగా మూతపడింది.

మూడు రోజుల అనంతరం రేపు ఆలయాన్ని మకర దీప పూజల కోసం డిసెంబర్ 30న సాయంత్రం 5:00 గంటలకు తిరిగి తెరవబడుతుంది. డిసెంబర్ 31వ తేదీ తెల్లవారుజామున 3:30 గంటల నుంచి నెయ్యి అభిషేకం నిర్వహించనున్నారు.అంతేకాదు జనవరి 13న ప్రసాద శుద్ధక్రియ, 14న బింబ శుద్ధక్రియలను నిర్వహించనున్నారని.. జనవరి 15న మకరజ్యోతి ఉత్సవం జరుగుతుందని ట్రావెన్‌కోర్‌ దేవస్థానం బోర్డు ప్రకటించింది. జనవరి 20 వరకు పాదయాత్ర తెరిచి ఉంటుంది. జనవరి 21వ తేదీ ఉదయం 7:00 గంటలకు పందళం రాజు ప్రతినిధి సమక్షంలో ఊరేగింపు నిర్వహిస్తారు.

ఇవి కూడా చదవండి

శబరిమల ఆదాయం గతేడాది కంటే తక్కువగా ఉందని క్రితం రోజు ప్రకటించిన ట్రావెన్ కోర్ దేవసం బోర్డు ఒక్కసారిగా రూ.18.72 కోట్లు పెరిగినట్లు ప్రకటించింది. లీజు వేలం ఆదాయంతో సహా ఈ ఏడాది మండల  కాలానికి మొత్తం ఆదాయం రూ. 241 , 72, 22,711. కాగా ఇదే సమయంలో గతేడాది రూ.222,98, 70,250. దీంతో గత ఏడాది కంటే ఈ ఏడాది 18.72 కోట్ల ఆదాయం పెరిగినట్లు ట్రావెన్ కోర్ దేవసం బోర్డు అధ్యక్షుడు బి. ఎస్. ప్రశాంత్ వెల్లడించారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

పారిస్ లో చిరంజీవి ఫ్యామిలీ.. స్పెషల్ అట్రాక్షన్‌గా క్లింకార..
పారిస్ లో చిరంజీవి ఫ్యామిలీ.. స్పెషల్ అట్రాక్షన్‌గా క్లింకార..
రంభ, ఊర్వశి, మేనకలను కలగలిపిన అనుపమ అందం.!
రంభ, ఊర్వశి, మేనకలను కలగలిపిన అనుపమ అందం.!
వరుణుడి ప్రతాపం.. ఈ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..
వరుణుడి ప్రతాపం.. ఈ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..
అతనితో కీర్తి సురేశ్ పెళ్లి.. ఫుల్ క్లారిటీ ఇచ్చేసిందిగా..
అతనితో కీర్తి సురేశ్ పెళ్లి.. ఫుల్ క్లారిటీ ఇచ్చేసిందిగా..
కాంటాక్ట్ లెన్స్‌ వల్ల నటి జాస్మిన్ భాసిన్‌కు తీవ్ర అనారోగ్యం..
కాంటాక్ట్ లెన్స్‌ వల్ల నటి జాస్మిన్ భాసిన్‌కు తీవ్ర అనారోగ్యం..
వికసిత్‌ భారత్‌ లక్ష్యం.. నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ
వికసిత్‌ భారత్‌ లక్ష్యం.. నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ
క్యూట్ నెస్ ఓవర్ లోడెడ్.. ఈ క్యూటీపై అందాలకి పడని హృదయం ఉంటుందా.!
క్యూట్ నెస్ ఓవర్ లోడెడ్.. ఈ క్యూటీపై అందాలకి పడని హృదయం ఉంటుందా.!
చిన్న పిల్లాడితో లిప్ కిస్‌లా? ఆ లేడీ యాంకర్ పై చిన్మయి ఆగ్రహం
చిన్న పిల్లాడితో లిప్ కిస్‌లా? ఆ లేడీ యాంకర్ పై చిన్మయి ఆగ్రహం
ఏయే వయసులవారికి ఎంతెంత నిద్ర అవసరమో తెలుసా?
ఏయే వయసులవారికి ఎంతెంత నిద్ర అవసరమో తెలుసా?
రెబల్ స్టార్ ప్రభాస్ సాధించాడు.. ఇక ఇప్పుడు ఈ హీరోల వంతు
రెబల్ స్టార్ ప్రభాస్ సాధించాడు.. ఇక ఇప్పుడు ఈ హీరోల వంతు