- Telugu News Photo Gallery Amazing Benefits of Wearing bangles on Hand, Check here is details in Telugu
Bangles Benefits: గాజులు అందానికే కాదు.. ఆరోగ్యానికి కూడా.. లేడీస్ ఇది మీకే!
లేడీస్ చేతులకు గాజులు వేసుకోవడం వల్ల మణికట్టు ప్రాంతానికి రక్త ప్రసరణ అనేది బాగా జరుగుతుంది. దీంతో శరీరంలో రక్త ప్రసరణ కూడా సక్రమంగా జరుగుతుంది. మణికట్టు ప్రాంతంలో రక్త ప్రవాహం పెరగడం వల్ల.. మహిళలకు ఇతర అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. మీరు గమనించే ఉంటారు. గర్భిణీగా ఉండే మహిళల చేతికి ఎక్కువగా గాజులు ఉండాలని చెబుతారు. ఎందుకంటే గాజుల వల్ల బ్లడ్ సర్క్యులేషనే కాకుండా.. ఆ శబ్దం వల్ల కడుపులో బిడ్డ కూడా..
Updated on: Dec 29, 2023 | 7:13 PM

ఆడ పిల్లలకు ఎవరైనా.. చేతికి గాజులు ఖచ్చితంగా ఉండాలని అంటారు పెద్దలు. అయితే ఇది కేవలం సంప్రదాయం అనుకుంటే మాత్రం పొరపాటే. చాలా మంది గాజులను కేవలం అందం కోసమే గాజులు వేసుకుంటారు అనుకుంటారు. గాజులు వేసుకోవడం వల్ల మహిళల చేతులు అందంగా కనిపించడమే కాకుండా.. కొన్ని రకాల బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. మరి గాజులు వేసుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

లేడీస్ చేతులకు గాజులు వేసుకోవడం వల్ల మణికట్టు ప్రాంతానికి రక్త ప్రసరణ అనేది బాగా జరుగుతుంది. దీంతో శరీరంలో రక్త ప్రసరణ కూడా సక్రమంగా జరుగుతుంది. మణికట్టు ప్రాంతంలో రక్త ప్రవాహం పెరగడం వల్ల.. మహిళలకు ఇతర అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి.

మీరు గమనించే ఉంటారు. గర్భిణీగా ఉండే మహిళల చేతికి ఎక్కువగా గాజులు ఉండాలని చెబుతారు. ఎందుకంటే గాజుల వల్ల బ్లడ్ సర్క్యులేషనే కాకుండా.. ఆ శబ్దం వల్ల కడుపులో బిడ్డ కూడా ఆరోగ్యంగా ఉండాటు.

హార్మోన్ల అసమతుల్యత నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. అంతే కాకుండా ఒత్తిడి, అలసట, నొప్పులు వంటి వాటిని తట్టుకునే సామర్థ్యం కూడా మహిళల్లో పెరుగుతుంది. మట్టి గాజులు శరీరంలోని అధిక వేడిని తగ్గించేందుకు సహాయ పడుతుంది.

అదేవిధంగా గాజులు.. వాతావరణం నుంచి స్వచ్ఛతను గ్రహిస్తాయి. గాజులు వేసుకన్న వ్యక్తికి సహజ వాతావరణంలో ఉండటానికి శక్తిని ఇస్తుంది. ఇది చుట్టుపక్కల వారి మానసిక స్థితిని కూడా మెరుగు పరుస్తుంది. ఇలా గాజులు వేసుకోవడం వల్ల చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.




