Sabarimala: అసలు శబరిలో ఏం జరుగుతోంది.? ఎప్పుడూ లేని రద్దీ ఇప్పుడే ఎందుకు.?
దేశ నలుమూలల నుంచి శబరిమలకు పెద్ద ఎత్తున భక్తులు వస్తుంటారు. మరీ ముఖ్యంగా.. సౌత్ స్టేట్స్ నుంచి శబరిమలకు లక్షల సంఖ్యలో భక్తులు వెళ్తుంటారు. నవంబర్‌లో మొదలయ్యే భక్తుల రాక సంక్రాంతితో ముగుస్తుంది. ఈ 50 నుంచి 60 రోజులు భక్తులతో కిటకటలాడుతుంది శబరిమల. తిరుపతి లాగానే కొండ కింద నుంచి పైకి వెళ్లి అయ్యప్పను దర్శనం చేసుకోవాలి. కానీ తిరుపతి మాదిరిగా పైకి...
శబరిమలో అసలు ఏం జరుగుతోంది.? వందల వేల కిలోమీటర్ల నుంచి ఇరుముడితో వచ్చే భక్తులకు సరైన సదుపాయాలు లేవా.? భారీగా ఆదాయం సమకూర్తున్న ట్రావెల్ కోర్ భక్తులను పట్టించుకోవడం లేదా.? అసలు ఎప్పుడు లేని రద్దీ ఇప్పుడెందుకు కనిపిస్తుంది.? తెలియాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే..
దేశ నలుమూలల నుంచి శబరిమలకు పెద్ద ఎత్తున భక్తులు వస్తుంటారు. మరీ ముఖ్యంగా.. సౌత్ స్టేట్స్ నుంచి శబరిమలకు లక్షల సంఖ్యలో భక్తులు వెళ్తుంటారు. నవంబర్‌లో మొదలయ్యే భక్తుల రాక సంక్రాంతితో ముగుస్తుంది. ఈ 50 నుంచి 60 రోజులు భక్తులతో కిటకటలాడుతుంది శబరిమల. తిరుపతి లాగానే కొండ కింద నుంచి పైకి వెళ్లి అయ్యప్పను దర్శనం చేసుకోవాలి. కానీ తిరుపతి మాదిరిగా పైకి వెళ్లడానికి ఎలాంటి వాహన రాకపోకలు ఉండవు. భక్తులు ఎవరైనా… స్వామి దర్శనం కోసం కొండపైకి కాలినడకన వెళ్లాల్సిందే. లేదా డోలి ఎక్కి వెళ్లే అవకాశం కూడా ఉంది. ఈ సీజన్‌లో ప్రతిరోజు రెండు లక్షలకు పైగానే భక్తులు దర్శనానికి వస్తూ ఉంటారు. ఈ విషయం ప్రతి ఏడాది ఈ సీజన్లో ఆలయాన్ని తెరిచి పూజలు నిర్వహించే ట్రావెన్ కోర్ కమిటీకి స్పష్టంగా తెలుసు.
అక్కడికొచ్చే అయ్యప్ప స్వాములు పంబా నదిలో స్నానం చేసి అక్కడి నుంచి నడక ప్రారంభిస్తారు. ఐదు కిలోమీటర్లు నిటారుగా ఉండే శబరిమల కొండెక్కి స్వామి దర్శనం చేసుకొని మళ్లీ కాలి నడకన దిగుతారు. ఈ నడక దారిలోనే దేవస్థానం కమిటీ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. కనీసం భక్తులకు ఎక్కడో చోటు తప్ప మంచినీళ్లు కూడా లభించినవి పరిస్థితి ఉంది. రెండు మూడు చోట్ల మాత్రమే మెడికల్ క్యాంపులున్నాయి. చిన్న పిల్లలు, వృద్ధులు కూడా కొండపైకి నడుచుకుంటూ వస్తూ ఉంటారు. వారికి దేవస్థానం తరపున అల్పాహారము, పాలు లాంటివి కూడా ఏర్పాటు చేయలేదు. నీళ్లు, భోజనం సంగతి పక్కన పెడితే భక్తులను దేవస్థానం పెడుతున్న ఇబ్బందులు మరో ఎత్తు.
భారీ సంఖ్యలో కొండెక్కుతున్న భక్తులను మధ్యలో అకస్మాత్తుగా నిలిపివేస్తున్నారు. ఎందుకు ఆపారు గంటలు గంటలు ఆ కొండపైన కూర్చోవడానికి కూడా అవకాశం లేని చోట ఎందుకు అయ్యప్పలను నిలబెడుతున్నారు అనేది ఎవరికి అర్థం కావడంలేదు. పోలీసులు తప్ప దేవస్థానం అధికారులు ఎవరు అక్కడ కనిపించని పరిస్థితి ఉంది. ఇక కొండపైకి చేరుకున్నాక ఎనిమిది క్యూ లైన్ లో వృద్ధులను ఒక క్యూ లైన్ లో, చిన్నపిల్లలతో వచ్చిన వాళ్ళని మరో క్యూ లైన్ లో, మహిళ భక్తులను ఇంకో క్యూ లైన్ లో పంపించే సాంప్రదాయం ఉండేది. కానీ ఇప్పుడు అందరినీ కలిపి ఒకటే క్యూ లైన్ లో పంపించడంతో భారీ రద్దీ ఏర్పడుతుంది. ఈ ఆలోచన ట్రావెల్ కోర్ కమిటీకి ఎందుకు వచ్చిందనేది ఇప్పుడు ప్రశ్నగా మారింది.
ఇక గతంలో మాదిరిగా కాకుండా తిరుపతి దేవస్థానంలో అమలవుతున్న దర్శనానికి ముందస్తు బుకింగ్ అమల్లోకి తీసుకొచ్చారు. ఇక్కడే పెద్ద ఇబ్బంది వచ్చి పడింది. భక్తులు ఎవరికీ ఈ విషయం తెలియదు, దానికి సంబంధించిన ప్రచారం కూడా దేవస్థానం చేయలేదు. బుకింగ్ లేకుండా అక్కడికి వచ్చిన భక్తులకు స్పాట్ బుకింగ్ పేరుతో అక్కడికక్కడే దర్శనం టోకెన్లను ఇచ్చేస్తున్నారు. ఇది కూడా రద్దీకి కారణంగా మారింది. ఆరోజు టోకెన్లు అయిపోగానే… తెల్లారి వరకు భక్తుల్ని కొండదారులోనే నిలబెట్టడం… కొండపైకి వచ్చాక కూడా క్యూ లైన్ లో నిలబెట్టడం ఈసారి గందరగోళానికి కారణంగా మారింది. ఇక కొండపైన గదులు కూడా అందుబాటులో లేవు.
ఎవరైనా భక్తులు సొంత ఖర్చులతో ఏర్పాట్లు చేస్తామన్న ట్రావెన్ కోర్ సహకరించడం లేదు. కనీసం నడకదారులు అల్పాహార ప్రసాదాలు ఏర్పాటు చేస్తామన్న అనుమతి ఇవ్వడం లేదు. మరోవైపు రాష్ట్ర పోలీసులకు ట్రావెన్ కోర్ అధికారులకు మధ్య విభేదాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆన్‌లైన్‌లో బుకింగ్ పోలీసులే నిర్వహిస్తామంటూ ముందుకు రావడం… దాన్ని ట్రావెన్ కోర్ నిరాకరించడం దీంతో పోలీసులు దేవస్థాన కమిటీకి సహకరించకపోవడం మరో సమస్యగా మారింది. లక్షల సంఖ్యలో భక్తులు వస్తున్నప్పుడు, పెద్ద సంఖ్యలో ఆదాయం వస్తున్నప్పుడు ప్రభుత్వం భక్తులకు సరైన ఏర్పాట్లు చేయకపోవడం విస్మయం కలిగిస్తోంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..