AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dance Video: అదిరేటి డ్రస్‌లో అందమైన డ్యాన్స్ వేసిన యువతి.. మెట్రోరైలులో ఆశ్చర్యానికి గురైన ప్రయాణికులు..

సాధారణంగా ప్రజారవాణాను ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి చేరుకునేందుకు ఉపయోగించుకుంటారు. కానీ ఇటీవల కాలంలో కొందరు తమ పాపులారిటీ పెంపొందించుకునేందుకు వేదికగా వాడుకుంటున్నారు. మన్నటి వరకూ అశ్లీల కార్యకలాపాలు చేసిన దాఖలాలు ఉన్నాయి. ఇంకొందరు వింత చేష్టలు చేస్తూ వీడియోలు, ఫోటోలు తీసుకుంటారు. మన్నటికి మన్న మన హైదరాబాద్ మెట్రోలో కూడా ఇలాంటి సంఘటనలు చాలా వెలుగులోకి వచ్చాయి.

Dance Video: అదిరేటి డ్రస్‌లో అందమైన డ్యాన్స్ వేసిన యువతి.. మెట్రోరైలులో ఆశ్చర్యానికి గురైన ప్రయాణికులు..
A Young Woman Dance In A Black Dress In A Delhi Metro Train Viral On Instagram
Srikar T
|

Updated on: Nov 20, 2023 | 7:32 PM

Share

సాధారణంగా ప్రజారవాణాను ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి చేరుకునేందుకు ఉపయోగించుకుంటారు. కానీ ఇటీవల కాలంలో కొందరు తమ పాపులారిటీ పెంపొందించుకునేందుకు వేదికగా వాడుకుంటున్నారు. మన్నటి వరకూ అశ్లీల కార్యకలాపాలు చేసిన దాఖలాలు ఉన్నాయి. ఇంకొందరు వింత చేష్టలు చేస్తూ వీడియోలు, ఫోటోలు తీసుకుంటారు. మన్నటికి మన్న మన హైదరాబాద్ మెట్రోలో కూడా ఇలాంటి సంఘటనలు చాలా వెలుగులోకి వచ్చాయి. స్మార్ట్ ఫోన్ అరచేతిలో ఉంది. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చింది. పైగా ఇప్పట్లో ఇంటర్నెట్ ఎక్కడ పడితే అక్కడ విరివిగా లభిస్తోంది. దీంతో ప్రతి ఒక్కరూ తమ పబ్లిసిటీని పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి సంఘటనలతో ఢిల్లీ మెట్రో మరోసారి వార్తల్లో నిలిచింది.

బన్నో అనే యువతి ఢిల్లీ మెట్రో రైలులో ప్రయాణించింది. ప్రయాణికులందరితో కలిసి ప్రయాణం చేసింది. ఈక్రమంలో హర్వానీ పాటకు డాన్స్ చేసి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. నల్లని చీర కట్టుకొని చేస్తున్న నృత్యాన్ని చూసి రైలులో ప్రయాణించే తోటి ప్రయాణికులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ వీడియోని తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లో పోస్ట్ చేశారు. దీనిని చూసి నెటిజన్లు రకరకాల కామెంట్స్ రూపంలో తమ అభిప్రాయాన్ని పంపిస్తున్నారు. ఇలాంటి వాటిని నిషేధిస్తూ ఢిల్లీ మెట్రో అధికారులు ఎన్ని సార్లు చర్యలు తీసుకున్నప్పటికీ ఇలాంటి ఆకతాయి చేష్టలు అదుపులోకి రావడం లేదు. ఇప్పుడైతే మెట్రో ఖాళీగా కనిపిస్తోంది. అదే రద్దీ ఎక్కువగా ఉన్న సమయంలో ఇలాంటి చర్యలకు పాల్పడితే తోటి ప్రయాణీకులకు చాలా అసౌకర్యం ఎదురయ్యే అవకాశం ఉంది. రీల్స్ చేస్తూ పబ్లిసిటీ కోసం పక్కవాళ్లను ఇబ్బంది పెడుతున్నారు.

ఇవి కూడా చదవండి

ఈ వీడియోపై నెటిజన్లు రకరకాల కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. కొందరు డాన్స్ బాగా చేశావని ప్రశంసిస్తుంటే.. మరికొందరు ఇలాంటి చర్యలకు పాల్పడటంపై తెగ సీరియస్ అవుతున్నారు. ఈ వీడియో కన్నూ కాఫీ గర్ల్ అనే ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లో పోస్ట్ చేయగా.. 53వేలకు పైగా లైక్స్ వచ్చాయి.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..