Viral Video: వామ్మో.. పెద్ద గుడ్లను మింగేందుకు పాము తంటాలు.. వైరల్ వీడియో చూసి విస్తుపోతున్ననెటిజన్లు
Shocking Video:సాధారణంగా పాములు తమ ఆకలిని తీర్చుకునేందుకు రకరకాల కీటకాలు, చిన్న చిన్న పక్షులను సైతం తింటుంటాయి. ఒక్కోసారి గుడ్లను కూడా అమాంతం మింగేస్తుంటాయి. ఈ వీడియోలోనూ పాము పెద్ద గుడ్లను మింగడం మనం చూడవచ్చు.

Shocking Video: ఈ భూమిపై ప్రమాదకరమైన జీవ జాతుల్లో పాములు కూడా ఒకటి. ప్రపంచవ్యాప్తంగా 2 వేలకు పైగా జాతుల పాములున్నాయి. అందులో కొన్ని చాలా ప్రమాదకరమైనవి విషపూరితమైనవి. మరికొన్ని విషపూరితం కానప్పటికీ మనుషులు మాత్రం వాటికి దూరంగా ఉంటారు. పొరపాటున అవి కనిపించినా వెంటనే ఆమడదూరం పరిగెత్తుతారు. ఇక ఈ రోజుల్లో పాముకు సంబంధించిన చాలా వీడియోలు సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి. అందులో కొన్ని ఆశ్చర్యకరంగా ఉంటే మరికొన్ని భయానకంగానూ ఉన్నాయి. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి నెట్టింట్లో తెగ వైరలవుతోంది. సాధారణంగా పాములు తమ ఆకలిని తీర్చుకునేందుకు రకరకాల కీటకాలు, చిన్న చిన్న పక్షులను సైతం తింటుంటాయి. ఒక్కోసారి గుడ్లను కూడా అమాంతం మింగేస్తుంటాయి. ఈ వీడియోలోనూ పాము పెద్ద గుడ్లను మింగడం మనం చూడవచ్చు.
ఇందులో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. పాము నోరు చిన్నదే అయినా పెద్ద గుడ్లను సైతం మింగేందుకు ప్రయత్నిస్తుంది. అందుకే ఏకంగా రెండు గంటల సమయం తీసుకుంది. పక్షి గుడ్లు పగలకుండా పాము నేరుగా మింగేసిన ఈ ఘటన ఆఫ్రికాలో జరిగిందట. @Rainmaker1973 అనే IDతో ట్విట్టర్‌లో షేర్ చేసిన ఈ వీడియో నెట్టింట్లో తెగ హల్‌చల్ చేస్తోంది. ఇప్పటివరకు మిలియన్ల మంది ఈ వీడియోను వీక్షించారు.ఈ వీడియోను చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. చిన్న చిన్న పాములు తన ఆకలిని తీర్చుకునేందుకు ఎంతకైనా తెగిస్తాయని చెప్పడానికి ఇదే నిదర్శనమంటూ కామెంట్లు పెడుతున్నారు. ఈ పాముకి గుడ్లంటే ఎంతో ఇష్టమేమో అని మరికొందరు రిప్లై ఇస్తున్నారు.




Egg-eating snakes (genus Dasypeltis) live in Africa and feed on bird eggs. Watch one swallowing a egg bigger than its head breaking its shell with its cervical vertebrae. The entire process took 2 hours [full video, Living Zoology: https://t.co/FsVxRiX4WN]pic.twitter.com/Via2LZ1QF7
— Massimo (@Rainmaker1973) September 8, 2022
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..
