అభయాంజనేయస్వామి ఆలయంలో హుండీ చోరీ
ఓవైపు ధనుర్మాసం భక్తులు దైవదర్శనం కోసం ఆలయాలకు పోటెత్తుతుంటే.. మరోవైపు దొంగలు రెచ్చిపోతున్నారు. ఆలయాలలో చోరీలకు పాల్పడుతున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో దొంగలు ఆలయాలపై పడ్డారు. గుడిలోని హుండీలు, ఆభరణాల చోరీలకు పాల్పడుతున్నారు. తాజాగా నంద్యాలలో సోమవారం అర్థరాత్రి టెక్కె సమీపంలోని ప్రధాన రహదారిలో గల అభయాంజనేయ స్వామి దేవాలయంలో చోరీకి పాల్పడ్డారు. ఎప్పటిలాగే పూజారి అభయాంజనేయస్వామి యధావిధిగా రాత్రి పూజలు నిర్వహించి తాళాలు వేసి వెళ్లిపోయారు.
ఓవైపు ధనుర్మాసం భక్తులు దైవదర్శనం కోసం ఆలయాలకు పోటెత్తుతుంటే.. మరోవైపు దొంగలు రెచ్చిపోతున్నారు. ఆలయాలలో చోరీలకు పాల్పడుతున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో దొంగలు ఆలయాలపై పడ్డారు. గుడిలోని హుండీలు, ఆభరణాల చోరీలకు పాల్పడుతున్నారు. తాజాగా నంద్యాలలో సోమవారం అర్థరాత్రి టెక్కె సమీపంలోని ప్రధాన రహదారిలో గల అభయాంజనేయ స్వామి దేవాలయంలో చోరీకి పాల్పడ్డారు. ఎప్పటిలాగే పూజారి అభయాంజనేయస్వామి యధావిధిగా రాత్రి పూజలు నిర్వహించి తాళాలు వేసి వెళ్లిపోయారు. అర్ధరాత్రి ఆలయంలో చొరబడిన దొంగలు ప్రధాన ద్వారం పగలగొట్టి అక్కడ ఉన్న హుండీని ఎత్తుకెళ్ళారు. ఆలయం సమీపంలో ఉన్న మార్కెట్ యార్డ్ లోకి హుండీని తీసుకెళ్లి తాళాలు పగలగొట్టి నగదు తీసుకొని, హుండీ ని అక్కడే వదిలి వెళ్ళిపోయారు. ఉదయం ఆలయానికి వచ్చిన పూజారులు గుడిలో హుండీ చోరి జరిగినట్లు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు, ఆలయ నిర్వహకులు సమీప ప్రాంతాల్లో గాలించగా మార్కెట్ యార్డ్ లో ఓ నిర్మానుషమైన ప్రదేశంలో హుండీని కనుగొన్నారు. హుండీలోని దాదాపు 50 వేల నగదు చోరికి గురైనట్లు నిర్వాహకులు తెలిపారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
శ్రీరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్టకు వెళ్ళే భక్తులకు గుడ్‌న్యూస్
కోతికి కొబ్బరి చిప్పకాదు బైకే దొరికింది.. ఆ తర్వాత ??
అడవిలో శ్రీకృష్ణదేవరాయలు కాలంనాటి శిలా శాసనం..
Zombie Deer Disease: జాంబీ డీర్ వ్యాధి.. కరోనా కంటే డేంజరా ??
Salman Khan: ఓ మై గాడ్.. ఫ్యాన్స్ అరుపులతో ఊగిపోయిన సల్మాన్ ఇల్లు