జనవరి 26న రాజ్‌పథ్‌లో జరిగే ప్రధాన రిపబ్లిక్ డే పెరేడ్, జనవరి 29న జరిగే "బీటింగ్ రిట్రీట్" వేడుకలో చాలా ప్రత్యేకతలున్నాయని చెబుతున్నారు. వేడుక ముగింపును సూచించే సాంప్రదాయ ఫ్లై-పాస్ట్‌లో 75 విమానాలు పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నాయి. వింటేజ్‌తో పాటు రాఫెల్, సుఖోయ్, జాగ్వార్, ఎంఐ-17, సారంగ్, అపాచీ, డకోటా వంటి ఆధునిక విమానాలను ప్రదర్శించనున్నారు. ఫ్లై-పాస్ట్ లో విమానాలు లేదా హెలికాప్టర్ల ద్వారా 15 వేర్వేరు రూపాలను ప్రదర్శిస్తారు..