Ayodhya: ప్రాణ ప్రతిష్టకు 7 రోజుల ముందు నుంచే పూజలు.. రామయ్య కళ్లకు కాటుక దిద్దనున్న ప్రధాని మోడీ…
జనవరి 22న అయోధ్యలో రామ్ లల్లా పవిత్రోత్సవం జరగనుంది.. అయితే ప్రాణ ప్రతిష్ట ముహార్తానికి ఏడు రోజుల ముందు పూజలు అంటే జనవరి 15న ప్రారంభమవుతాయి. ప్రాణ ప్రతిష్ట పూజతో పాటు స్వామివారికి బంగారు వస్త్రాలను సమర్పించి ధరింపజేయనున్నారు. ప్రాణ ప్రతిష్ఠా కార్యక్రమంలో ప్రధాని మోడీ తో పాటు ఉత్తరప్రదేశ్ సీఎం యాగీ ఆదిత్యనాథ్, గవర్నర్ ఆనంద్ బెన్ పటేల్ కూడా గర్భగుడిలో హాజరుకానున్నారు. దీంతో పాటు సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ కూడా హాజరవుతారనే వార్తలు వినిపిస్తున్నాయి.

రామ జన్మ భూమి అయోధ్య సర్వాంగ సుందరంగా అలంకరిస్తున్నారు. ఎక్కడ చూసినా జై శ్రీరామ్ జై శ్రీరామ్ అన్న జయజయధ్వానాలు మిన్నంటుతున్నాయి. తోరణాలు నిర్మించి పూలవర్షం కురిపించేందుకు సన్నాహాలు కూడా చేస్తున్నారు. గత 500 ఏళ్ల క్రితం నుంచి ఉన్న నిరీక్షణకు మరికొన్ని రోజుల్లో తెరపడుతోంది. బాల రామయ్య ప్రాణ ప్రతిష్ఠా మహోత్సవంతో రామభక్తుల నిరీక్షణ జనవరి 22న ముగుస్తుంది. ప్రాణ ప్రతిష్ఠా కార్యక్రమంలో ప్రధాని మోడీ స్వయంగా రామ్ లల్లా విగ్రహానికి కర్టెన్ తొలగించి, రామయ్యని పూజిస్తారు.
జనవరి 22న అయోధ్యలో రామ్ లల్లా పవిత్రోత్సవం జరగనుంది.. అయితే ప్రాణ ప్రతిష్ట ముహార్తానికి ఏడు రోజుల ముందు పూజలు అంటే జనవరి 15న ప్రారంభమవుతాయి. ప్రాణ ప్రతిష్ట పూజతో పాటు స్వామివారికి బంగారు వస్త్రాలను సమర్పించి ధరింపజేయనున్నారు. ప్రాణ ప్రతిష్ఠా కార్యక్రమంలో ప్రధాని మోడీ తో పాటు ఉత్తరప్రదేశ్ సీఎం యాగీ ఆదిత్యనాథ్, గవర్నర్ ఆనంద్ బెన్ పటేల్ కూడా గర్భగుడిలో హాజరుకానున్నారు. దీంతో పాటు సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ కూడా హాజరవుతారనే వార్తలు వినిపిస్తున్నాయి. రామ జన్మభూమి ప్రధాన వాస్తుశిల్పి ఆచార్య సత్యేంద్ర దాస్ పూజలు నిర్వహించనున్నారు.
https://www.facebook.com/reel/1602103140564026
ముఖ్య అతిథిగా ప్రధాని మోడీ
రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. రామ జన్మభూమి ప్రధాన వాస్తుశిల్పి ఆచార్య సత్యేంద్ర దాస్ ఈ విషయంపై స్పందిస్తూ రామ్ లల్లా విగ్రహం కర్టెన్‌ను ప్రధాని నరేంద్ర మోడీ మాత్రమే తొలాగిస్తారని చెప్పారు. అనంతరం రామయ్యకు కాటుకని దిద్ది.. విగ్రహానికి బంగారు వస్త్రాలు ధరింపజేయనున్నారని తెలిపారు. అనంతరం పూజ .. 56 నైవేద్యాలను సమర్పిస్తారని వెల్లడించారు. ప్రాణ ప్రతిష్టకు ముందుగా బాల రామయ్య విగ్రహాన్ని నగర పర్యటనకు తీసుకుని వెళ్లనున్నారని వెల్లడించారు.
పాత విగ్రహం పక్కనే కొత్త విగ్రహం
కొత్త విగ్రహానికి మాత్రమే రామ్ లల్లా దీక్షా కార్యక్రమం జరగనుంది. ఆచార్య సత్యేంద్ర ప్రకారం పాత విగ్రహం కూడా అక్కడే ఉంటుంది. కొత్త విగ్రహం పాతదాని కంటే పెద్దదిగా ఉంటుంది. ఒకే చోట అమర్చబడుతుంది. అయితే పాత విగ్రహాన్ని పూజాదికార్యక్రమాల సమయంలో నగర పర్యటనకు, ఇతర కార్యక్రమాల సమయంలో తీసుకుని వెళ్ళడానికి ఉపయోగించనున్నారు. పూజ కార్యక్రమం 84 సెకన్ల శుభ సమయంలో జరుగుతుంది. అయితే పూజ ఎక్కువసేపు ఉంటుంది. ప్రాణ ప్రతిష్ఠకు ముందు, ప్రాణ ప్రతిష్ఠకు కొన్ని రోజుల ముందు నవగ్రహ పూజను నిర్వహించనున్నారు.
సరయు నీటితో ఆలయం శుద్ధి.. 56 నైవేద్యాలు
సంప్రోక్షణకు ముందు సరయూ నది నుంచి నీటిని తీసుకొచ్చి ఆలయాన్ని శుద్ధి చేస్తారు. రామ జన్మభూమిలో పూజలు జనవరి 15వ తేదీ నుంచి ప్రారంభమవుతాయి ప్రధాన పూజారి సత్యేంద్ర దాస్ వెల్లడించారు. రామ్ లల్లాకు 56 రకాల నైవేద్యాలను సమర్పిస్తారు. శ్రీ రాముడు లంకను జయించి అయోధ్యకు తిరిగి వచ్చినప్పుడు ఆ రోజు అయోధ్యలోని ప్రతి ఇంట్లో రకరకాల ఆహారాన్ని తయారు చేశారు. అందుకే జనవరి 22న ప్రాణ ప్రతిష్ఠా మహోత్సవంలో 56 రకాల నైవేద్యాల సమర్పణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
స్వాగత ద్వారం అలంకరణ
అయోధ్యలో చాలా కాలం క్రితమే సన్నాహాలు ప్రారంభించారు. స్వాగత ద్వారాన్ని అలంకరించారు. ఆలయ మొదటి అంతస్తు నిర్మాణం కూడా దాదాపు పూర్తయింది. రాంనగరి స్వరూపం, రంగు చాలా భిన్నంగా.. ప్రత్యేకంగా కనిపిస్తుంది. కూడలి.. అక్కడ ఉన్న శ్రీరాముని విగ్రహంతో అలంకరించబడింది. అయోధ్య నగర ప్రవేశ ద్వారం వద్ద సూర్యదేవుడు స్వయంగా ఏడు గుర్రాలపై స్వారీ చేస్తూ రాముని భక్తులను స్వాగతించనున్నాడు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..