AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Karnataka: టీచర్‌ గారూ ఇదేం పాడు పని.. టెన్త్ క్లాస్ స్టూడెంట్‌తో ఇలానా…

కర్ణాటక మురుగమల్లాలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పని చేస్తున్న ఉపాధ్యాయురాలు, అదే స్కూల్‌లో 10వ తరగతి చదువుతున్న విద్యార్థి ఫోటోషూట్ సోషల్ మీడియాలో దుమారం రేపింది. దీనిపై విద్యార్థి తల్లిదండ్రులు బ్లాక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ (BEO)కి ఫిర్యాదు చేశారు. టీచర్ ప్రవర్తనపై సమగ్ర విచారణ జరిపించాలని తల్లిదండ్రులు డిమాండ్ చేశారు.

Karnataka: టీచర్‌ గారూ ఇదేం పాడు పని.. టెన్త్ క్లాస్ స్టూడెంట్‌తో ఇలానా...
Photoshoot
Ram Naramaneni
|

Updated on: Dec 29, 2023 | 4:57 PM

Share

కర్నాటకలో ఓ లేడీ టీచర్‌ బరి తెగించారు. టెన్త్‌ క్లాస్‌ చదువుతున్న తన స్టూడెంట్‌తో కలిసి రొమాంటిక్ ఫోటో షూట్‌ చేసి హల్‌చల్‌ చేశారు. అదేదో మామూలుగా ఫోటోల‌కు ఫోజులివ్వలేదు. ప్రేమికుల మాదిరిగానే ప్రేమ‌లో మునిగిపోయారు. ముద్దులు, కౌగిలింత‌లతో రెచ్చిపోయారు. ఆ మైనర్ కుర్రాడు ఆమెను ఎత్తుకున్నాడు కూడా. ఆ ఫోటో షూట్ అంతా రొమాంటిక్‌గా సాగిపోయింది.

సాధారణంగా ప్రేమికులు, కొత్తగా పెళ్లైన జంటలు ఇలాంటి ఫోటో షూట్‌లు చేస్తే ఫర్వాలేదు. కాని ఇలా టీచర్‌ తన స్టూడెంట్‌తో ఫోటో షూట్‌ చేయడం తీవ్ర సంచలనం రేపింది. నెటిజన్లు ఈ వ్యవహారంపై భగ్గుమంటున్నారు. టీచర్‌పై చర్య తీసుకోవాలంటున్నారు.  సమాజం ఏ దిశలో పయనిస్తోంది అని ప్రశ్నిస్తున్నారు.

అయితే ఈ షూట్‌లో పాల్గొన్న మ‌హిళా టీచ‌ర్.. మురుగ‌మ‌ళ్లలోని ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్నారు. స్టూడెంటేమో అదే స్కూల్‌లో ప‌దో త‌ర‌గ‌తి చ‌దువుతున్నాడు. స్టడీటూర్‌ సందర్భంగా ఈ ఫొటోషూట్ జ‌రిగిన‌ట్లు తెలిసింది. ఈ ఘ‌ట‌న‌పై విద్యార్థి త‌ల్లిదండ్రులు మండ‌ల విద్యాశాఖ అధికారికి ఫిర్యాదు చేశారు. అధికారులు కూడా ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.