Watch Video: అప్పుడు ఆపిల్ దొంగ.. ఇప్పుడు టమోటా దొంగ.. ఇద్దరు కాదు ఒక్కరే.. సీన్ కట్ చేస్తే
Tomato Thief: దొంగలు రూటు మార్చారు.. తమ టార్గెట్ మార్చారు.. ట్రెండ్ కు తగ్గట్టు దొంగతనాలు మొదలు పెట్టారు. దేశ వ్యాప్తంగా టమాటా దొంగలు ఎక్కువయ్యారు. టమాట ధరలు ఆకాశాన్నంటిన సంగతి తెలిసిందే.

దొంగలు అనగానే మనకు ముందుగా గుర్తువచ్చేది.. సాధారణంగా నగలు దోచేస్తారు, డబ్బులు కొట్టేస్తారు. ఇంట్లో ఇంకేమైనా విలువైన వస్తువులుంటే ఎత్తుకుపోతారు. కానీ ఇప్పుడు దొంగలు రూటు మార్చారు. వాళ్ల దృష్టిలో పైన చెప్పుకున్నవి మాత్రమే విలువైనవి కావు. ట్రెండ్ కు తగ్గట్టు దొంగతనాలు మొదలు పెట్టారు. దేశ వ్యాప్తంగా టమాటా దొంగలు ఎక్కువయ్యారు. టమాట ధరలు ఆకాశాన్నంటిన సంగతి తెలిసిందే. దీంతో దొంగలు టమాటాలు దొంగతనం చేయడం మొదలుపెట్టారు. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి తమిళనాడులో జరిగింది. సేలం జిల్లాలో టమాటా పెట్టె దొంగిలించిన వ్యక్తిని పోలీసులు తాజాగా అరెస్ట్ చేశారు. అతనిపై జరిపిన విచారణలో ఇప్పటికే యాపిల్‌ను దొంగిలించినందుకు అరెస్టు చేసినట్లు తేలింది. సేలం జిల్లా ఇలంపిళ్లై పక్కన పెరుమగౌండంపట్టి ప్రాంతానికి చెందిన యువకుడిగా గుర్తించారు. పెరుమగౌండంపట్టిలోని సంచివీరాయ పెరుమాళ్ దేవాలయం సమీపంలో ఆయనకు కూరగాయల దుకాణం ఉంది. టమాటా పార్శిల్ అన్ లోడర్లు 26వ తేదీ గురువారం ఉదయం 60 కిలోల బరువున్న గ్రేడ్ 2 టమాట 2 బాక్సులను దించారు.
ఈ క్రమంలో ఉదయం దుకాణం తెరిచేందుకు వచ్చిన దుకాణం యజమాని శంకర్ బయట ఒక్క గ్రేడ్ టమాటా పెట్టె ఉండడంతో అవాక్కయ్యాడు. ఇదేమిటని ప్రశ్నించగా రెండు టమాటా పెట్టెలు ఉన్నాయని తెలిపారు. దీంతో షాపులో ఉంచిన సీసీ కెమెరాను పరిశీలించగా.. ఎవరో స్కూటర్‌పై వచ్చి టమాటా పెట్టె అపహరించినట్లు తేలింది.
టిప్‌టాప్ కు చెందిన ఓ యువకుడు స్కూటర్‌పై వచ్చి దుకాణం ముందు నిల్చుని చుట్టూ చూసి టమాటా బుట్ట తీసి స్కూటర్‌పై తీసుకెళ్తున్నట్లు వీడియోలో ఉంది. దీనికి సంబంధించిన సీసీటీవీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
టమాటాల కంటే ముందు దొంగల కన్ను నిమ్మకాయలపై పడింది. సరిగ్గా నెల రోజుల కిందట నిమ్మకాయల రేటు అమాంతం పెరిగిన సంగతి తెలిసిందే. ఒక్క నిమ్మకాయ 10 రూపాయలకు కూడా అమ్ముడుపోయింది. సూపర్ మార్కెట్లలోనైతే అద్దాల ఫ్రిడ్జ్ లో పెట్టి మరీ 20 రూపాయలకు ఒక నిమ్మకాయ అమ్మిన సందర్భాలు కూడా ఉన్నాయి. దీంతో దొంగలు గత నెల నిమ్మకాయలు దొంగతనం చేశారు. 5వేల రూపాయల ట్రేను 2-3 వేలకు అమ్ముకొని సొమ్ము చేసుకున్నారు.
వీడియో ఇక్కడ చూడండి..



