PM Modi: ప్రధాని మోదీ అధ్యక్షతన మంత్రి వర్గం భేటీ.. తీసుకున్న కీలక నిర్ణయాలివే..

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఢిల్లీలో జరిగిన కేంద్ర కేబినెట్‌ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. బిహార్‌లోని డిఘా- సోనేపుర్‌ ప్రాంతాలను అనుసంధానం చేస్తూ గంగా నదిపై ఆరు లేన్ల వంతెన నిర్మాణానికి గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చారు. మొత్తం 3064 కోట్ల రూపాయల వ్యయంతో ఈ వంతెనను 4.56 కిలోమీటర్ల మేర నిర్మించనున్నారు. నాలుగేళ్లలో నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

PM Modi: ప్రధాని మోదీ అధ్యక్షతన మంత్రి వర్గం భేటీ.. తీసుకున్న కీలక నిర్ణయాలివే..
Pm Modi Cabinet Meeting
Follow us
Srikar T

|

Updated on: Dec 27, 2023 | 10:45 PM

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఢిల్లీలో జరిగిన కేంద్ర కేబినెట్‌ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. బిహార్‌లోని డిఘా- సోనేపుర్‌ ప్రాంతాలను అనుసంధానం చేస్తూ గంగా నదిపై ఆరు లేన్ల వంతెన నిర్మాణానికి గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చారు. మొత్తం 3064 కోట్ల రూపాయల వ్యయంతో ఈ వంతెనను 4.56 కిలోమీటర్ల మేర నిర్మించనున్నారు. నాలుగేళ్లలో నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ వంతెన నిర్మాణంతో ట్రాఫిక్‌ వేగంగా కదలడంతో పాటు బిహార్‌ ఉత్తర, దక్షిణ ప్రాంతాల మధ్య కనెక్టివిటీ మెరుగుపడుతుంది.

త్రిపురలోని ఖోవాయి-హరీనా రహదారిని 135 కిలోమీటర్ల మేర విస్తరించేందుకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. మొత్తం 2,486.78 కోట్ల రూపాయల పెట్టుబడితో ఈ రహదారిని విస్తరిస్తారు. ఈ ప్రాజెక్టు వల్ల త్రిపురలో రోడ్డు కనెక్టివిటీ మరింత మెరుగుపడుతుంది. ఎండు కొబ్బరికి కనీస మద్దతు ధరను పెంచుతూ కేంద్ర కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. 2024 కాలానికి గత సీజన్‌ కంటే మిల్లింగ్‌ కొబ్బరి క్వింటాల్‌కు 300 రూపాయలు; గుండ్రని కొబ్బరికి 250 రూపాయల చొప్పున పెంచాలని నిర్ణయించారు. దీంతో ఎండు కొబ్బరి మిల్లింగ్‌ క్వింటాల్‌ ధర 11,160 రూపాయలు, గుండ్రని ఎండుకొబ్బరి ధర రూ.12వేలకు చేరనుంది.

మరోవైపు న్యూజిలాండ్‌లో అధిక సంఖ్యలో ప్రవాస భారతీయులు నివసించే ఆక్లాండ్‌ నగరంలో త్వరలో కాన్సులేట్‌ జనరల్‌ను ప్రారంభించాలని కేంద్ర కేబినెట్‌ నిర్ణయించింది. ఏడాదిలోగా కాన్సులేట్‌ను ప్రారంభించి పూర్తిస్థాయిలో కార్యకలాపాలు ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఆ షాపులకు మందుబాబులు వెళ్లట్లేదట.! ఎందుకో తెలుసా.? వీడియో..
ఆ షాపులకు మందుబాబులు వెళ్లట్లేదట.! ఎందుకో తెలుసా.? వీడియో..
బాలింతగా ఉన్న భార్య సజీవ దహనం! తర్వాత జరిగిందిదే.. వీడియో
బాలింతగా ఉన్న భార్య సజీవ దహనం! తర్వాత జరిగిందిదే.. వీడియో
ఇస్మార్ట్ మోసం.. రూ.లక్షల బంగారం నగను ఈజీగా కొట్టేశాడు.! వీడియో.
ఇస్మార్ట్ మోసం.. రూ.లక్షల బంగారం నగను ఈజీగా కొట్టేశాడు.! వీడియో.
అత్యంత వేగవంతమైన రైలును పరిచయం చేసిన చైనా.! గంటకు 450 కి.మీ..
అత్యంత వేగవంతమైన రైలును పరిచయం చేసిన చైనా.! గంటకు 450 కి.మీ..
శ్రీవారి మెట్టు దగ్గర దర్శనం టోకెన్ల దందా! ఆటో డ్రైవర్స్ కూడానా?
శ్రీవారి మెట్టు దగ్గర దర్శనం టోకెన్ల దందా! ఆటో డ్రైవర్స్ కూడానా?
చలికాలంలో రాత్రిపూట పెరుగు తింటున్నారా.? నిపుణుల మాటేంటి.?
చలికాలంలో రాత్రిపూట పెరుగు తింటున్నారా.? నిపుణుల మాటేంటి.?
కుర్చీ మడతపెట్టి.. యూట్యూబ్‌ను షేక్ చేసిన ఒకే ఒక్క ఇండియన్‌ సాంగ్
కుర్చీ మడతపెట్టి.. యూట్యూబ్‌ను షేక్ చేసిన ఒకే ఒక్క ఇండియన్‌ సాంగ్
ఎయిర్‌పోర్టు గోడను ఢీకొని.. విమానంలో వ్యాపించిన మంటలు.!
ఎయిర్‌పోర్టు గోడను ఢీకొని.. విమానంలో వ్యాపించిన మంటలు.!
భలే బ్రదర్స్‌.. దొంగతనాల్లో మాస్టర్స్ పోలీసులకు ఎలా దొరికారంటే.!
భలే బ్రదర్స్‌.. దొంగతనాల్లో మాస్టర్స్ పోలీసులకు ఎలా దొరికారంటే.!
అయోధ్యలో హోటల్స్ అన్నీ హౌస్ ఫుల్.! బాలరాముడి దర్శనం కావాలంటే..
అయోధ్యలో హోటల్స్ అన్నీ హౌస్ ఫుల్.! బాలరాముడి దర్శనం కావాలంటే..