AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వామ్మో.. ప్రపంచంలోనే అతిపెద్ద ట్రక్‌.. మూడంతస్తుల ఎత్తు.. టైర్ల ముందు మనిషి మరుగుజ్జు.. ఇక ఖరీదు తెలిస్తే

కొద్ది రోజుల క్రితం 200 కంటే ఎక్కువ టైర్లను కలిగి ఉన్న ఒక ట్రక్కు వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. ఇది చూసిన ప్రజలు ఆశ్చర్యపోయారు. ఇంతలో ట్రక్కుకు సంబంధించిన వీడియో ఒకటి బయటకు వచ్చింది. దీనిని చూస్తే ఇంత పెద్ద ట్రక్కులు కూడా ఉన్నాయంటే మీ కళ్లను మీరే నమ్మలేరు. అంతేకాదు..కేవలం ఈ ట్రక్కు టైర్లు మాత్రమే 2 కోట్ల రూపాయలు అని తెలిస్తే..గుడ్లు తేలేయాల్సిందే..! పూర్తి వివరాల్లోకి వెళితే..

వామ్మో.. ప్రపంచంలోనే అతిపెద్ద ట్రక్‌.. మూడంతస్తుల ఎత్తు.. టైర్ల ముందు మనిషి మరుగుజ్జు.. ఇక ఖరీదు తెలిస్తే
World Biggest Truck
Jyothi Gadda
|

Updated on: Nov 22, 2023 | 4:58 PM

Share

ఇంటర్నెట్ ప్రపంచం చాలా పెద్దది. ఇక్కడ ఎన్నో రకాల వింతలు, విశేషాలు, విడ్డూరాలను చూస్తుంటాం..సోషల్ మీడియాలో కనిపించే చాలా విషయాలను బహుశా మనం మన చుట్టుపక్కల చూడలేము. సోషల్ మీడియా యూజర్లు, వినియోగదారులు తమకు నచ్చిన విషయాలను ప్రపంచానికి పరిచయం చేయటానికి వేధికగా ఇంటర్‌నెట్‌ అవకాశాన్ని అందిస్తుంది. ఎవరైనా ఇక్కడ ఏదైనా ఆసక్తికరంగా కనిపిస్తే, అతను వెంటనే దాన్ని ఇతరులతో పంచుకుంటాడు.. ఎందుకంటే ఇక్కడ ఏదైనా కొత్తది నలుగురితో కలిసి షేర్‌ చేసుకోవటం చాలా సులభం. కొద్ది రోజుల క్రితం 200 కంటే ఎక్కువ టైర్లను కలిగి ఉన్న ఒక ట్రక్కు వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. ఇది చూసిన ప్రజలు ఆశ్చర్యపోయారు. ఇంతలో ట్రక్కుకు సంబంధించిన వీడియో ఒకటి బయటకు వచ్చింది. దీనిని చూస్తే ఇంత పెద్ద ట్రక్కులు కూడా ఉన్నాయంటే మీ కళ్లను మీరే నమ్మలేరు. అంతేకాదు..కేవలం ఈ ట్రక్కు టైర్లు మాత్రమే 2 కోట్ల రూపాయలు అని తెలిస్తే..గుడ్లు తేలేయాల్సిందే..పూర్తి వివరాల్లోకి వెళితే..

సోషల్ మీడియాలో ఓ ట్రక్‌ వీడియో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో shridhar.m అనే పేజీ నుండి Instagram లో అప్‌లోడ్ చేయబడింది. ఇందులో ఒక వ్యక్తి చాలా ట్రక్కుల మధ్య వెళ్తున్నాడు. అతను ట్రక్కు దగ్గర నిలబడితే, అతను దాని టైర్ల కంటే చాలా చిన్నగా కనిపిస్తున్నాడు.. సమాచారం ప్రకారం, ఈ ట్రక్ ఎత్తు మూడు అంతస్తుల భవనంతో సమానంగా ఉంటుంది. ఈ ట్రక్కు చక్రాల ధర రూ. 2 కోట్లు అని ఆ వ్యక్తి చెప్పాడు. ఇకపోతే, ఈ ట్రక్ నాలుగు లక్షల కిలోల లోడ్‌ను మోయగలదు. ఈ ట్రక్ పేరు XDE440 అని సమాచారం. ఈ ట్రక్ చక్రాల ఎత్తు 10 అడుగుల కంటే ఎక్కువగా ఉందని తెలుస్తుంది. దాని ముందు నిలబడి ఉన్న మనిషి కూడా మరగుజ్జులా కనిపిస్తున్నాడు.. ఈ డంపింగ్ ట్రక్కులు సాధారణంగా రోడ్లపై కనిపించవు ఎందుకంటే వాటిని మైనింగ్ కోసం ఉపయోగిస్తారట.

ఇవి కూడా చదవండి

ఈ వీడియో చూసిన తర్వాత చాలా మంది నెటిజన్లు ట్రక్ గురించి చాలా ఆసక్తిగా స్పందించారు. వినియోగదారులు రకరకాలుగా వ్యాఖ్యానించారు. ఇంత భారీ ట్రక్కును చూడటం ఇదే తొలిసారి అని, అది మా ఇంటి అంత పెద్దదని ఓ వ్యక్తి రాశాడు. కాగా, ఈ ట్రక్కు రోడ్డుపైకి వస్తే ఏం జరుగుతుందని మరో వ్యక్తి వ్యాఖ్యానించారు. అదే సమయంలో చాలా మంది ఆశ్చర్యపరిచే ఎమోజీలతో తమ స్పందనలను తెలియజేస్తున్నారు. ఈ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో ఎక్కువగా వైరల్ అవుతుంది. ఈ వీడియోని ఇప్పటివరకు కోటి మందికి పైగా వీక్షించారు. అదే సమయంలో ఈ వీడియోను ఆరు లక్షల మందికి పైగా లైక్ చేసారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..