UP Elections 2022: యూపీలో కొత్త నాయకత్వం.. బీఎస్పీలో చేరిన ప్రముఖ న్యాయవాది..
UP Elections 2022: ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికలు సమీపిస్తున్నాకొద్ది పొలిటికల్ హీట్ మరింత పెరుగుతోంది.

UP Elections 2022: ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికలు సమీపిస్తున్నాకొద్ది పొలిటికల్ హీట్ మరింత పెరుగుతోంది. ప్రముఖ నేతల జంపింగ్ జపాంగ్ సీన్లు అధికమవుతున్నాయి. అదే తరుణంలో ప్రముఖ పార్టీల్లోకి నూతన చేరికలు కూడా జరుగుతున్నాయి. నిర్భయ, హత్రాస్ రేప్ కేసుల్లో బాధితుల తరపున వాదించిన సుప్రీంకోర్టు న్యాయవాది సీమా కుష్వాహ తాజాగా బహుజన్ సమాజ్ పార్టీలో చేరారు. తద్వారా త్వరలో జరుగనున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమే పోటీకి సమాయత్తం అవుతున్నారు. కాగా, లక్నోలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సతీష్ చంద్ర మిశ్రా సమక్షంలో సీమా కుష్వాహ బీఎస్పీలో చేరారు. బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరిగేందుకే పార్టీలో చేరుతున్నట్లు ఆమె తెలిపారు.
ఇంతకీ సీమా కుష్వా ఎవరు? సీమా కుష్వాహా సుప్రీంకోర్టు న్యాయవాది. అంతేకాదు.. దేశ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన నిర్భయ, హత్రాస్ రేప్ కేసు బాధితుల తరఫున సుప్రీంకోర్టులో వాదించారు. అలాగే నిర్భయ జ్యోతి పేరిట ట్రస్ట్ ఏర్పాటు చేసి.. అత్యాచార బాధితులకు న్యాయం జరిగేలా ప్రచారాన్ని చేపట్టారు.
బీఎస్పీ అభ్యర్థుల జాబితా విడుదల.. ఫిబ్రవరి 10న జరగనున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా తొలి విడత అభ్యర్థుల పేర్లను మాయావతి నేతృత్వంలోని బీఎస్పీ బుధవారం ప్రకటించింది. గత వారం 53 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల జాబితాను ఆ పార్టీ విడుదల చేసింది.
बहुजन समाज में जन्मे सभी पूज्य संत व महापुरुषों एवं आदरणीय बहन सुश्री @Mayawati जी के विचारों से प्रेरित होकर, महिलाओं को न्याय दिलाने व उनके अधिकारों के लिए सदैव संघर्ष करने वाली सीमा कुशवाहा जी ने आज @bspindia की सदस्यता ग्रहण की। pic.twitter.com/kNGRKBvehn
— Satish Chandra Misra (@satishmisrabsp) January 20, 2022
Also read:
TTD: తిరుచానూరులో శ్రీయాగానికి అంకురార్పణ.. ఈ ఏడు రోజులపాటు ఆర్జిత సేవలు రద్దు..
Coronavirus: కన్నడ చిత్ర పరిశ్రమలో విషాదం.. ప్రముఖ దర్శకుడిని బలి తీసుకున్న కరోనా….