కోతికి కొబ్బరి చిప్పకాదు బైకే దొరికింది.. ఆ తర్వాత ??
అల్లరి చేష్టలకు కేరాఫ్ కోతి. అందుకే ఎవరైనా శ్రుతిమించి అల్లరి చేస్తే కోతిచేష్టలు చేయకు అంటుంటారు. కోతుల అల్లరి చేష్టలకు సంబంధించిన అనేక వీడియోలు మనం సోషల్ మీడియాలో చూస్తుంటాం. తాజాగా మరో వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఓ కొండముచ్చు బైక్ పైన కూర్చుని రైడ్‌కి సై అంటోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో ఓ హోటల్ ముందు ఓ బైక్ పార్క్ చేసి ఉంది.
అల్లరి చేష్టలకు కేరాఫ్ కోతి. అందుకే ఎవరైనా శ్రుతిమించి అల్లరి చేస్తే కోతిచేష్టలు చేయకు అంటుంటారు. కోతుల అల్లరి చేష్టలకు సంబంధించిన అనేక వీడియోలు మనం సోషల్ మీడియాలో చూస్తుంటాం. తాజాగా మరో వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఓ కొండముచ్చు బైక్ పైన కూర్చుని రైడ్‌కి సై అంటోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో ఓ హోటల్ ముందు ఓ బైక్ పార్క్ చేసి ఉంది. ఆ బైకును చూసిన ఓ కొండముచ్చు నేరుగా వెళ్లి దానిపైన కూర్చుంది. నాతో ఎవరైనా బైక్ రైడ్‌కు వస్తారా అన్నట్టుగా చుట్టూ చూసింది. ఎవరూ కనిపించలేదు. తానే బైకు నడపడానికి ప్రయత్నించింది. అష్ట కష్టాలు పడి ఏదో విధంగా హ్యాండిల్ పట్టుకుంది. అయితే బైక్ ఎలా స్టార్ట్ చేయాలో తెలియక నానా అవస్థలు పడింది. ఇదంతా దూరం నుంచి గమనించిన స్థానికులు కొండముచ్చు చేష్టలకు తెగ నవ్వుకున్నారు. ఇంతలో ఆ బైక్ సంబంధించిన వారు రావడంతో అయ్యో.. మిస్ అయ్యానే అన్నట్టుగా బైకును వదిలి వెళ్లిపోయింది. ఇప్పడు ఈ వీడియో నెట్టింట నవ్వులు పూయిస్తోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అడవిలో శ్రీకృష్ణదేవరాయలు కాలంనాటి శిలా శాసనం..
Zombie Deer Disease: జాంబీ డీర్ వ్యాధి.. కరోనా కంటే డేంజరా ??
Salman Khan: ఓ మై గాడ్.. ఫ్యాన్స్ అరుపులతో ఊగిపోయిన సల్మాన్ ఇల్లు
దారుణం.. ఆకలితో తండ్రి మృతి.. అస్థిపంజరంలా కుమార్తె
విమానం కిటికీ అద్దంపై అతను చేసిన పనికి
తేనెటీగకు లీగల్ హక్కు !! పెరిగిన ప్రాముఖ్యత
జేబులోనే మృత్యువు.. కాపాడాల్సిన ఆయుధమే.. ఆయువు తీసింది
ప్రాణాలు నిలబెట్టేందుకు.. పూల హెల్మెట్ల ప్రచారం
కొత్త ఏడాదిలో సెలవులే సెలవులు !! ఉద్యోగులకు లాంగ్ వీకెండ్స్
బ్యాంక్‌లో తిష్ట వేసి రూ. 316 కోట్లు దోచేసిన దొంగలు

