AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral News: మంచంలో సగ భాగం అద్దెకు ఇస్తున్న యువతి.. నెలకు అద్దె ఎంతో తెలిస్తే షాక్.. కండిషన్స్ అప్లై..

ఒంటరిగా ఉన్నవారికి సింగిల్ బెడ్  సరిపోతుంది.. కానీ కింగ్ సైజ్ బెడ్ కొనుక్కుని హాయిగా పడుకునే వాళ్ళు కొందరున్నారు. అయితే ఎవరైనా తాను నిదురించే బెడ్‌లో సగం అద్దెకు ఇస్తారనే విషయం ఎవరికైనా తెలుసా..! ఇప్పటి వరకు ఇల్లు, సైకిళ్ళు, కారులు వంటివారిని అద్దెకు ఇవ్వడం తెలుసు.. కానీ ఓ యువతి తాను నిదురించే మంచంలో సగ భాగాన్ని అద్దెకు ఇస్తుంది.  చాలా వింతగా అనిపించినా ఇది నిజం.. డబుల్ బెడ్ ఉన్న ఒక యువతి ఆ బెడ్ లో సగభాగంలో నిద్రిస్తుంది. మిగిలిన సగం అద్దెకు ఇస్తుంది.

Viral News: మంచంలో సగ భాగం అద్దెకు ఇస్తున్న యువతి.. నెలకు అద్దె ఎంతో తెలిస్తే షాక్.. కండిషన్స్ అప్లై..
Anya Ettinger
Surya Kala
|

Updated on: Nov 20, 2023 | 6:07 PM

Share

ఆకలి రుచి ఎరుగదు.. నిద్ర సుఖం ఎరుగదు అని సామెత.. కానీ వాస్తవానికి సుఖమైన నిద్ర పోవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అందుకనే బెడ్ రూమ్ ని అందంగా కూల్ గా కనిపించేలా అలంకరించుకుంటారు. అంతేకాదు నిద్రపోయేందుకు ఉపయోగించే మంచాలను కూడా తమ సౌలభ్యానికి అనుగుణంగా ఏర్పాటు చేసుకుంటారు. జంటలు సాధారణంగా డబుల్ బెడ్‌ను కొంటారు. అయితే ఒంటరిగా ఉన్నవారికి సింగిల్ బెడ్  సరిపోతుంది.. కానీ కింగ్ సైజ్ బెడ్ కొనుక్కుని హాయిగా పడుకునే వాళ్ళు కొందరున్నారు. అయితే ఎవరైనా తాను నిదురించే బెడ్‌లో సగం అద్దెకు ఇస్తారనే విషయం ఎవరికైనా తెలుసా..! ఇప్పటి వరకు ఇల్లు, సైకిళ్ళు, కారులు వంటివారిని అద్దెకు ఇవ్వడం తెలుసు.. కానీ ఓ యువతి తాను నిదురించే మంచంలో సగ భాగాన్ని అద్దెకు ఇస్తుంది.  చాలా వింతగా అనిపించినా ఇది నిజం.. డబుల్ బెడ్ ఉన్న ఒక యువతి ఆ బెడ్ లో సగభాగంలో నిద్రిస్తుంది. మిగిలిన సగం అద్దెకు ఇస్తుంది. అమ్మాయి ఈ వింత సంపాదన గురించి తెలిసిన ప్రజలకు ఆశ్చర్యాన్ని కలిగించింది.

ఈ అమ్మాయి పేరు అన్య ఎట్టింగర్. తన కింగ్ సైజ్ బెడ్‌ని బాగా ఉపయోగించుకుంటుంది. ఏ మాత్రం కష్టపడకుండా భారీగా డబ్బు సంపాదించాలని అనుకుంటుంది. ఎవరైనా సరే తన మంచంలో సగం అద్దెకు తీసుకోవచ్చని అమ్మాయి చెప్పింది. అయితే.. ఇందుకు షరతు కూడా ఉంది. అలా అద్దెకు తీసుకునే వారు తప్పనిసరిగా అమ్మాయి అయి ఉండాలి. ఇప్పటి వరకూ ఇలా కూడా డబ్బు సంపాదించవచ్చు అని ఎవరికైనా ఆలోచన కలిగి ఉండవచ్చా..

‘బెడ్‌మేట్’ కోసం ఎందుకు వేడుకుతోందంటే..

డైలీ స్టార్ కథనం ప్రకారం అన్య కెనడాలోని టొరంటో నగరం నివాసి. అన్య సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఫేస్‌బుక్ మార్కెట్‌ప్లేస్‌లో ఒక వీడియో షేర్ చేసింది. ఈ వీడియోలో తాను ‘బెడ్‌మేట్’ కోసం చూస్తున్నానని చెప్పింది. టొరంటో చాలా ఖరీదైన నగరమని.. ఇక్కడ గది అద్దె చాలా ఎక్కువగా ఉంటుందని, సామాన్యులు ఈ రెంట్ భరించడం కష్టమని అన్య చెప్పింది. అందుకే ఆ అమ్మాయి బెడ్ మేట్ కోసం వెతుకుతోంది.  బెడ్‌పై తనతో పాటు పడుకోవచ్చని వెల్లడించింది.

ఇవి కూడా చదవండి

షరతులు ఏమిటంటే

ఆ అమ్మాయి తన బెడ్ ను అద్దెకు ఇవ్వడానికి పెట్టిన మొదటి షరతు ఏమిటంటే..  తన ‘బెడ్‌మేట్’ ఆడపిల్ల అయి ఉండాలి.. ఆమె తనతో కనీసం ఒక సంవత్సరం జీవించాలని వెల్లడించింది. తన మంచంలో సగం  అద్దెకు ఇవ్వడం అది కూడా నెలకు సుమారు రూ.75 వేలు అద్దెగా చెప్పడంతో అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు. అయితే కొందరు ఈ డీల్ ఏమాత్రం మంచిది కాదని అంటున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..