Viral video: న్యాయం కోసం కోర్టు మెట్లెక్కిన గజరాజు..! ఏమైందో పాపం.. వీడియో చూడాల్సిందే..
కోర్టు ఆవరణలోకి వచ్చిన ఏనుగు అక్కడున్న కోర్టు గేట్లను తోసేసి, ప్రాంగణంలోకి ప్రవేశించింది. బుధవారం హరిద్వార్ కోర్టు ఆవరణలో ఏనుగు ప్రధాన గేటును బద్దలు కొట్టి ప్రవేశించడంతో గందరగోళం నెలకొంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఇక ఏనుగు కోర్టు లోపలికి వచ్చేందుకు యత్నించగా, అక్కడున్న కోర్టు సిబ్బంది, లాయర్లు
ఇటీవల కాలంలో అడవుల్లో ఉండాల్సిన జంతువులు తరచూ జనావాసాల్లోకి వచ్చి చేరుతున్నాయి. జింకలు, ఏనుగులు, పులులు వంటివి అనేక రకాల జంతువులు పట్టణాలు, గ్రామాలపై పడి జనాల్ని భయంభ్రాంతులకు గురిచేస్తుంటాయి. తాజాగా అలాంటి సంఘటనలో ఒక ఏనుగు కోర్టు ఆవరణలోకి ప్రవేశించింది. జనావాసాల్లో ప్రత్యక్షమైన గజరాజును చూసిన స్థానికులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. కోర్టు గేట్లను తోసుకుంటూ వచ్చిన ఏనుగు అక్కడ కాసేపు హల్‌చల్ చేసింది. కోర్టు లోపలికి కూడా ప్రవేశించేందుకు ప్రయత్నించింది. ఏనుగు వీరంగంతో అక్కడ భయానక వాతావరణం నెలకొంది. ప్రస్తుతం ఈ వార్తకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియో ఆధారంగా ఈ సంఘటన ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో జరిగినట్టుగా తెలిసింది.
ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో ఏనుగు హల్‌చల్ చేసింది. కోర్టు ఆవరణలోకి వచ్చిన ఏనుగు అక్కడున్న కోర్టు గేట్లను తోసేసి, ప్రాంగణంలోకి ప్రవేశించింది. బుధవారం హరిద్వార్ కోర్టు ఆవరణలో ఏనుగు ప్రధాన గేటును బద్దలు కొట్టి ప్రవేశించడంతో గందరగోళం నెలకొంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఇక ఏనుగు కోర్టు లోపలికి వచ్చేందుకు యత్నించగా, అక్కడున్న కోర్టు సిబ్బంది, లాయర్లు ఆందోళనకు గురయ్యారు. ఏనుగును అక్కడ్నుంచి పంపించేందుకు గట్టిగట్టిగా అరుపులు కేకలు వేస్తూ హడావుడి చేశారు. అయినప్పటికీ ఏనుగు కోర్టు గేట్లను తోసి లోపలికి వచ్చింది. ఈ ఘటన బుధవారం చోటు చేసుకుంది. ఈ ఏనుగు హరిద్వార్‌కు సమీపంలో ఉన్న రాజాజి టైగర్ రిజర్వ్ నుంచి వచ్చినట్లు అటవీశాఖ అధికారులు పేర్కొన్నారు.
Meet the unexpected ‘guest’ in Haridwar court. 🐘
The wild elephant rammed down its gate, creating chaos as it traversed the district magistrate’s office and the court premises. It is believed to have snuck out of the nearby Rajaji Tiger Reserve.#Uttarakhand #Haridwar… pic.twitter.com/00RzrF9d1q
— editorji (@editorji) December 28, 2023
గత కొన్నేళ్లుగా హరిద్వార్‌లో ఇలాంటి ఘటనలు చాలానే జరుగుతున్నాయి. అటవీ శాఖ తెలిసిన ప్రకారం ప్రతి రోజూ ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. హరిద్వార్ ప్రాంతం మొత్తం రాజాజీ నేషనల్ పార్క్ ఉంది. ఇందులో అనేక ఏనుగు కారిడార్లు, హరిద్వార్ అటవీ విభాగం ఉన్నాయి. అడవి జంతువులు తరచూ ఆహారం, నీటి కోసం ప్రత్యేకించి రాత్రి సమయంలో ఎక్కువగా ఈ కారిడార్‌లోకి ప్రవేశిస్తుంటాయని చెప్పారు.
హరిద్వార్‌లోని శ్యాంపూర్-చిలా శ్రేణికి ఏనుగు కారిడార్‌లు ఉన్నాయి. అక్కడ నుండి ఆహారం వెతుక్కుంటూ ఏనుగులు గంగా నది వైపు వెళ్లి, చెరకు వ్యవసాయ క్షేత్రాలలో ప్రవేశిస్తుంటాయి. హరిద్వార్, భోగ్‌పూర్ మధ్య 17-కిమీ-పొడవు కారిడార్ ఉంది. దీని నుండి 10-12 పాయింట్లు ఉన్నాయి. ఇక్కడ నుండి ఏనుగులు ఆహారం కోసం మానవ నివాసాలలోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తాయి. ఇప్పుడు, ఈ కారిడార్లు వివిధ ప్రదేశాలలో అడ్డుగోడలు, కంచెలు ఏర్పాటు చేశారు. దాంతో ఈ అడవి జంతువులు అయోమయంగా, కొన్నిసార్లు కోపంగా వ్యవహరిస్తుంటాయని చెప్పారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..