UP Elections 2022: యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌పై పోటీ చేస్తానని ప్రకటించిన భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కోసం రాజకీయ పార్టీలు జోరు పెంచాయి. ఇప్పటికే అన్ని పార్టీలు తమ తమ అభ్యర్థులను ప్రకటిస్తున్నాయి. మొట్ట మొదటిసారిగా అసెంబ్లీ బరిలో పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్.

Uttar Pradesh Assembly Election 2022: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కోసం రాజకీయ పార్టీలు జోరు పెంచాయి. ఇప్పటికే అన్ని పార్టీలు తమ తమ అభ్యర్థులను ప్రకటిస్తున్నాయి. మొట్ట మొదటిసారిగా అసెంబ్లీ బరిలో పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్(Yogi Adityanath). గోరఖ్‌పూర్ సదర్(Gorakhpur) స్థానం నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు. అయితే ఆయనకు వ్యతిరేకంగా భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్(Chandrashekhar Azad) గళం విప్పారు. వచ్చే ఎన్నికల్లో యోగిపై పోటీ చేసేందుకు సమర శంఖం పూరించారు.
యోగి ఆదిత్యనాథ్ కూడా తొలిసారిగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారు. 2017లో ముఖ్యమంత్రి అయ్యే వరకు లోక్‌సభ సభ్యుడిగా ఉన్నారు. యోగి తొలిసారిగా 1998లో గోరఖ్‌పూర్ నుంచి లోక్‌సభ ఎంపీగా ఎన్నికయ్యారు. గోరఖ్‌పూర్ నుంచి వరుసగా 5 సార్లు లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించారు. కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత శాసనమండలి ద్వారా ఎమ్మెల్సీగా ఎంచుకున్నారు.
ప్రగతిశీల సమాజ్‌వాదీ పార్టీ (పీఆర్‌ఎస్‌పీ) జాతీయ అధ్యక్షుడు శివపాల్ సింగ్ యాదవ్, సుహెల్‌దేవ్ భారతీయ సమాజ్ పార్టీ అధినేత ఓం ప్రకాశ్ రాజ్‌భర్, రాష్ట్రీయ లోక్‌దళ్ అధినేత జయంత్ సహా కొంతమంది వ్యక్తులపై తమ పార్టీ అభ్యర్థులను నిలబెట్టబోదని ఆజాద్ చెప్పారు. సమాజ్‌వాదీ అధ్యక్షులు అఖిలేష్ యాదవ్ ఎన్నికల్లో పోటీ చేస్తే పార్టీ తన ముందు అభ్యర్థిని నిలబెట్టదని ఆయన అన్నారు.
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ 100 సీట్లు ఇచ్చినా, దానితో పొత్తు పెట్టుకోబోమని ఆజాద్ సమాజ్ పార్టీ అధ్యక్షుడు చంద్రశేఖర్ ఆజాద్ స్పష్టం చేశారు. ఉత్తరప్రదేశ్‌లో తమ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని, సమాజ్‌వాదీ పార్టీతో చర్చలు ఫలించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆజాద్ సమాజ్ పార్టీ అధినేత చంద్రశేఖర్ ఆజాద్ గ్రేటర్ నోయిడాలో విలేకరుల సమావేశంలో తెలిపారు.
बहुत – बहुत आभार साधुवाद। पिछले 5 साल भी लड़ा हूँ। अब भी लड़ूंगा। जय भीम,जय मण्डल। बहुजन हिताय, बहुजन सुखाय। https://t.co/FROhXhttiv
— Chandra Shekhar Aazad (@BhimArmyChief) January 20, 2022