Viralvideo: కళ్లకు గంతలు కట్టుకుని నూడుల్స్ తయారీ.. ముగ్ధులవుతోన్న నెటిజన్లు..
సోషల్ మీడియా ప్రపంచంలో రోజూ ఎన్నో అద్భుతమైన వీడియోలు దర్శనమిస్తుంటాయి. అందులో కొన్ని నవ్వు తెప్పిస్తే.. మరికొన్ని ఆశ్చర్యానికి, ఆలోచనకు గురిచేస్తాయి.

సోషల్ మీడియా ప్రపంచంలో రోజూ ఎన్నో అద్భుతమైన వీడియోలు దర్శనమిస్తుంటాయి. అందులో కొన్ని నవ్వు తెప్పిస్తే.. మరికొన్ని ఆశ్చర్యానికి, ఆలోచనకు గురిచేస్తాయి. అలాంటి కోవకు చెందిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ గా మారింది. ఇందులో ఒక స్ట్రీట్ ఫుడ్ వ్యాపారి కళ్లకు గంతలు కట్టుకుని మరీ నూడుల్స్ తయారు చేయడం చాలామందిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. దీంతో చాలామంది అతడి నైపుణ్యాన్నిప్రశంసిస్తున్నారు. కాగా ఈ వీడియోలో కనిపిస్తున్న వ్యక్తి మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ నివాసి. స్థానికంగా సాయి కృపా చైనీస్ సెంటర్ ఓ నూడుల్స్ దుకాణం నిర్వహిస్తున్నాడు.
ఈ వీడియోలో నూడుల్స్ తయారు చేసే ముందు దుకాణదారుడు కళ్లకు గంతలు కట్టుకుంటాడు. ఆతర్వాత ముందుగా కత్తితో క్యాబేజీని అతివేగంగా కోసి ప్యాన్ లో వేయిస్తాడు. తర్వాత పాన్‌లో నూడుల్స్ వేసి, సాస్ ఇతర పదార్థాలు వేసి బాగా కలుపుతాడు. స్టవ్ మంటపై నూడుల్స్ ను సిద్ధం చేసి ఆపై ప్లేట్ లో సర్వ్ చేసి స్వయంగా కస్టమర్లకు అందిస్తాడు. వడ్డించే ముందు నూడుల్స్ పై కొత్తిమీర ఆకులతో అలంకరిస్తాడు. కాగా అతని నైపుణ్యానికి నెటిజన్లు ముగ్ధులవుతున్నారు. ఫైర్ ఎమోజీలతో కామెంట్ బాక్స్ ను నింపేస్తున్నారు . ‘మీరు ఈ టెక్నిక్ ఎక్కడ నుండి నేర్చుకున్నారు’ మీ నైపుణ్యానికి హ్యాట్సాఫ్’ అంటూ ప్రశంసిస్తూ కామెంట్లు వర్షం కురిపిస్తున్నారు. మరి నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంటోన్న ఈ వీడియోపైమీరూ ఓ లుక్కేయండి.
View this post on Instagram
Also Read: Coronavirus: మొన్న తండ్రి.. నేడు కుమారుడు.. కరోనా బారిన పడ్డ స్టార్ హీరో..