Andhra Pradesh: విదేశాల్లో చదివినా సొంతూర్లోనే వైద్యశాల.. బెస్ట్ సర్జన్‌గా గుర్తింపు.. రేర్ ఆపరేషన్స్ కోసం విదేశీయులు సైతం క్యూ..
విదేశాల్లో పిజి చదివిన మోహన రావు అక్కడే స్థిర పడకుండా తన సొంతూరు ఇంకొల్లుకు దగ్గరా ఉన్న గుంటూరులో నాలుగేళ్ల క్రితం ప్రాక్టీసు ప్రారంభించారు. అన్ని కార్పోరేట్ల ఆసుపత్రుల్లా కాకుండా అత్యాధునిక పరికరాలతో ఆసుపత్రిని ప్రారంభించడమే కాకుండా రేర్ ఆపరేషన్లను అత్యంత్య విజయవంతంగా పూర్తి చేస్తున్నారు. అంతే కాకుండా అతి తక్కువ ఖర్చుతో క్లిష్టతరమైన శస్త్రచికిత్సలు చేస్తుండటంతో ఆయనకు విదేశాల్లో సైతం మంచి పేరు వచ్చింది.
వివిధ రంగాల్లో విశిష్ట ప్రతిభ కనబరిచి సమాజానికి మెరుగైన సేవ చేస్తున్న వారిని గుర్తించి ప్రతి ఏటా అటల్ అచీవ్ అవార్డులను అందిస్తుంది టాప్ నాచ్ పౌండేషన్. అయితే ఈ ఏడాది వైద్య రంగంలో ముఖ్యంగా న్యూరో విభాగంలో అద్భుతమైన విజయాలు సాధిస్తున్న గుంటూరు వైద్యుడు పాటిబండ్ల మోహన్ రావును అటల్ అచీవ్ అవార్డుకు ఎంపిక చేసింది. బెస్ట్ న్యూరో, బెస్ట్ స్పైన్ సర్జన్ గా గుర్తించి అవార్డును అందించింది.
దేశంలో అనేక మంది న్యూరో సర్జన్ లు ఉండగా గుంటూరు లాంటి చిన్న సిటీలో డాక్టర్ ను అవార్డు వరించడంపై ఆయన చేస్తున్న రేర్ ఆపరేషన్లే కారణమని అవార్డు నిర్వాహాకులు తెలిపారు. విదేశాల్లో పిజి చదివిన మోహన రావు అక్కడే స్థిర పడకుండా తన సొంతూరు ఇంకొల్లుకు దగ్గరా ఉన్న గుంటూరులో నాలుగేళ్ల క్రితం ప్రాక్టీసు ప్రారంభించారు. అన్ని కార్పోరేట్ల ఆసుపత్రుల్లా కాకుండా అత్యాధునిక పరికరాలతో ఆసుపత్రిని ప్రారంభించడమే కాకుండా రేర్ ఆపరేషన్లను అత్యంత్య విజయవంతంగా పూర్తి చేస్తున్నారు. అంతే కాకుండా అతి తక్కువ ఖర్చుతో క్లిష్టతరమైన శస్త్రచికిత్సలు చేస్తుండటంతో ఆయనకు విదేశాల్లో సైతం మంచి పేరు వచ్చింది.
దీంతో విదేశీయులు సైతం గుంటూరు వచ్చి ఆపరేషన్లు చేయించుకుంటున్నారు. గత నాలుగైదు నెలల్లోనే దాదాపు ముగ్గురు విదేశీయులు ఇక్కడకు వచ్చి శస్త్రచికిత్సలు చేయించుకున్నారు. పోర్చుగల్, లండన్ కు చెందిన ఇద్దరూ మహిళలు ఇక్కడకు వచ్చి మూడు నెలల క్రితం ఆపరేషన్ చేయించుకున్నారు. ఆ తర్వాత దుబాయ్ కు చెందిన దేయా మోహ్మద్ కూడా ఇక్కడే శస్త్ర చికిత్స చేయించుకున్నాడు. పిట్యుటరీ గ్లాడ్ సమస్యతో సతమతమవుతున్న మోహ్మద్ కు ఆరేషన్ చేసి మోహన్ రావు నయం చేశారు.
దీంతో విదేశీయులు మోహన్ రావు వద్ద వైద్యం చేయించుకునేందుకు క్యూ కడుతున్నారు. ఈ విషయాన్ని తెలసుకున్న టాప్ నాచ్ పౌండేషన్ ఈ ఏడాది న్యూరో విభాగంలో మోహన రావును బెస్ట్ డాక్టర్ గా గుర్తించింది. డిసెంబర్ 19న ఢిల్లీలో జరిగిన అవార్డుల ప్రధానోత్సవంలో కేంద్ర మంత్రుల చేతుల మీదుగా డాక్టర్ మోహన్ రావు అవార్డును అందుకున్నారు. మెట్రో పాలిటిన్ సిటీస్ కే పరిమితం కాకుండా తాను పుట్టిపెరిగి చదువుకున్న ప్రాంతంలో మెరుగైన వైద్య సేవలు అందించాలన్న సంకల్పంతో గుంటూరులో ప్రాక్టీస్ చేస్తున్నట్లు మోహన్ రావు తెలిపారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..