Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral video: ఓరీ దేవుడో.. అక్క స్టంట్స్‌ అదుర్స్‌..! మేఘాలను మెట్లుగా చేసుకుని.. ఆకాశంలో..

మీరు వీడియోను చూసినప్పుడు మొదట్లో ఆమె మేఘాలను మెట్లుగా ఎక్కినట్లు అనిపిస్తుంది. వీడియో మరింత ముందుకు వెళితే.. ఆమె భూమి నుండి అంత ఎత్తులో స్టంట్ చేస్తూ.. వివిధ రకాల జిమ్నాస్టిక్ కదలికలను చూపడం ప్రారంభించింది. ఈ వీడియో పాతదే అయినా ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. శరవేగంగా వైరల్ అవుతున్న ఈ వీడియోపై జనాలు తీవ్రంగా స్పందిస్తున్నారు.

Viral video: ఓరీ దేవుడో.. అక్క స్టంట్స్‌ అదుర్స్‌..! మేఘాలను మెట్లుగా చేసుకుని.. ఆకాశంలో..
while skydiving
Follow us
Jyothi Gadda

|

Updated on: Dec 29, 2023 | 6:39 PM

ఇంటర్నెట్‌లో పాత వీడియో ఒకటి తాజాగా వైరల్ అవుతోంది. ఎందుకంటే ఆ వీడియో అంత ప్రత్యేకమైనది. ఈ వీడియోలో ఒక మహిళ స్కైడైవింగ్ చేస్తున్న విధానం చూస్తే మీ కళ్ళను మీరే నమ్మలేరు. ఈ వీడియో వైరల్ కావడం వెనుక ఇలాంటిదే ప్రత్యేక కారణం ఉంది. నిజానికి ఇందులో ఒక మహిళ స్కైడైవింగ్ చేస్తూ రకరకాల జిమ్నాస్ట్ మూవ్‌మెంట్స్‌ చూపుతూ కనిపిస్తుంది. ఇది చూసిన ప్రతి ఒక్కరూ షాకింగ్‌గా ఉందంటున్నారు. ఇది ఎలా సాధ్యమని ఆశ్చర్యపోతున్నారు.. కానీ 23 ఏళ్ల స్కైడైవర్ మజా కుజిన్స్కా ఎవరూ నమ్మలేని స్టంట్స్‌ చేసింది. మీరు వీడియోను చూసినప్పుడు మొదట్లో ఆమె మేఘాలను మెట్లుగా ఎక్కినట్లు అనిపిస్తుంది. వీడియో మరింత ముందుకు వెళితే.. ఆమె భూమి నుండి అంత ఎత్తులో స్టంట్ చేస్తూ.. వివిధ రకాల జిమ్నాస్టిక్ కదలికలను చూపడం ప్రారంభించింది. ఈ వీడియో పాతదే అయినా ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. శరవేగంగా వైరల్ అవుతున్న ఈ వీడియోపై జనాలు తీవ్రంగా స్పందిస్తున్నారు.

ఈ వీడియో X యొక్క @ScienceGuys హ్యాండిల్‌లో షేర్‌ చేయబడింది. దీనిపై పబ్లిక్ కూడా భారీగానే వ్యాఖ్యానిస్తున్నారు. వీడియో చూసిన ఒక వ్యక్తి ఇలా వ్రాశాడు – ఇది ఎలా సాధ్యం అని? దయచేసి ఎవరైనా నాకు వివరించండి. మరొక వ్యక్తి ఇలా వ్రాశాడు –వావ్‌.. ఇది భిన్నమైన స్థాయి ప్రతిభగా కొనియాడుతుంటే.. మరొక వినియోగదారు ఇలా వ్రాశారు – ఇది బాగుంది..కానీ, దూకేటప్పుడు చాలా భయంగా అనిపిస్తుందని. మరొక వినియోగదారు ఇలా వ్రాశారు – ఇది చూడటానికి చాలా అందంగా ఉందంటూ వ్యాఖ్యానించారు.

ఇవి కూడా చదవండి

ఇకపోతే, వీడియోలో స్కైడైవర్‌ మజా ఈ వీడియోను ఆగస్టులో షేర్ చేసింది. ఆమె క్యాప్షన్‌లో రాసింది – నేను ప్రజలు కోరుకున్నది ఇస్తున్నాను. అందరూ ఆకాశంలో నడవడానికి ఇష్టపడతారని అనిపిస్తుంది. స్కైడైవింగ్ కోసం నిటారుగా నిలబడటం అతి ముఖ్యమైన ఘట్టంగా చెప్పారు.. మీరు నడుస్తున్నట్లు కనిపించేలా చేయడానికి మీ కాళ్లను ముందుకు వెనుకకు కదిలించండి. నేను మీ కోసం కొన్ని మెట్లు ఎక్కడానికి ప్రయత్నించాను కానీ అది అంత బాగా కనిపించడం లేదు అని రాశారు.

ఇకపోతే, ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మజాపై జనాలు విపరీతంగా ప్రశంసలు కురిపిస్తున్నారు. మజా ఒక ప్రొఫెషనల్ స్కై డైయర్ మరియు అథ్లెట్.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..