జమ్ముకశ్మీర్‌లో రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ పర్యటన…ఎన్‌కౌంటర్ మృతుల కుటుంబాలకు పరామర్శ
ఈ ఘటన తరువాత పూంచ్‌లో ముగ్గురు సామాన్య పౌరులు ఆర్మీ కస్టడీలో చనిపోవడంపై రాజ్‌నాథ్ ఆందోళన వ్యక్తం చేశారు. పౌరుల రక్షణ ముఖ్యమని , ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకోవాలని ఆర్మీ అధికారులకు సూచించారు. ఈ ఘటనలో మరణించిన సైనికులకు నివాళులు అర్పిస్తూ, వారి త్యాగానికి ఈ ధైర్యవంతులకు దేశం రుణపడి ఉంటుందని సింగ్ ఉద్ఘాటించారు. దేశ ప్రయోజనాలను కాపాడడమే కాకుండా ప్రజల హృదయాలను గెలుచుకోవడం కూడా సాయుధ బలగాల కర్తవ్యాన్ని ఆయన గుర్తు చేశారు.

జమ్ముకశ్మీర్‌లో రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ పర్యటించారు. గత వారం ఉగ్రదాడి జరిగిన పూంచ్ సెక్టార్‌లో పర్యటించారు రాజ్‌నాథ్. డిసెంబర్ 21న నలుగురు భారత ఆర్మీ సైనికుల ప్రాణాలను బలిగొన్న ఆకస్మిక దాడిలో విషాదకరంగా ప్రాణాలు కోల్పోయిన ముగ్గురు పౌరుల కుటుంబాలను పరామర్శించారు. రక్షణశాఖ మంత్రి పర్యటన సందర్భంగా కశ్మీర్‌లో గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. కశ్మీర్‌లో సెక్యూరిటీపై ఆర్మీ అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు రాజ్‌నాథ్. ఉగ్రవాదులు-ఆర్మీ మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో చాలామంది పౌరులకు కూడా గాయాలయ్యాయి. రాజౌరి ఆస్పత్రిలో చికిత్స పొందుతును వాళ్లను పరామర్శించారు రాజ్‌నాథ్. మెరుగైన చికిత్స అందించాలని అధికారులను కోరారు.
రాజౌరిలో గత వారం ఉగ్రదాడిలో ఐదుగురు ఆర్మీ జవాన్లు చనిపోవడం తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనను చాలా సీరియస్‌గా తీసుకుంది కేంద్రం. ఆర్మీ జవాన్లను దాడి చేసిన ముష్కరులను విడిచిపెట్టవద్దన్నారు రాజ్‌నాథ్. పూంచ్ సెక్టార్‌లో ఇప్పటికే భద్రతను కట్టుదిట్టం చేశారు. అదనపు బలగాలతో ఆ ప్రాంతాన్ని అణువణువు జల్లెడ పడుతున్నారు.
రాజౌరి సెక్టార్‌లో పాకిస్తాన్ నుంచి 30 మంది ఉగ్రవాదులు చొరబడినట్టు ఇప్పటికే నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఈ ఉగ్రమూకే ఆర్మీ కాన్వాయ్‌పై దాడి చేసినట్టు తెలుస్తోంది. ఈ ఘటన తరువాత పూంచ్‌లో ముగ్గురు సామాన్య పౌరులు ఆర్మీ కస్టడీలో చనిపోవడంపై రాజ్‌నాథ్ ఆందోళన వ్యక్తం చేశారు. పౌరుల రక్షణ ముఖ్యమని , ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకోవాలని ఆర్మీ అధికారులకు సూచించారు. ఈ ఘటనలో మరణించిన సైనికులకు నివాళులు అర్పిస్తూ, వారి త్యాగానికి ఈ ధైర్యవంతులకు దేశం రుణపడి ఉంటుందని సింగ్ ఉద్ఘాటించారు. దేశ ప్రయోజనాలను కాపాడడమే కాకుండా ప్రజల హృదయాలను గెలుచుకోవడం కూడా సాయుధ బలగాల కర్తవ్యాన్ని ఆయన గుర్తు చేశారు.

Rajnath Singh
జమ్ముకశ్మీర్‌లో రాజ్‌నాథ్ పర్యటనపై అనుచిత వ్యాఖ్యలు చేశారు మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా. రాజ్‌నాథ్ పర్యటనతో ఉగ్రవాదుల దాడిలో చనిపోయిన జవాన్లు తిరిగి వస్తారా అని వ్యాఖ్యానించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..