16 రోజుల కోమా నుంచి మేల్కోన్న చిన్నారి.. ఆనందంతో అమ్మ చేసిన పనికి బోరుమన్న బుడ్డొడు..

ఈ దృశ్యాన్ని ఆస్పత్రి సిబ్బంది వీడియో తీయగా ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఈ వీడియోను వేలాది మంది వీక్షించారు. పలువురు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. తన తల్లి కన్నీళ్లను చూసి చలించిపోయాను.. కుటుంబం మొత్తానికి నా ప్రార్థనలు అంటూ ఒకరు కామెంట్‌ చేయగా, ఆ చిన్నారి ఏడుపు చూడలేకపోతున్నానంటూ మరొకరు వ్యాఖ్యానించారు.

16 రోజుల కోమా నుంచి మేల్కోన్న చిన్నారి.. ఆనందంతో అమ్మ చేసిన పనికి బోరుమన్న బుడ్డొడు..
16 Days In Coma
Follow us
Jyothi Gadda

|

Updated on: Jun 26, 2023 | 9:14 PM

తల్లి, బిడ్డల మధ్య సంబంధాన్నిఎలా వర్ణించి చెప్పినా తక్కువే. బిడ్డ సుఖమే తన సుఖం, బిడ్డ కష్టమే తన కష్టం కావాలని కోరుకునేది తల్లి. తన పిల్లలకు ఏ చిన్న కష్టం వచ్చినా ఆ తల్లి తట్టుకోలేదు. అలాంటిది ఒక చిన్నారి కోమాలోకి వెళ్లి 16 రోజులైంది. దాంతో ఆ తల్లి ఆవేదన వర్ణనాతీతంగా మారింది. ఆమెకు కనిపించిన దేవుడికల్లా మొక్కుకుంది. ఈ క్రమంలోనే బాలుడు లేచి కూర్చున్నాడు. 16 రోజులుగా కోమాలో ఉన్న కొడుకు లేచి కూర్చున్నప్పుడు ఆ తల్లి సంతోషానికి అవధులు లేవు. అయితే, ఆ గొప్ప మధుర క్షణాలు కెమెరాకు చిక్కాయి. ఆ వీడియో కాస్త సోషల్ మీడియాలో చేరటంతో వైరల్ అయ్యింది.

గుడ్‌న్యూస్ మూవ్‌మెంట్ అనే ఇన్‌స్టాగ్రామ్ పేజీ ద్వారా వీడియో అప్‌లోడ్ చేయబడింది. బాలుడు డిస్ట్రోఫిక్ ఎపిడెర్మాలిస్ బులోసా అనే అరుదైన చర్మ వ్యాధితో జన్మించాడు. ఇది రక్తంలో VII కొల్లాజెన్ లేకపోవడం వల్ల వచ్చే వ్యాధి. టైప్ VII కొల్లాజెన్, చర్మాన్ని బాహ్యచర్మానికి బంధించే ప్రోటీన్‌ను ‘బైండింగ్ ప్రోటీన్’ అంటారు. ఈ వ్యాధి ఉన్నవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. తల్లిదండ్రులతో పాటు స్వయంగా వ్యాధి ఉన్న పిల్లలు కూడా ఈ వ్యాధి పట్ల శ్రద్ధ వహించాలి. చర్మంపై గాయాలు పొక్కులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ వ్యాధి కారణంగా చిన్న పిల్లవాడు 16 రోజుల పాటు కోమాలోకి వెళ్లిపోయాడు. అతడిని 14 రోజుల పాటు ఇంట్యూబేట్‌లో ఉంచారు. గుడ్‌న్యూస్ మూవ్‌మెంట్ ఈ వీడియోను పోస్ట్ చేసింది.

ఇవి కూడా చదవండి

కోమా నుంచి బయటకు రాగానే ఆ చిన్నారికి తన తల్లిని చూడాలనిపించింది. అయితే ఇన్ని రోజులు తనతో ఉన్న తల్లి ఆ రోజే ఇంటికి వెళ్లిపోయింది. దాంతో పిల్లవాడు స్పృహలోకి రావడం గురించి తెలిసిన వెంటనే, ఆమె పరుగున వచ్చి పిల్లవాడిని కౌగిలించుకొని సంతోషంతో ఏడవటం మొదలుపెట్టింది. అమ్మను చూసి ఆ చిన్నారి కూడా ఏడవడం మొదలుపెట్టాడు. ఈ దృశ్యాన్ని ఆస్పత్రి సిబ్బంది వీడియో తీయగా ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఈ వీడియోను వేలాది మంది వీక్షించారు. పలువురు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. తన తల్లి కన్నీళ్లను చూసి చలించిపోయాను.. కుటుంబం మొత్తానికి నా ప్రార్థనలు అంటూ ఒకరు కామెంట్‌ చేయగా, ఆ చిన్నారి ఏడుపు చూడలేకపోతున్నానంటూ మరొకరు వ్యాఖ్యానించారు. ఓవరాల్ గా ఈ వీడియో చూసిన చాలా మంది ఎమోషనల్ అయ్యారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..