Viral Video: 1,019 అక్షరాలతో ఎంత పె...ద్ద.. ‘పేరు’..! గిన్నీస్ వరల్డ్ రికార్డు సాధించిన అమ్మాయిని చూసి షాక్ అవుతున్న నెటిజన్లు..(వీడియో)

Viral Video: 1,019 అక్షరాలతో ఎంత పె…ద్ద.. ‘పేరు’..! గిన్నీస్ వరల్డ్ రికార్డు సాధించిన అమ్మాయిని చూసి షాక్ అవుతున్న నెటిజన్లు..(వీడియో)

Anil kumar poka

|

Updated on: Jan 20, 2022 | 9:58 PM

యూఎస్‌లో ఓ అమ్మాయి పేరు చాలా పెద్దది. అంతపెద్ద పేరు చదవాలని ప్రయత్నించినా కష్టమే. పైగా ఆ అమ్మాయి ఈ అసాధారణమైన పేరుతో గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డు సృష్టించింది. అసలు విషయంలో కెళితే….అమెరికాకు చెందిన సాండ్రా విలియమ్స్ తన కూతురికి విన్నూతనంగా పేరుపెట్టాలనుకుంది.



యూఎస్‌లో ఓ అమ్మాయి పేరు చాలా పెద్దది. అంతపెద్ద పేరు చదవాలని ప్రయత్నించినా కష్టమే. పైగా ఆ అమ్మాయి ఈ అసాధారణమైన పేరుతో గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డు సృష్టించింది. అసలు విషయంలో కెళితే….అమెరికాకు చెందిన సాండ్రా విలియమ్స్ తన కూతురికి విన్నూతనంగా పేరుపెట్టాలనుకుంది. ఆ పేరు ప్రపంచంలో ఎవరికి ఉండకూడదని అనుకుంది. అనుకున్నదే తడువుగా 1984లో పుట్టిన కూతురికి రోషాండియాటెల్లీనేషిఔన్నేవ్షెంక్కోయాని స్క్వాట్సియుత్ విలియమ్స్ ( Rhoshandiatellyneshiaunneveshenk Koyaanisquatsiuth Williams’ ) అని పేరు పెట్టేసింది. మూడు వారాల తర్వాత సాండ్రా భర్త ఒక సవరణ చేశారు.దీంతో ఆ పేరు 1,019 అక్షరాలతో ప్రపంచంలోనే అ‍త్యంత పొడవైన పేరుగా మారింది. అంతేకాదు ఆ అక్షరాల్లో కేవలం 36-అక్షరాలతో ముద్దుగా పిలుచుకునే జామీ అనే పేరు ఉందట. దీంతో ఆ చిన్నారికి రెండు అడుగుల జనన ధృవీకరణ పత్రాన్ని అందించారు స్థానిక ప్రభుత్వం. దీంతో గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డులోకెక్కింది. సెలబ్రిటీ హోస్ట్‌ ఓప్రా ఇంటర్యూలో చిన్నారి తల్లి తన కూతురి పేరు విభిన్నంగా ప్రత్యేకంగా ఉండాలనుకోవడంతోనే గిన్నిస్‌ వరల్డ్‌ బుక్‌లో చోటు దక్కిందని ఓప్రాతో చెప్పింది.