82 ఏళ్ల వృద్ధురాలిపై డాక్టర్ దాష్టీకం.. ఆపరేషన్ సమయంలో పంచ్ దెబ్బలతో.. వైరలవుతున్న వీడియో..
అత్యవసర పరిస్థితిలో వృద్ధ రోగిని వైద్యుడు చికిత్స చేసినట్లు ఆసుపత్రి తన ప్రకటనలో తెలిపింది. ఆపరేషన్ సమయంలో ఆమె తన కళ్లను తాకడానికి ప్రయత్నిస్తోందని, అలా కళ్లను తాకడం వల్ల ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉందని, ఆ వృద్ధురాలిని ఈ ప్రమాదం నుంచి కాపాడాలనే వైద్యుడు అలా చేయాల్సి వచ్చిందని చెప్పింది. కానీ, మహిళ నుదిటిపై గాయం గుర్తులు కూడా కనిపించాయని స్థానిక అధికారులు తెలిపారు.
ఓ ఆసుపత్రిలో ఒక వైద్యుడు 82 ఏళ్ల వృద్ధురాలిని ఆపరేషన్ సమయంలో కొట్టాడు. ఈ వీడియో వైరల్ కావడంతో ఆసుపత్రి డాక్టర్, CEO ను తొలగించి, మహిళకు పరిహారం ఇచ్చింది. ఈ ఘటన తర్వాత తన తల్లి ఎడమ కన్ను చూపు కోల్పోయిందని బాధిత మహిళ కుమారుడు ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ షాకింగ్ చైనాలో చోటు చేసుకుంది. ప్రస్తుతం వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రోగికి వైద్యులే దేవుడని చెబుతుంటారు.. కానీ ఒక్కోసారి ఇలాంటి ఉదంతాలు ఆసుపత్రుల నుంచి వెలుగులోకి వస్తూంటే ఆ మాటలు నమ్మడం కష్టమవుతుంది. చైనా నుండి అలాంటి ఒక కేసు వచ్చింది. అక్కడ ఒక వైద్యుడు 82 ఏళ్ల మహిళా రోగిని ఆపరేషన్ సమయంలో ఆమె కళ్లపై పదే పదే కొట్టడం తీవ్ర కలకలం రేపింది.
ఈ షాకింగ్ సంఘటన 2019 లో చైనాలోని గుయిగాంగ్ నగరంలోని ఒక ఆసుపత్రిలో జరిగింది. వృద్ధురాలు కంటి ఆపరేషన్ కోసం ఆసుపత్రిలో చేరింది. ఆసుపత్రిలో చేర్చిన తర్వాత వైద్యులు ఆమెకు లోకల్ అనస్థీషియా ఇచ్చారు. లోకల్ అనస్థీషియా సాధారణంగా శరీరంలోని చిన్న ప్రాంతాన్ని మత్తులో ఉంచే ఇంజెక్షన్. అయితే, 82 ఏళ్ల రోగిపై అనస్థీషియా ప్రభావం చూపలేదు. శస్త్రచికిత్స సమయంలో ఆమె తల, కళ్లను కదిలించింది. దాంతో అతడు వారి భాషలో ఆమెకు అలా చేయవద్దని డాక్టర్ సూచించినప్పుడు, ఆమెకు అర్థం కాలేదు. ఎందుకంటే వృద్ధురాలికి స్థానిక భాష మాత్రమే అర్థమవుతుంది. ఆ డాక్టర్ మాట్లాడిన బాష ఆమెకు తెలియదు. అందుకే ఆమె పదే పదే అదే విధంగా తల, కళ్లను కదిలించటం చేస్తూ వచ్చింది. వృద్ధురాలిని ఆపడానికి, సర్జన్ ఆమెను గట్టిగా కొట్టాడు. వీడియోలో, డాక్టర్ కొట్టిన దెబ్బలకు ఆ వృద్ధురాలు మూలుగుతున్న శబ్దం కూడా వినబడుతుంది.
ఈ సంఘటన మొత్తం సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. డాక్టర్ ఐ ఫెన్ దానిని చైనా సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ వెయిబో షేర్ చేశారు. వుహాన్‌లో కరోనావైరస్ వ్యాప్తిని నివేదించిన వైద్యుల బృందంలో ఫెన్ కూడా ఉన్నాడు. ఈ వీడియో వైరల్ కావడంతో ఆసుపత్రి ప్రజల ఆగ్రహానికి గురైంది. ఈ కారణంగా ఆసుపత్రి మాతృ సంస్థ ఎయిర్ చైనా ఆరోపణలు ఎదుర్కొంటున్న డాక్టర్, సీఈఓను తొలగించింది.
View this post on Instagram
ఆ తరువాత, అత్యవసర పరిస్థితిలో వృద్ధ రోగిని వైద్యుడు చికిత్స చేసినట్లు ఆసుపత్రి తన ప్రకటనలో తెలిపింది. ఆపరేషన్ సమయంలో ఆమె తన కళ్లను తాకడానికి ప్రయత్నిస్తోందని, అలా కళ్లను తాకడం వల్ల ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉందని, ఆ వృద్ధురాలిని ఈ ప్రమాదం నుంచి కాపాడాలనే వైద్యుడు అలా చేయాల్సి వచ్చిందని చెప్పింది. కానీ, మహిళ నుదిటిపై గాయం గుర్తులు కూడా కనిపించాయని స్థానిక అధికారులు తెలిపారు.
ఎట్టకేలకు ఆసుపత్రి వృద్ధురాలికి క్షమాపణ చెప్పి, ఆమెకు 500 యువాన్లు అంటే రూ. 5,800 పరిహారం ఇచ్చింది. అయితే, సంఘటన తర్వాత ఆ వృద్ధురాలు ఎడమ కంటి చూపు కోల్పోయిందని మహిళ కుమారుడు పేర్కొన్నాడు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..