AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dog Tails : కుక్క తోక ఎందుకు వంకరగానే ఉంటుంది.. దీని వెనుక కారణం ఇదేనట..!

అయితే, ఇప్పుడు కుక్క తోకను సరిచేయగలరా అనే ప్రశ్న తలెత్తుతోంది. ఈ రోజుల్లో, కుక్క తోకను నిఠారుగా చేసే అనేక శస్త్రచికిత్సా విధానాలు కూడా అందుబాటులోకి వచ్చాయి. అయితే కుక్క తోకను ఈ విధంగా నిటారుగా చేయడం కుక్క ఆరోగ్యానికి మంచిది కాదని అంటున్నారు పశువైద్యులు. ఈ సర్జరీలో సర్జన్ కుక్క ఎముకలను విరగ్గొట్టి, వాటిని తిరిగి అమర్చడం వల్ల ఆ కుక్క చాలా నొప్పిని భరించాల్సి వస్తుంది. అది దాని ఆరోగ్యంపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుంది. అందుకే..

Dog Tails : కుక్క తోక ఎందుకు వంకరగానే ఉంటుంది.. దీని వెనుక కారణం ఇదేనట..!
Dog Tails
Jyothi Gadda
|

Updated on: Dec 29, 2023 | 6:28 PM

Share

కుక్క తోకకు గుండు కట్టినా సరే.. అది సక్కగా మారదు అనేది నానుడి.. అయితే, ఇది కేవలం సామెత మాత్రమే కాదు.. వాస్తవం కూడా ఇదే.. ఎవరైనా చెప్పిన మాట వినకుండా.. తమలోని తప్పుడు అలవాట్లను, వక్రబుద్దిని మార్చుకోలేదంటే వారిని కుక్క తోకతో పోల్చి ఈ మాట చెబుతుంటారు..అయితే, కుక్కల తోక గుండ్రంగా, వంకరగా కాకుండా కుక్క తోక నిటారుగా ఉండే కొన్ని జాతి కుక్కలు కూడా ప్రపంచంలో ఉన్నాయి. కొన్ని కుక్కలకు తోకలు ఉండవు. ఇకపోతే, కుక్కల తోకలు సాధారణంగా ఎందుకు వంకరగా ఉంటాయో తెలుసా..? అయితే దీనికి కారణం కూడా ఉందట.? కుక్క తోక నిటారుగా కాకుండా వంకరగా ఎందుకు ఉంటుందనేది ఆసక్తికరమైన ప్రశ్న.

అయితే, ముందుగా ఇక్కడో విషయం గుర్తుంచుకోవాలి.. ప్రతి కుక్కకు వంకర తోక ఉండదని అర్థం చేసుకోవాలి. కుక్క తోక వంకరగా ఉంటుందా లేదా అనేది దాని జాతి, దాని జన్యువులపై ఆధారపడి ఉంటుంది. చాలా వరకు ఇది శతాబ్దాలుగా కుక్క పరిణామం కారణంగానే ఏర్పడుతుంది. కుక్కకు వంకర తోక అవసరమైతే, పరిణామ సిద్ధాంతం ద్వారా, దాని తోక కొన్ని తరాలలో అభివృద్ధి చెందుతుందని శాస్త్రవేత్తలు నమ్ముతారు.

కుక్కల వంకర తోక వాటి పరిణామ సమయంలో వాటి అవసరాల కారణంగా ఉద్భవించింది. చాలా మంది నిపుణులు చల్లని ప్రాంతాల్లో నివసించే కుక్కల పూర్వీకులు తరచుగా తమ తోకలను వంకరగా ఉంచవలసి ఉంటుందని చెబుతారు. చాలా సార్లు అవి విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు తన తోకను తన ముక్కుపై ఉంచుకుంటుందట. తద్వారా అవి వెచ్చదనం పొందుతాయి. అలా తోక తిప్పే ఈ అలవాటు శాశ్వతంగా ఉండిపోయింది.

ఇవి కూడా చదవండి

అయితే, ఇప్పుడు కుక్క తోకను సరిచేయగలరా అనే ప్రశ్న తలెత్తుతోంది. ఈ రోజుల్లో, కుక్క తోకను నిఠారుగా చేసే అనేక శస్త్రచికిత్సా విధానాలు కూడా అందుబాటులోకి వచ్చాయి. అయితే కుక్క తోకను ఈ విధంగా నిటారుగా చేయడం కుక్క ఆరోగ్యానికి మంచిది కాదని అంటున్నారు పశువైద్యులు. ఈ సర్జరీలో సర్జన్ కుక్క ఎముకలను విరగ్గొట్టి, వాటిని తిరిగి అమర్చడం వల్ల ఆ కుక్క చాలా నొప్పిని భరించాల్సి వస్తుంది. అది దాని ఆరోగ్యంపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుంది. అందుకే జంతుప్రేమికులు, పశువైద్యులు దీన్ని వ్యతిరేకిస్తున్నారు.

ఇకపోతే, తోకలు నిటారుగా ఉండే అనేక రకాల కుక్కలు ఉన్నాయి. వీటిలో బసెన్జీ మరియు ఫారో హౌండ్స్ ప్రముఖమైనవి. తోక నిటారుగా ఉండే కొన్ని మిశ్రమ జాతి కుక్కలు కూడా ఉన్నాయి. అటువంటి కుక్కలలో సహజంగా వాటి తోక నేరుగా ఉంటుంది. ఇది ఎలాంటి రుగ్మతకు సంకేతం కాదు. అలాగే, ఈ ప్రపంచంలో తోకలు లేని అనేక రకాల కుక్కలు కూడా ఉన్నాయి. వీటిలో ఫ్రెంచ్ బుల్ డాగ్, బోస్టన్ టెర్రియర్, వెల్ష్ కార్గి వంటి జాతులు ప్రముఖమైనవి. అదే సమయంలో, చాలా కుక్కలు కూడా కనిపిస్తాయి, వాటిలో తోక కనిపించదు ఎందుకంటే వాటి యజమానులు తోకను కత్తిరించుకుంటారు. పెంపుడు కుక్కల తోకను కత్తిరించడం పాశ్చాత్య దేశాల్లో సాధారణ విషయం.

మీ ఇంట్లో కూడా పెంపుడు కుక్క ఉండి ఉంటే.. దాని తోక ఇప్పటికే సహజంగా వంకరగా ఉంటే అది ప్రమాదం ఏం కాదు..కానీ మీ కుక్క తోక అకస్మాత్తుగా వంకరగా లేదా విపరీతంగా వంకరగా మారినట్లయితే, అది ఆందోళన కలిగించే విషయం. కుక్క తోక వంకరగా మారటం దాని నొప్పికి కారణంగా గుర్తించాలంటున్నారు. కుక్క తన తోకను ఊపుతూ ఉంటే, అప్పుడు ఎటువంటి సమస్య లేదు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..