Viral Video: పాత జీన్స్ కు రొండున్నర కోట్లు.! అదే మరి స్పెషాలిటీ.. నవ్విపోదురు.
అవ్వుల్లా.. శాన్రోజులపాటు తొడిగిన పాయింట్లు, బుషోట్లు, శీరెలు, డ్రెస్సులను ఏంజేస్తుర్రుల్లా.. ఆ.. శినిగిన బట్టలను ఏంజేస్తరు.. పెంటమీద వారేస్తం.. లేదంటె పాతబట్టలు కొనేటోల్లకు అమ్మేస్తం.. అనంటరా..? ఇప్పటిదంక అట్ల చేస్తె చేశిర్రుగనీ.. ఇప్పటిసంది మాత్రం అస్సలట్ల చెయ్యకుర్రి నా మాటిని.. శినిగిన పాత బట్టలను భద్రంగ భీర్వలు, అల్వారిల్ల దాశ్పెట్టుర్రి.. రేపట్ల మీ వారసులకు వాటినే పంచియ్యచ్చు.. శీ.. పాడుగాను.. పాత బట్టలను దాస్కోని వారసులకు పంచుడేంది.?
అవ్వుల్లా.. శాన్రోజులపాటు తొడిగిన పాయింట్లు, బుషోట్లు, శీరెలు, డ్రెస్సులను ఏంజేస్తుర్రుల్లా.. ఆ.. శినిగిన బట్టలను ఏంజేస్తరు.. పెంటమీద వారేస్తం.. లేదంటె పాతబట్టలు కొనేటోల్లకు అమ్మేస్తం.. అనంటరా..? ఇప్పటిదంక అట్ల చేస్తె చేశిర్రుగనీ.. ఇప్పటిసంది మాత్రం అస్సలట్ల చెయ్యకుర్రి నా మాటిని.. శినిగిన పాత బట్టలను భద్రంగ భీర్వలు, అల్వారిల్ల దాశ్పెట్టుర్రి.. రేపట్ల మీ వారసులకు వాటినే పంచియ్యచ్చు.. శీ.. పాడుగాను.. పాత బట్టలను దాస్కోని వారసులకు పంచుడేంది? ? గవ్వేమన్న భూమిజాగలా, బంగారం ఎండి బిల్లలా దాస్కుంటందుకు.. అని లైట్ తీస్కుంటరేమొ.. అయితె గీ వార్త సూడుర్రిగ.. ఎందుకు చెప్తున్ననో ఎర్కయితది.. .. శినిగిపొయ్, శీకిపొయ్ శెదలు వట్టిన పాయింట్ను సైంటిస్టుల్లెక్క శేతులకు గ్లౌసులు తొడుక్కోని శెకింగులు చేస్తున్నరు సూడూ.. ఈ పాయింట్ ఇల్వ ఎంతానుకుంటుర్రూ.. కిలోల కొద్ది బంగారంతోని.. కోహినూర్ డైమండ్ తోని.. కోకాపేటల ఎక్రం భూమితోని పోటీవడే రేటు.. అవ్వుల్లా.. మూడు లక్షల డాలర్లట ఈ పాత జీన్స్ పాయింటు రేటు.. మన పైసల్ల చెప్పాలంటె.. అక్షరాల రొండున్నర కోట్లు.
మెక్సికోల జరిగిన వింటేజ్ ఫెస్టివెల్ల వెట్టిన అర్రాస్ పాటల అమ్ముడైంది.. కొన్నోల్లు ఎవలోగనీ.. మస్తు ముర్శిర్రట పాయింటు సొంతమైనందుకు.. శవ్వా.. ఎట్ల పాడైంది పాయింటు.. గంతగనం పైకంబెట్టి అసల్ దీన్ని ఎవల్ కొంటరు.. కొని ఏంజేస్తరు.. అనుకుంటుర్రేమొ.. తొడుక్కుంటందుకో.. సూశి మురుస్తందుకో కాదు.. మల్లచ్చే యాడాది ఇదే పాయింటును అమ్ముకోని ఇంకింత ఎక్వ సొమ్ము చేస్కుందామని.. అవ్ మరి.. ఇదో రకం దందా నడుస్తుంది దునియాల.. 150 ఏండ్ల 1873ల నెవెడా గని కార్మికుడు వాడిన లెవీస్ కంపెనీ జీన్స్ పాయింటట ఇది.. ఇగిప్పుడు అర్రాసు పాటవెడ్తె రొండున్నర కోట్లకు అమ్ముడైంది.. ఇదే పాయింట్ మున్పటిసారి లక్ష డాలర్లకు వొయ్యిందట.. ఇగీతాప ఇంకో రొండు లక్షల డాలర్లు.. ఇగ వచ్చేతాప ఇంకెంతకు వోతదోగనీ.. యాడాది కాపాడి మల్ల బ్యారంబెడ్తె పదహారున్నర కోట్ల లాభమచ్చింది.. ఏంజేస్తె అన్ని పైసలొస్తయ్ శెప్పుర్రి? అగొ అందుకే అంటున్నరు.. ఇప్పటి శినిగిన బట్టలు, బూట్లు, పాత సామాన్లే రేపటి ఆస్తి పాస్తులైతయ్ అని.. ఏమో.. రేపటిరోజుల్ల అదే పెద్ద దందా అయితదేమొ.. ఎవలికెర్క.. కదా?
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.