AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: ఏడుగురు అమ్మాయిలు.. 13 మంది అబ్బాయిలు.. ఫామ్‌ హౌస్‌లో అర్ధరాత్రి అర్ధనగ్నంగా..

ఫామ్‌ హౌస్‌లో పార్టీ జరుగుతోంది.. ఏదో తేడాగా కనిపించింది.. చాలామంది అబ్బాయిలు ఉన్నారు.. అమ్మాయిలు కొంతమంది మాత్రమే ఉన్నారు.. డీజేలతో రచ్చ రచ్చ చేస్తున్నారు. ఈ క్రమంలోనే పోలీసులు ఎంట్రీ ఇచ్చారు.. అక్కడ సీన్ చూసి దెబ్బకు షాకయ్యారు. బయటకేమో ఫామ్ హౌస్ లోపలేమో వేర కథలా ఉంది.

Hyderabad: ఏడుగురు అమ్మాయిలు.. 13 మంది అబ్బాయిలు.. ఫామ్‌ హౌస్‌లో అర్ధరాత్రి అర్ధనగ్నంగా..
Mujra Party In Moinabad
Shaik Madar Saheb
|

Updated on: Apr 09, 2025 | 12:08 PM

Share

ఫామ్‌ హౌస్‌లో పార్టీ జరుగుతోంది.. ఏదో తేడాగా కనిపించింది.. చాలామంది అబ్బాయిలు ఉన్నారు.. అమ్మాయిలు కొంతమంది మాత్రమే ఉన్నారు.. డీజేలతో రచ్చ రచ్చ చేస్తున్నారు. ఈ క్రమంలోనే పోలీసులు ఎంట్రీ ఇచ్చారు.. అక్కడ సీన్ చూసి దెబ్బకు షాకయ్యారు. బయటకేమో ఫామ్ హౌస్ లోపలేమో వేర కథలా ఉంది. గంజా, మద్యం తాగుతూ.. అర్ధనగ్నంగా డ్యాన్సులు చేస్తూ రచ్చ రచ్చ చేస్తున్న ఏడుగురు అమ్మాయిలు.. 13 మంది అబ్బాయిలను అదుపులోకి తీసుకున్నారు. అసలేం జరిగిందంటే.. మొయినాబాద్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ముజ్రా పార్టీ జరుగుతుందన్న సమాచారంతో ఎస్ఓటీ పోలీసులు మంగళవారం అర్ధరాత్రి రైడ్‌ చేశారు. ఏడుగురు యువతులు, 13 మంది యువకులు.. మొత్తం 20 మందిని అరెస్టు చేశారు. వారి నుంచి భారీగా మద్యం, హుక్కా, గంజాను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు ప్రకటించారు.

మొయినాబాద్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఏతబర్ పల్లి గ్రామ శివారులోని హాలీడే ఫార్మ్ హౌస్‌లో పుట్టినరోజు వేడుకల పేరుతో ముజ్రా పార్టీ నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు. పార్టీ కోసం నిర్వాహకుడు ముంబై నుంచి యువతులను హైదరాబాద్‌కు తీసుకువచ్చినట్టు పోలీసులు గుర్తించారు. ముంబైతోపాటు ఇతర రాష్ట్రాలకు చెందిన యువతులు కూడా ఉన్నట్టు పేర్కొంటున్నారు.

వీడియో చూడండి..

ఈ క్రమంలో దాడుల్లో భాగంగా.. యువతులు, యువకులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అంతేకాకుండా నిర్వాహకుడిని సైతం పోలీసులు అరెస్టు చేసినట్లు తెలుస్తోంది.. ముజ్రాపార్టీలో భారీగా మద్యం, హుక్కా, గంజాయి స్వాధీనం చేసుకున్నామని.. అందరికీ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

సింగర్ రీనా అరెస్ట్..

హాలిడే ఫామ్ హౌస్‌లో అబ్దుల్ లుక్మాన్ అనే వ్యక్తి బర్త్ డే పార్టీ జరిగిందని.. ఈ ముసుగులో ముజ్రా పార్టీ నిర్వహించారని మొయినాబాద్ పోలీసులు చెబుతున్నారు. సింగర్లు రీనా, బాబు ఆధ్వర్యంలో ఈ పార్టీ జరిగినట్లు పోలీసులు తెలిపారు.  రీనా అనే మహిళ కోల్‌కతా కు చెందిన మహిళ అని.. గత ఐదు సంవత్సరాలుగా నగరంలోనే ఉంటూ పార్టీలలో పాటలు పాడుతుందన్నారు.  గతంలో ఇలాంటి పార్టీలలో రీనా పట్టు పడిందని మొయినాబాద్ పోలీసులు తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
క్రికెట్ వదిలి పైలెట్‌గా మారిన ప్లేయర్.. ఎవరో తెలుసా?
క్రికెట్ వదిలి పైలెట్‌గా మారిన ప్లేయర్.. ఎవరో తెలుసా?
దేశ వృద్ధి రేటు 7.8 శాతం.. ప్రజల సంకల్పంతోనే సాధ్యమైంది: ప్రధాని
దేశ వృద్ధి రేటు 7.8 శాతం.. ప్రజల సంకల్పంతోనే సాధ్యమైంది: ప్రధాని
సకల రోగాలకు ఒకటే బ్రహ్మాస్త్రం.. బంగారం కంటే విలువైనది
సకల రోగాలకు ఒకటే బ్రహ్మాస్త్రం.. బంగారం కంటే విలువైనది
సింగర్ ప్రభ గురించి ఈ విషయాలు మీకు తెలుసా.?
సింగర్ ప్రభ గురించి ఈ విషయాలు మీకు తెలుసా.?
భారీ విస్తీర్ణంలో 219 హిమానీనదాలు.. శాస్త్రవేత్తల హెచ్చరిక
భారీ విస్తీర్ణంలో 219 హిమానీనదాలు.. శాస్త్రవేత్తల హెచ్చరిక
ఉదయాన్నే ఓ కప్పు తినండి.. శరీరాన్ని లోపలి నుంచి రిపేర్ చేస్తుంది
ఉదయాన్నే ఓ కప్పు తినండి.. శరీరాన్ని లోపలి నుంచి రిపేర్ చేస్తుంది
హైదరాబాద్‌ మద్రాస్‌ రెజిమెంట్‌లో ఆర్మీ ఆయుధాలు చోరీ..
హైదరాబాద్‌ మద్రాస్‌ రెజిమెంట్‌లో ఆర్మీ ఆయుధాలు చోరీ..
వైభవ్ మార్క్ డామినేషన్.. తానేంటో మరోసారి ప్రూవ్ చేసిన వండర్ కిడ్
వైభవ్ మార్క్ డామినేషన్.. తానేంటో మరోసారి ప్రూవ్ చేసిన వండర్ కిడ్
చుట్టూ ఉన్నవన్నీ కొట్టుకుపోయినా ఆ ఇల్లు ఎలా నిలబడింది? రహస్యం ఇదే
చుట్టూ ఉన్నవన్నీ కొట్టుకుపోయినా ఆ ఇల్లు ఎలా నిలబడింది? రహస్యం ఇదే
రోడ్లపై కనిపించే ఈ మొక్క తెలుసా? ఆ రోగానికి బ్రహ్మస్త్రం..
రోడ్లపై కనిపించే ఈ మొక్క తెలుసా? ఆ రోగానికి బ్రహ్మస్త్రం..