Plane Stuck Under Bridge: ఆకాశంలో ఎగిరే విమానం.. ఇలా వంతెన కింద ఇరుక్కుపోయిందే..! తప్పని ట్రాఫిక్ కష్టాలు..
ఆకాశంలో హాయిగా ప్రయాణించే విమానాలు ఇలా రోడ్డుపై ఇరుక్కుపోవడం ఇది తొలిసారి కాదు. గతేడాది నవంబర్‌లోనూ ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్ల జిల్లాలో రోడ్డు మార్గంలో ప్రయాణిస్తున్న విమానం అండర్‌పాస్‌లో ఇరుక్కుపోయింది. ట్రక్కు ట్రైలర్‌లో విమానం కొచ్చి నుంచి హైదరాబాద్‌కు తరలిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ రెస్టారెంట్ పిస్తా హౌస్ యజమాని
ఆకాశంలో ఎగరాల్సిన విమానం దిగి రోడ్డుపైకి వస్తే ఏమవుతుంది? ఇలాంటి వింత ఘటనే బీహార్‌లోని మోతిహారిలో చోటుచేసుకుంది. విమానం బాడీలో కొంత భాగం వంతెన కింద ఇరుక్కుపోయి ప్రమాదం జరిగింది. రోడ్డుపై రద్దీ ఎక్కువగా ఉండడంతో వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. అయితే, ఇది ఆకాశంలో ఎగురుతున్న విమానం.. దారి మళ్లించుకుని రహదారిపై వెళ్లాలనే కోరికతో కిందికి రాలేదు. ఎన్నో ఏళ్లు ఎగురుతూ, ఎగురుతూ రిటైరైన విమానం అంత్యక్రియల కోసం బయలుదేరింది. అవును మీరు చదివింది నిజమే.. డికమిషన్ అయిన విమానాన్ని గుజ్జర్‌లో ఉంచేందుకు ముంబై నుంచి అస్సాంకు రవాణా చేస్తున్నారు. శుక్రవారం ఉదయం బీహార్‌లోని మోతిహారిలో పిప్రకోటి వంతెన కింద విమానం బాడీ ఇరుక్కుపోయింది. ఈ వార్త దావానంలా వ్యాపించింది. తమ జీవితకాలంలో విమానాన్ని ఇంత దగ్గరగా చూడని వారు, ఇలాంటి అరుదైన అవకాశం ఎలా వస్తుందని భావించిన ప్రజలు వందల సంఖ్యలో తరలివచ్చారు. ట్రక్కు డ్రైవర్లు, స్థానికుల సహకారంతో వంతెన కింద ఇరుకున్న విమానాన్ని బయటకు తీశారు. వివరాల్లోకి వెళితే…
బీహార్‌లోని మోతీహారిలో వింత సంఘటన చోటు చేసుకుంది. విమానం బాడీని ముంబై నుంచి అస్సాంకు ట్రక్కు ట్రైలర్‌పై తరలిస్తుండగా, మోతీహారీలో పిప్రకోఠి వంతెన కింద అది ఇరుక్కుపోయింది. దీంతో లారీ డ్రైవర్లు స్థానికుల సహాయంతో దానిని బయటకు తీశారు. ఈ సందర్భంగా క్రాస్ రోడ్ల వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. విపరీతమైన రద్దీతో పాటు వాహనాలు ముందుకు వెళ్లేందుకు స్థలం లేకపోవడంతో ట్రాఫిక్ జామ్ అయింది. ఎట్టకేలకు విమానాన్ని సురక్షితంగా వంతెన కింద నుంచి క్లియర్ చేసి అస్సాం వెళ్లేందుకు వీలు కల్పించారు.
#BIHAR मोतिहारी में हवाई जहाज फ्लाईओवर के नीचे फंसा, देखने को लगी भीड़:
मोतिहारी के लोगों ने सुबह-सुबह देखा अजीब नजारा, पुलिस ने पहुंचकर किया रेस्क्यू pic.twitter.com/ByuoaVLrb9
— FirstBiharJharkhand (@firstbiharnews) December 29, 2023
ఆకాశంలో హాయిగా ప్రయాణించే విమానాలు ఇలా రోడ్డుపై ఇరుక్కుపోవడం ఇది తొలిసారి కాదు. గతేడాది నవంబర్‌లోనూ ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్ల జిల్లాలో రోడ్డు మార్గంలో ప్రయాణిస్తున్న విమానం అండర్‌పాస్‌లో ఇరుక్కుపోయింది. ట్రక్కు ట్రైలర్‌లో విమానం కొచ్చి నుంచి హైదరాబాద్‌కు తరలిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ రెస్టారెంట్ పిస్తా హౌస్ యజమాని కేరళలో జరిగిన వేలంలో ఈ విమానాన్ని కొనుగోలు చేశారు.
అక్టోబర్ 2021లో, ఎయిర్ ఇండియా A320 విమానం దాని కొత్త యజమాని సైట్‌కి వెళుతుండగా ఢిల్లీ విమానాశ్రయానికి సమీపంలో ఉన్న వంతెన కింద చిక్కుకుంది.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..