India Corona: మళ్ళీ డేంజర్ బెల్స్ మోగిస్తున్న కరోనా.. 24 గంటల్లో 702 కొత్త కేసులు నమోదు.. ప్రభుత్వాలు అప్రమత్తం..
దేశంలో జేఎన్-1 వేరియంట్ కేసులు భారీగా పెరిగాయి. ఇప్పటివరకు 157 కేసులు నమోదయ్యాయి. కేరళలో 78, గుజరాత్‌లో 34, గోవాలో 18 కేసులు వచ్చాయని అధికారులు తెలిపారు. ఇక దేశ రాజధాని ఢిల్లీలో తొలి జేఎన్ 1 కరోనా వేరియంట్ కేసు నమోదైంది. JN-1 సబ్‌వేరియంట్ కేసులు నవంబర్‌లో 16 గుర్తించగా.. డిసెంబర్‌లోనే 141 నమోదయ్యాయి. ఇక కొత్త వేరియంట్ కేసు నమోదు కావడంతో ఢిల్లీ సర్కార్ అప్రమత్తమైంది.
దేశంలో మళ్లీ కరోనా వైరస్ చాప కింద నీరు లాగా వ్యాప్తి చెందుతోంది. రోజు రోజుకూ కొత్త కేసుల సంఖ్య, మరణాల సంఖ్య పెరుగుతుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఇటు JN-1 వేరియంట్ కేసులు కూడా వేగంగా విస్తరిస్తున్నాయి. మరోసారి కరోనా వైరస్ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. ఓవైపు కరోనా కేసులు పెరుగుతుండగా.. మరోవైపు JN-1 వేరియంట్ కేసులు కూడా భారీగా నమోదవుతున్నాయి. కొత్త వేరియంట్ JN 1 కారణంగానే దేశంలో కరోనా కేసుల్లో భారీగా పెరుగుదల కనిపిస్తోందని నిపుణులు చెప్తున్నారు.
కొన్ని వారాలుగా అనేక రాష్ట్రాల్లో కొవిడ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. 24 గంటల్లో 702 కొత్త కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 4,097కు చేరింది. కొత్తగా ఆరు మరణాలు సంభవించాయని అధికారులు ప్రకటించారు. కరోనాతో మహారాష్ట్రలో ఇద్దరు, కర్ణాటక, కేరళ, పశ్చిమ బెంగాల్, ఢిల్లీల్లో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు.
దేశంలో జేఎన్-1 వేరియంట్ కేసులు భారీగా పెరిగాయి. ఇప్పటివరకు 157 కేసులు నమోదయ్యాయి. కేరళలో 78, గుజరాత్‌లో 34, గోవాలో 18 కేసులు వచ్చాయని అధికారులు తెలిపారు. ఇక దేశ రాజధాని ఢిల్లీలో తొలి జేఎన్ 1 కరోనా వేరియంట్ కేసు నమోదైంది. JN-1 సబ్‌వేరియంట్ కేసులు నవంబర్‌లో 16 గుర్తించగా.. డిసెంబర్‌లోనే 141 నమోదయ్యాయి. ఇక కొత్త వేరియంట్ కేసు నమోదు కావడంతో ఢిల్లీ సర్కార్ అప్రమత్తమైంది. అన్ని కొవిడ్ పాజిటివ్ కేసులకు జీనోమ్ సీక్వెన్సింగ్ చేపట్టాలని అధికారులను ఆదేశించింది. తద్వారా కొత్త వేరియంట్లను నిర్ధారించవచ్చని భావిస్తోంది.
ప్రస్తుతం వ్యాప్తిస్తున్న జేఎన్-1 వేరియంట్‌తో భయం అవసరం లేదని డాక్టర్లు చెబుతున్నారు. సరైన జాగ్రత్తలు తీసుకుంటే వైరస్ వ్యాప్తిని అరికట్టవచ్చని సూచిస్తున్నారు. మాస్కులు తప్పనిసరిగా ఉపయోగించాలని తెలిపారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వ్యాక్సిన్‌లతో జేఎన్ 1 వేరియంట్ నుంచి కూడా రక్షిస్తాయని WHO ప్రకటించింది.
మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో కరోనా కలవరం రేపుతోంది. రోజు రోజుకు కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. కొత్తగా మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న ఓ వైద్యుడికి కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..