AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: ఎవడ్రా నువ్వు .. ఇలా ఉన్నావ్..  దెబ్బకు బిడ్డకు చలి జ్వరం వచ్చుంటుంది

'ఎవరితోనూ ఇలాంటి జోక్ చేయకండి... మితిమీరిన భయం కారణంగా కొన్నిసార్లు గుండెపోటుకు గురవుతారు. మీరు జోక్ చేస్తున్నారు. కానీ అవతలి వ్యక్తికి ఈ విషయం తెలియదు. మీ జోక్ ప్రాణాంతకం కావచ్చు. ఆ వ్యక్తికి గుండె ధైర్యం తక్కువగా ఉండి.. ఎక్కువ భయపడితే చనిపోయే ప్రమాదం ఉంటుందని పలువురు నెటిజన్లు సూచిస్తున్నారు.. ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయగా, ఇప్పటి వరకు లక్షల మంది వీక్షించారు. వీడియోపై ప్రజలు భిన్నమైన కామెంట్లు చేస్తున్నారు.

Watch Video: ఎవడ్రా నువ్వు .. ఇలా ఉన్నావ్..  దెబ్బకు బిడ్డకు చలి జ్వరం వచ్చుంటుంది
Proof Of Witch's Presence I
Jyothi Gadda
|

Updated on: Nov 20, 2023 | 5:36 PM

Share

మీరు రాత్రివేళ చీకట్లో టాయిలెట్‌కి వెళుతున్నప్పుడు అకస్మాత్తుగా దెయ్యం కనిపించడం ఎప్పుడైనా జరిగిందా..? మీకు అలాంటి పరిస్థితి ఎదురైతే ఏం చేస్తారు.. సహజంగానే భయంతో పరుగులుపెడతారు.. లేదంటే అక్కడే మూర్చపోయి పడిపోతారు.. మరీ పిరికి వారైతే.. అక్కడే ప్రాణం వదిలేస్తారు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలోని ఒక వ్యక్తికి అలాంటిదే జరిగింది. వైరల్ అవుతున్న వీడియోలో ఒక వ్యక్తి రాత్రిపూట టాయిలెట్‌కి వెళ్లేందుకు వచ్చాడు. అక్కడ సడెన్‌గా భయంకరమైన ఓ రూపాన్ని చూశాడు..ఆ తర్వాత ఏం జరిగిందో చూపించే వీడియో సోషల్ మీడియాలో ఇన్ స్టాగ్రామ్ లో వైరల్‌గా మారింది. అది చూసిన నెటిజన్లు సైతం షాక్‌ అవుతున్నారు. ఇంతకీ అసలు విషయం ఏంటంటే…

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో ఒక వ్యక్తి టాయిలెట్‌కు వెళ్లాడు. అయితే, అప్పటికే బాత్‌రూమ్‌ తెల్లటి బెడ్‌షీట్‌లో చుట్టబడి ఓ మహిళ నిలబడి ఉంది. చూసేందుకు ఆమె రూపం నల్లగా మహా భయంకరంగా కనిపిస్తుంది. అప్పటికే టాయిలెట్ చేయడానికి వెళ్తున్న వ్యక్తి వెనుక నిలబడి అతని కోసం వేచి ఉంది. కానీ, పాపం అత్యవసరంగా వాష్‌రూమ్‌లోకి వచ్చిన అతను.. తన వెనుక ఎవరో ఉన్నారని గమనించుకోలేదు. యధా మూమూలుగానే అతడు వాష్‌రూమ్‌లోకి ప్రవేశించాడు..అంతలోనే భయంకర రూపంతో ఉన్న ఆ మహిళ.. అతని దగ్గరికి వెళ్లి ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తుంది. దాంతో అతడు తన వెనుక ఎవరో ఉన్నారని గ్రహిస్తాడు..ఆ వెంటనే వెనక్కి తిరుగుతాడు..ఆ తర్వాత అతడి పరిస్థితి ఎలా ఉందంటే..

ఇవి కూడా చదవండి

తెల్లటి షీట్‌లో చుట్టబడి, భయంకర రూపంతో ఉన్న ఆ మనిషిని చూసిన అతడు ఒక్కసారిగా షాక్‌ తిన్నాడు.. భయంతో వణికిపోయాడు.. ఆ రూపాన్ని చూసిన వెంటనే ఎవరికైనా సరే గూస్‌బంప్స్ వచ్చేలా ఉంది.. అలాంటి రూపాన్ని ఒక్కసారిగా చూసిన అతడు కిందపడుతూ లేస్తూ.. గట్టిగా అరవటం మొదలుపెట్టాడు.. అతని అరుపును చూసి ఆ దెయ్యం కూడా భయపడుతుంది. అక్కడ నుండి పారిపోవడానికి ప్రయత్నిస్తుంది. ఆ మరుక్షణంలోనే అతడు ధైర్యం తెచ్చుకుని ఆ దెయ్యంపై దాడికి దిగాడు. ఆ దెయ్యాన్ని పట్టుకుని తగిన గుణపాఠం చెప్పడానికి ప్రయత్నించాడు..కానీ, అతడి చేతిలోంచి ఆ దెయ్యం తప్పించుకుని పారిపోతుంది. వైరల్ అవుతున్న ఈ వీడియోను చూసిన జనాలు ఫన్నీ కామెంట్స్‌తో వైరల్‌గా మార్చేశారు.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోను say.medsos’ అనే ఖాతా వినియోగదారు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఈ వీడియోకు 4 లక్షల 83 వేలకు పైగా లైక్‌లు వచ్చాయి. ఈ ఫన్నీ వీడియో చూసిన వారంతా తమదైన రీతిలో స్పందిస్తున్నారు. వీడియో చూసిన తర్వాత, ఒక వినియోగదారు వ్యాఖ్యానిస్తూ ఇలా వ్రాశారు – ‘ఎవరితోనూ ఇలాంటి జోక్ చేయకండి… మితిమీరిన భయం కారణంగా కొన్నిసార్లు గుండెపోటుకు గురవుతారు. మీరు జోక్ చేస్తున్నారు. కానీ అవతలి వ్యక్తికి ఈ విషయం తెలియదు. మీ జోక్ ప్రాణాంతకం కావచ్చు. ఆ వ్యక్తికి గుండె ధైర్యం తక్కువగా ఉండి.. ఎక్కువ భయపడితే చనిపోయే ప్రమాదం ఉంటుంది. ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయగా, ఇప్పటి వరకు లక్షల మంది వీక్షించారు. వీడియోపై ప్రజలు భిన్నమైన కామెంట్లు చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..