- Telugu News Photo Gallery Maharshi Valmiki International Airport Ayodhya Dham to be inaugurated on Dec 30: Take a look Telugu News
Ayodhya New Airport : విదేశీ విమానాశ్రయాలకు పోటీగా.. అయోధ్య ఇంటర్ నేషనల్ ఎయిర్‌పోర్ట్.. అద్భుతమైన ఫోటోలు
2024 జనవరి 22ప అయోధ్యలోని రామ మందిరంలో రాంలాలా విగ్రహాన్ని ప్రతిష్ఠించే సమయం ఆసన్నమైంది. ఇక్కడికి చేరుకునేందుకు జనం సన్నాహాలు ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలోనే శ్రీరాముడి జన్మస్థలమైన అయోధ్యలో కొత్తగా నిర్మించిన విమానాశ్రయానికి మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయం అయోధ్య ధామ్ అని పేరు పెట్టినట్లు విమాన మంత్రిత్వశాఖ వెల్లడించింది..
Updated on: Dec 29, 2023 | 5:49 PM

పవిత్ర అయోధ్య నగరంలో కొత్తగా ప్రారంభించనున్న అంతర్జాతీయ విమానాశ్రయం విదేశాలకు పోటీగా నిలుస్తోంది. ఇక్కడ VIP లాంజ్ 5 స్టార్ హోటల్ రేంజ్‌లో కనిపిస్తుంది.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ డిసెంబర్ 30 శనివారం ఈ కొత్త విమానాశ్రయాన్ని ప్రారంభించనున్నారు. ఏటా 10 లక్షల మంది ప్రయాణికులు ప్రయాణించేలా 6,500 చదరపు మైళ్ల విస్తీర్ణంలో 1450కోట్ల రూపాయలతో ఈ విమానాశ్రయం మొదటి దశ పూర్తి చేశారు.

భగవాన్ శ్రీరాం పెయింటింగులతో ఈ విమానాశ్రయ భవనాన్ని తీర్చిదిద్దారు. అయోధ్య ధాం విమానాశ్రయంలో ఎల్ఈడీ లైట్లు, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్, ల్యాండ్ స్కేపింగ్, ఫౌంటెన్లు, వాటర్ ట్రీట్ మెంట్ ప్లాంట్, సీవరేజి ట్రీట్ మెంట్ ప్లాంట్, సోలార్ పవర్ ప్లాంట్ నిర్మించారు.

ఒక పెద్ద హోటల్‌లా అందమైన సోఫాలు, విలాసవంతమైన ఇంటీరియర్‌లతో ఈ ఎయిర్ పోర్ట్‌ను ఎంతో సుందరంగా తీర్చి దిద్దారు. ఈ లాంజ్ ఫైవ్ స్టార్ హోటల్ లా కనిపిస్తుంది. అయోధ్యలోని ఈ విమానాశ్రయం పట్టణ శైలిలో రూపొందించబడింది. నగర శైలి ఉత్తర భారతదేశంలోని ఆలయ శైలి.

ఈ ఎయిర్ పోర్టు మధ్యలో ప్రధాన శిఖరం, ముందు భాగంలో 3, వెనుక 3 శిఖరాలు ఉన్నాయి. ఎయిర్‌పోర్ట్‌లో ఎక్కడ చూసినా ఆ శ్రీరామ చంద్రుడి ప్రతిరూపాన్ని చూపించే ప్రయత్నం చేశారు. వెలుపల విల్లు, బాణం ఏర్పాటు చేశారు.

2024 జనవరి 11 నుండి ఈ విమానాశ్రయం నుండి అహ్మదాబాద్, అయోధ్య మధ్య వారానికి మూడు రోజులు విమానాలు నడుస్తాయి. ఈ అయోధ్య విమానాశ్రయం ప్రారంభంతో పర్యాటక రంగం అభివృద్ధి చెందటంతోపాటు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ప్రధానమంత్రి కార్యాలయం తెలిపింది.




