AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: శృంగారం చేద్దామని భర్తను పిలిచింది.. మంచానికి కాళ్లు, చేతులు కట్టేసి.! కట్ చేస్తే..

భర్త చేసిన ఓ పెద్ద తప్పుకు.. ఎవ్వరూ వెయ్యనటువంటి పెద్ద శిక్షను వేసింది ఓ భార్య. ఈ సంఘటన బ్రెజిల్‌లో చోటు చేసుకుంది. అసలు ఆ భార్య ఏ శిక్ష వేసిందో తెలిస్తే.. చివరికి ఏం జరిగిందో తెలిస్తే.. దెబ్బకు షాక్ అవ్వడం ఖాయం. ఇంతకీ ఆ స్టోరీ ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా..!

Viral: శృంగారం చేద్దామని భర్తను పిలిచింది.. మంచానికి కాళ్లు, చేతులు కట్టేసి.! కట్ చేస్తే..
Representative Image
Ravi Kiran
|

Updated on: Dec 28, 2023 | 11:55 AM

Share

భర్త చేసిన ఓ పెద్ద తప్పుకు.. ఎవ్వరూ వెయ్యనటువంటి పెద్ద శిక్షను వేసింది ఓ భార్య. ఈ సంఘటన బ్రెజిల్‌లో చోటు చేసుకుంది. అసలు ఆ భార్య ఏ శిక్ష వేసిందో తెలిస్తే.. చివరికి ఏం జరిగిందో తెలిస్తే.. దెబ్బకు షాక్ అవ్వడం ఖాయం. ఇంతకీ ఆ స్టోరీ ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా..!

వివరాల్లోకి వెళ్తే.. బ్రెజిల్‌కు చెందిన ఓ మహిళ.. తన భర్త జననాంగాలు కోసేసిన ఘటనలో పోలీసుల ఎదుట లొంగిపోయింది. తన 15 ఏళ్ల టీనేజ్ మేనకోడలితో భర్త సెక్స్‌ చేశాడన్న నిజం తెలుసుకున్నాక.. భార్య అతడి జననాంగాలను కోసేసి టాయిలెట్‌లో ఫ్లష్ చేసేసింది. ఇక్కడ ఇంకో షాకింగ్ విషయమేమిటంటే.. తెగిపడిన భర్త ప్రైవేటు భాగాలను ఫ్లష్ చేసే ముందు ఫోటో కూడా తీసింది సదరు నిందితురాలు. ఆ తర్వాత పోలీసుల ఎదుట లొంగిపోయింది.

భర్తను కింకీ సెక్స్‌కు ఒప్పించిన సదరు మహిళ.. అందులో భాగంగా అతడి చేతులు, కాళ్లను మంచానికి కట్టి వేసింది. అనంతరం రేజర్‌తో అతడిపై దాడి చేసి.. జననాంగాలను కత్తిరించింది. వాటిని ఫోటో తీసి.. ఆ తర్వాత టాయిలెట్‌లో ఫ్లష్ చేసింది. అనంతరం నిందితురాలు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయింది. జాతీయ మీడియాలో వచ్చిన నివేదిక ప్రకారం.. ‘గుడ్ ఈవెనింగ్ ఆఫీసర్, నన్ను నేను పరిచయం చేసుకుంటున్నా. నేను నా భర్త జననాంగాలను కత్తిరించేశాను’ అని ఆమె పోలీసులకు తెలిపింది.

ఆ అవయవాన్ని ఎందుకని టాయిలెట్‌లో విసిరేశారని పోలీసులు ఆమెను ప్రశ్నించగా.. ‘దాన్ని మళ్లీ అతికించవచ్చునని ఎక్కడో చూశానని.. అందుకే అలా చేశానని చెప్పింది’. ఇక ఆమె ఇచ్చిన ఆన్సర్‌కు షాక్ అవ్వడం పోలీసుల వంతైంది. కాగా, దాడికి గురైన భర్త ఆరోగ్యం ఇప్పుడు ఎలా ఉందో.. వివరాలు ఏం తెలియకపోగా.. నిందితురాలిపై మర్డర్ కేసు నమోదు చేసి.. విచారణ జరుపుతున్నారు పోలీసులు. ప్రాధమిక విచారణలో తన భర్త.. తన 15 ఏళ్ల మేనకోడలితో సెక్స్‌లో పాల్గొనడం వల్లే ఇలా చేశానని మహిళ నిజాన్ని ఒప్పుకుంది. ఇదిలా ఉంటే.. సెక్స్‌కి బ్రెజిల్‌లో సమ్మతి కోరే చట్టపరమైన వయస్సు 14 సంవత్సరాలు.. కానీ అక్కడ 14 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న మైనర్‌లతో లైంగిక కార్యకలాపాలకు వ్యతిరేకంగా కఠినమైన చట్టాలు ఉన్నాయి. దీంతో సదరు వ్యక్తి, యువతి మధ్య సంబంధం ఉందా, యువతి అంగీకారంతోనే ఇదంతా జరిగిందా.? అనే పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.