మగబిడ్డకు జన్మనిచ్చిన స్వలింగ జంట..! ప్రపంచంలోనే రెండో కేసు.. ఒకే బిడ్డ ఇద్దరి గర్భంలో..

అజహారా తొమ్మిది నెలల పాటు బిడ్డను కడుపులో మోసింది. ఓ సంస్థ సాయంతో ఈ జంట గర్భం దాల్చింది. అందుకోసం ఓ ఫెర్టిలిటి సెంటర్‌ని సంప్రదించారు. ముందుగా ఎస్టీఫానియా మహిళ గర్భంలో స్పెర్మ్‌ని ప్రవేశపెట్టి ఫలదీకరణం చెందేలా చేశారు. ఐదు రోజుల అనంతరం ఆ పిండాన్ని అజహారా గర్భంలోకి మార్చారు. అలా ఇద్దరూ ఒకే బిడ్డను కడుపులో మోసి ఇద్దరూ మాతృత్వపు అనుభూతిని పొందారు. తొమ్మిది నెలల పాటు బిడ్డను

మగబిడ్డకు జన్మనిచ్చిన స్వలింగ జంట..! ప్రపంచంలోనే రెండో కేసు.. ఒకే బిడ్డ ఇద్దరి గర్భంలో..
Baby Boy
Follow us

|

Updated on: Nov 20, 2023 | 6:48 PM

ఓ స్వలింగ సంపర్క జంట బిడ్డకు జన్మనిచ్చిన ఘటన స్పెయిన్ లో చోటుచేసుకుంది. 30 ఏళ్ల ఎస్టాఫానియా, 27 అజహరా మగబిడ్డకు తల్లిదండ్రులు అయ్యారు. దీంతో ఆ స్వలింగ సంపర్కుల ఇంటి పెద్ద వేడుక జరిగింది. అజహారా అక్టోబర్ 30న మగబిడ్డకు జన్మనిచ్చింది. బాబుకు డెరెక్ ఎలోయ్ అని పేరు పెట్టారు. స్వలింగ సంపర్క జంట అయిన 30 ఏళ్ల ఎస్తెఫానియా, 27 ఏళ్ల అజహారా బిడ్డకు జన్మనివ్వడం ప్రపంచంలో ఇది 2వ కేసు. యూరప్‌లో ఇదే తొలి ఘటన. ఇద్దరు మహిళలు ఎస్తెఫానియా అజహారాల వివాహం గతంలో సంచలనం రేపింది. ఇప్పుడు ఈ స్వలింగ జంట మగబిడ్డకు జన్మనిచ్చి మరోసారి ప్రపంచం వ్యాప్తంగా వార్తలోకెక్కారు. కాగా, 2018లో టెక్సాస్‌లో ఇద్దరు మహిళలు ప్రసవించారు. ఇది ప్రపంచంలోనే మొదటి కేసు.

అజహారా తొమ్మిది నెలల పాటు బిడ్డను కడుపులో మోసింది. ఓ సంస్థ సాయంతో ఈ జంట గర్భం దాల్చింది. అందుకోసం ఓ ఫెర్టిలిటి సెంటర్‌ని సంప్రదించారు. ముందుగా ఎస్టీఫానియా మహిళ గర్భంలో స్పెర్మ్‌ని ప్రవేశపెట్టి ఫలదీకరణం చెందేలా చేశారు. ఐదు రోజుల అనంతరం ఆ పిండాన్ని అజహారా గర్భంలోకి మార్చారు. అలా ఇద్దరూ ఒకే బిడ్డను కడుపులో మోసి ఇద్దరూ మాతృత్వపు అనుభూతిని పొందారు. తొమ్మిది నెలల పాటు బిడ్డను కడుపులో సురక్షితంగా మోసింది అజహారా. ఈ చికిత్స కోసం వీరు 4.5 లక్షల రూపాయలు ఖర్చు చేశారు. 2018లో టెక్సాస్‌లో ఓ స్వలింగ జంటలో ఇద్దరు మహిళలు ఒకే బిడ్డను కడుపులో మోసి.. ప్రపంచంలోనే తొలి స్వలింగ జంటగా నిలిచారు.

గతంలో కేరళలో ఇలాంటి ఓ జంట కూడా బిడ్డకు జన్మనిచ్చింది. అప్పట్లోనే ఈ వార్త కలకలం రేపింది. జియా పావల్ ఒక బిడ్డకు జన్మనిచ్చిన ఘటన దేశంలో మొట్ట మొదటిది. కల్లికోట్‌లోని ప్రభుత్వ వైద్య కళాశాలలో ఆపరేషన్‌ ద్వారా జహాద్‌కు ప్రసవం జరిగింది. ఇంటర్‌సెక్స్‌లో ఉన్న జహాద్‌ను పురుషుడిగా, జియా స్త్రీగా మారడానికి చికిత్స పొందారు. అంతకు ముందు వీరిద్దరు 3 సంవత్సరాల పాటు కలిసి ఉన్నారు. ఆ తర్వాత సెక్స్ మార్పు చేయించుకోవాలని నిర్ణయించుకున్నారు. ఆ తర్వాత వీరికి పుట్టిన బిడ్డను స్వలింగ సంపర్కులైన ఎంతోమంది ఆశీర్వాదించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

ఈ ఏడాది గూగుల్‌లో అత్యధికంగా సెర్చ్‌ చేసిన సినిమాలు, సిరీస్‌లివే
ఈ ఏడాది గూగుల్‌లో అత్యధికంగా సెర్చ్‌ చేసిన సినిమాలు, సిరీస్‌లివే
రైతు భరోసా నిధుల విడుదలపై సీఎం రేవంత్‌రెడ్డి కీలక నిర్ణయం
రైతు భరోసా నిధుల విడుదలపై సీఎం రేవంత్‌రెడ్డి కీలక నిర్ణయం
ఏఎంఈ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ 2024 నోటిఫికేషన్‌ విడుదల
ఏఎంఈ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ 2024 నోటిఫికేషన్‌ విడుదల
స్టన్నింగ్‌ ఫీచర్స్‌తో వివో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌.. ధర ఎంతంటే..
స్టన్నింగ్‌ ఫీచర్స్‌తో వివో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌.. ధర ఎంతంటే..
2023ని ఎప్పటికి మర్చిపోలేం అంటున్న స్టార్ హీరోయిన్స్.. ఎందుకంటే ?
2023ని ఎప్పటికి మర్చిపోలేం అంటున్న స్టార్ హీరోయిన్స్.. ఎందుకంటే ?
'బంగారం.. ఎందుకంత త్వరగా వెళ్లిపోయావమ్మా?': విజయ్‌ ఆంటోని భార్య
'బంగారం.. ఎందుకంత త్వరగా వెళ్లిపోయావమ్మా?': విజయ్‌ ఆంటోని భార్య
కొత్త లుక్ లో కనిపించనున్న కళ్యాణ్ రామ్..
కొత్త లుక్ లో కనిపించనున్న కళ్యాణ్ రామ్..
పాత పద్ధతులకు స్వస్తి చెప్పిన బీజేపీ హైకమాండ్‌..
పాత పద్ధతులకు స్వస్తి చెప్పిన బీజేపీ హైకమాండ్‌..
లాంచింగ్ సిద్ధమైన వన్‌ప్లస్‌ కొత్త ఫోన్‌.. హైలెట్ ఫీచర్స్..
లాంచింగ్ సిద్ధమైన వన్‌ప్లస్‌ కొత్త ఫోన్‌.. హైలెట్ ఫీచర్స్..
CSIR-కంబైన్డ్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2023
CSIR-కంబైన్డ్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2023