Bengaluru: మళ్లీ రాజుకున్న భాషా వివాదం.. ‘కన్నడ’ నేమ్ ప్లేట్స్‌లేని హోటళ్లపై దాడులు.. బెంగళూరులో హై టెన్షన్
దుకాణాలు, హోటళ్లు, రెస్టారెంట్లు తమ సైన్ బోర్డుల్లో స్థానిక కన్నడ భాషనే ఉపయోగించాలని.. ఇటీవలే బెంగళూర్ మున్సిపాలిటీ ఆదేశాలు జారీ చేసింది. వాణిజ్య సంస్థలు తమ నేమ్ బోర్డులపై 60 శాతం కన్నడ భాషను ఉపయోగించాలని.. లేదంటే ట్రేడ్ లైసెన్స్‌ను రద్దు చేస్తామని స్పష్టం చేసింది. దీనికి ఫిబ్రవరి నెలాఖరు వరకూ గడువు ఇచ్చారు.
కర్ణాటకలో మళ్లీ నేమ్ బోర్డుల రచ్చ మొదలయింది. కన్నడ బోర్డు లేని హోటళ్లు , వాణిజ్య సంస్థలను కన్నడ రక్షణ వేదిక కార్యకర్తలు టార్గెట్ చేయడంతో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. బెంగళూర్‌లో పలు సంస్థలపై కన్నడ రక్షణ వేదిక కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. కన్నడ సంఘాల ఆందోళన కారణంగా మాల్స్‌ను మూసేశారు. దుకాణాలు, హోటళ్లు, రెస్టారెంట్లు తమ సైన్ బోర్డుల్లో స్థానిక కన్నడ భాషనే ఉపయోగించాలని.. ఇటీవలే బెంగళూర్ మున్సిపాలిటీ ఆదేశాలు జారీ చేసింది. వాణిజ్య సంస్థలు తమ నేమ్ బోర్డులపై 60 శాతం కన్నడ భాషను ఉపయోగించాలని.. లేదంటే ట్రేడ్ లైసెన్స్‌ను రద్దు చేస్తామని స్పష్టం చేసింది. దీనికి ఫిబ్రవరి నెలాఖరు వరకూ గడువు ఇచ్చారు. బెంగళూరు సిటీ మొత్తం జోన్ల వారీగా సైన్ బోర్డులను పరిశీలించి నిబంధనలు పాటించని వారికి నోటీసులు ఇవ్వాలని కూడా తీర్మానించారు. ఐతే.. ఈలోపే బెంగళూరులో ఇంగ్లీష్ బోర్డులు ఉన్న హోటళ్లపై కన్నడ సంఘాలు దాడికి దిగాయి. చాలా చోట్ల ఇంగ్లీష్‌లో బోర్డులు ఉండడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. ఆందోళన కారులను అడ్డుకున్నారు. పలుచోట్ల ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు. బెంగళూర్ ఎయిర్‌పోర్ట్ దగ్గర ఆందోళన చేపట్టారు.
వాణిజ్య సంస్థలు కన్నడ భాషలో బోర్డులను ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలంటూ కర్ణాటక రక్షణ వేదిక చేసిన విజ్ఞప్తితో సిద్దరామయ్య ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కన్నడ భాషకు ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించింది. వాణిజ్య సంస్థలు, దుకాణాల నామఫలకాల్లో 60శాతం కన్నడ అక్షరాలే ఉండాలని ఆదేశించింది. అయితే ఈ నిబంధన ఫిబ్రవరి చివర నుంచి అమల్లోకి రానున్నట్లు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వెల్లడించారు. వ్యాపారులంతా వీటిని తప్పనిసరిగా అమలు చేయాలన్నారు. కాగా కన్నడ భాషను కావాలనే కొన్ని సంస్థలు అవమానిస్తున్నాయని . వాటికి గుణపాఠం తప్పదని కన్నడ సంస్థలు హెచ్చరిస్తున్నాయి. కర్ణాటకలో నివసించే ప్రతి ఒక్కరూ కన్నడ మాట్లాడటం నేర్చుకోవాలని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గతం లోనే చెప్పారు. అప్పటి నుంచి ఈ భాషా వివాదం మరోసారి తెరమీదకు వచ్చింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..