Guinness World Records: వార్నీ.. ఇలా కూడా గిన్నిస్ రికార్డు సాధిస్తారా..? లీటర్ టమాటా సాస్‌ను నిమిషంలోపే తాగేశాడు..
చాలా ఆసక్తికరమైన ప్రపంచ రికార్డులు తరచూ వార్తల్లో నిలుస్తుంటాయి.. ఇప్పుడు ఈ తరహా ప్రపంచ రికార్డు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. టమాటా సాస్ తింటూ ఓ యువకుడు గిన్నిస్ రికార్డు సృష్టించాడు. ఆహారానికి సంబంధించి ఇప్పటికే ఎన్నో ప్రపంచ రికార్డులను సొంతం చేసుకున్న ఒక వ్యక్తి అతి తక్కువ సమయంలో ఒక లీటరు టమాటా సాస్‌ను తాగి ప్రపంచ రికార్డు క్రియేట్ చేశాడు.
Guinness World Records: వార్నీ.. ఇలా కూడా గిన్నిస్ రికార్డు సాధిస్తారా..? లీటర్ టమాటా సాస్‌ను నిమిషంలోపే తాగేశాడు.. ప్రపంచ రికార్డు ఏంటో అందరికీ తెలిసిందే. ప్రపంచంలో మరెవరికీ లేని విధంగా ప్రత్యేక సామర్థ్యాన్ని ప్రదర్శిస్తే ప్రపంచ రికార్డు పొందవచ్చు. గిన్నిస్ వరల్డ్ రికార్డ్ అనే పేరు వినగానే అందరి మదిలో ఇలాంటి స్టంట్, విభిన్నమైన పనులే గుర్తుకు వస్తుంటాయి. అనేక సబ్జెక్టులు, రంగాల్లో ప్రతిభ కనబర్చిన వ్యక్తులకు ఈ గుర్తింపు లభిస్తుంది. కానీ, అలాంటి గిన్నిస్ రికార్డ్ సాధించిన పలువురి ప్రతిభ వీక్షకుల్లో ఆసక్తిని రేకిస్తుంది. . చాలా ఆసక్తికరమైన ప్రపంచ రికార్డులు తరచూ వార్తల్లో నిలుస్తుంటాయి.. ఇప్పుడు ఈ తరహా ప్రపంచ రికార్డు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. టమాటా సాస్ తింటూ ఓ యువకుడు గిన్నిస్ రికార్డు సృష్టించాడు. అదేలా సాధ్యమో మీరే చూడండి..
ఆహారానికి సంబంధించి ఇప్పటికే ఎన్నో ప్రపంచ రికార్డులను సొంతం చేసుకున్న జర్మనీ వ్యక్తి ఒకరు అతి తక్కువ సమయంలో ఒక లీటరు టమాటా సాస్‌ను తాగి ప్రపంచ రికార్డు క్రియేట్ చేశాడు. జర్మనీకి చెందిన ఆండ్రీ ఓర్టోల్ఫ్ అనే జర్మన్ యువకుడు ఈ విభిన్న రికార్డును సాధించాడు. తక్కువ సమయంలో టమాటా సాస్ తిని రికార్డు సాధించిన వీడియోను ‘గిన్నిస్ వరల్డ్ రికార్డ్’ షేర్ చేసింది. ఈ వీడియో కూడా పెద్ద ఎత్తున దృష్టిని ఆకర్షిస్తోంది. ఆహారానికి సంబంధించి ఇప్పటికే ఎన్నో ప్రపంచ రికార్డులను సొంతం చేసుకున్న వ్యక్తి ఆండ్రీ. తక్కువ సమయంలో ఎక్కువ పెరుగు, జెల్లీ, గుజ్జు బంగాళాదుంపలు వంటి అనేక ఇతర వంటకాలను తినడం ద్వారా ఆండ్రీ వరల్డ్ రికార్డ్ సాధించాడు.
View this post on Instagram
ఒక పెద్ద గాజు కూజాలో నిండి ఉన్న సాస్ ఒక లీటరు ఉంటుంది. అదంతా ఆండ్రీ కేవలం 55.21 సెకన్లలో స్ట్రా ద్వారా తాగగలిగాడు. దాంతో అతడు ప్రపంచ రికార్డు సాధించగలిగాడు.. అయితే టమాటా సాస్ రికార్డును బద్దలు కొట్టడం ఈజీ అని పలువురు సోషల్ మీడియాలో వ్యాఖ్యానిస్తున్నారు. అదే సమయంలో, ఇది అనిపించినంత సులభం కాదని మనకు గుర్తు చేసేవారు చాలా మంది ఉన్నారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..