Tamil Nadu: ఇండియన్‌ ఆయిల్‌ ప్లాంట్‌లో భారీ పేలుడు.. ఒకరు మృతి, పలువురికి గాయాలు.. ఏం జరిగిందంటే..!

ప్రమాదానికి సంబంధించిన సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక శాఖ, అత్యవసర సేవల అధికారులు సంఘటనా స్థలానికి చేరుకునే సమయానికి మంటలను ఆర్పివేశారని వివరించారు. ఐదు అగ్నిమాపక యంత్రాలు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాద తీవ్రతను తగ్గించాయి. జరిగిన ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. IOCL ఇంకా అధికారిక ప్రకటన చేయవలసి ఉంది.

Tamil Nadu: ఇండియన్‌ ఆయిల్‌ ప్లాంట్‌లో భారీ పేలుడు.. ఒకరు మృతి, పలువురికి గాయాలు.. ఏం జరిగిందంటే..!
Chennai Blast
Follow us
Jyothi Gadda

|

Updated on: Dec 27, 2023 | 9:34 PM

చెన్నైలోని తొండియార్‌పేటలోని ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ (ఐఓసీఎల్‌) ప్లాంట్‌లో భారీ పేలుడు సంభవించింది. బుధవారం ప్లాంట్‌లోని బాయిలర్‌ పేలిపోవడంతో ప్రమాదం జరిగింది. ఈ పేలుడు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, కార్మికులు ఫెసిలిటీ వద్ద ఖాళీగా ఉన్న ఇథనాల్ నిల్వ ట్యాంక్‌కు రంధ్రం చేస్తున్నప్పుడు ఈ సంఘటన జరిగింది. మంటలు చెలరేగడంతో పాటు భారీ పేలుడు సంభవించడంతో ఒక కార్మికుడు అక్కడికక్కడే మృతి చెందాడని వివరాలు వెల్లడించారు.

ప్రమాదానికి సంబంధించిన సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక శాఖ, అత్యవసర సేవల అధికారులు సంఘటనా స్థలానికి చేరుకునే సమయానికి మంటలను ఆర్పివేశారని వివరించారు. ఐదు అగ్నిమాపక యంత్రాలు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాద తీవ్రతను తగ్గించాయి. జరిగిన ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. IOCL ఇంకా అధికారిక ప్రకటన చేయవలసి ఉంది.

తొండియార్‌పేటలోని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL) టెర్మినల్‌లో ఇథనాల్ ట్యాంక్ పేలడంతో కాంట్రాక్ట్‌పై పనిచేస్తున్న వెల్డర్, జి. పెరుమాళ్, 48, మరణించాడు. శరవణన్ అనే మరో కార్మికుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఇంకా మరికొందరు క్షతగాత్రుల వివరాలు, ప్రమాదానికి సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..