Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వీడేం మనిషిరా బాబు.. దొంగతనానికి వచ్చి గురకపట్టి నిద్రపోయాడు.. చివరికి

మనకెందులే అనుకుని ఆ ఇంటి యజమాని కూడా తన గదిలోకి వెళ్లి నిద్రపోయాడు. దాదాపు అరగంట తర్వాత పాపకు పాల సీసా కోసం వంటింట్లోకి వెళ్లగా మళ్లీ గురక శబ్ధం వినిపించింది. దాంతో మరోసారి ఇల్లంతా గాలించారు. కొద్దిసేపటి తర్వాత ఇంట్లోని మరో గది తలుపులు తెరిచి చూడగా.. వారింట్లోకి గుర్తు తెలియని వ్యక్తి ఎవరికీ తెలియకుండా ప్రవేశించాడని, ఇక్కడ నిద్రపోతున్నాడని గుర్తించారు. అతన్ని చూసిన కుటుంబీకులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు

వీడేం మనిషిరా బాబు.. దొంగతనానికి వచ్చి గురకపట్టి నిద్రపోయాడు.. చివరికి
Funny Robbery Story
Follow us
Jyothi Gadda

|

Updated on: Nov 22, 2023 | 3:03 PM

తాజాగా ఓ ఆసక్తికరమైన దొంగతనం ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఇక్కడ చోరీ చేసేందుకు ఓ ఇంట్లోకి చొరబడిన దొంగ ఇంతలో నిద్ర ముంచుకు రావడంతో అదే ఇంట్లో గురక పెట్టి నిద్రపోయాడు. దొంగ గురకకు మెలకువ వచ్చిన యజమాని పోలీసులకు ఫోన్ చేసి పట్టించాడు. ఇక్కడ మరో తమాషా ఏంటంటే.. పోలీసులు వచ్చే వరకు దొంగ గాఢనిద్రలోనే ఉన్నాడు. ఈ ఘటన చైనాలోని యునాన్ ప్రావిన్స్‌లో చోటుచేసుకుంది. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ నివేదిక ప్రకారం, దొంగతనం చేయాలనే ఉద్దేశ్యంతో ఒక దొంగ ఇంట్లోకి చొరబడ్డాడు. అయితే ఆ సమయంలో కుటుంబ సభ్యులు మేల్కొనే ఉన్నారు. ఇంట్లో వారి మాటలు విన్న దొంగ ఆ కుటుంబ సభ్యులంతా నిద్రపోయే వరకు వేచి ఉండటానికి ఒక గదిలో కొంతసేపు వేచి ఉన్నాడు. అలా అక్కడే నిద్రపోయాడు. పాపం, ఆ ఇంట్లో వాళ్లు పడుకోక ముందే.. దొంగ మాత్రం గురకపెట్టి గాఢ నిద్రలోకి జారుకున్నాడు. ఆ గురకే అతన్ని పోలీసులకు పట్టించేలా చేసింది.

ఇంట్లోకి చొరబడిన దొంగ పెద్దగా శబ్ధం చేస్తూ గురకపెట్టడంతో ఆ ఇంట్లోని వారంతా ఒక్కసారిగా షాక్‌ అయ్యారు. ఇంట్లో వింత శబ్ధాలు ఏంటని ఇల్లంతా వెతికారు. ముందుగా ఆ గురక శబ్దం ఇరుగుపొరుగు ఇళ్లనుంచి వచ్చి ఉంటుందని భావించారు. మనకెందులే అనుకుని ఆ ఇంటి యజమాని కూడా తన గదిలోకి వెళ్లి నిద్రపోయాడు. దాదాపు అరగంట తర్వాత పాపకు పాల సీసా కోసం వంటింట్లోకి వెళ్లగా మళ్లీ గురక శబ్ధం వినిపించింది. దాంతో మరోసారి ఇల్లంతా గాలించారు. కొద్దిసేపటి తర్వాత ఇంట్లోని మరో గది తలుపులు తెరిచి చూడగా.. వారింట్లోకి గుర్తు తెలియని వ్యక్తి ఎవరికీ తెలియకుండా ప్రవేశించాడని, ఇక్కడ నిద్రపోతున్నాడని గుర్తించారు.

అతన్ని చూసిన కుటుంబీకులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన వ్యక్తి గతంలో దొంగతనాలకు పాల్పడి జైలుకు కూడా వెళ్లి వచ్చినట్టుగా పోలీసులు తెలిపారు. సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..