HDFC: హెచ్‌డీఎఫ్‌సీ ఖాతాదారులకు అలర్ట్.. 12న బ్యాంకు సేవలలో అంతరాయం!
HDFC: సాధారణంగా బ్యాంకులు తమ సర్వర్లను అప్‌గ్రేడ్ చేస్తుంటాయి. అలాంటి సమయంలో కొన్ని గంటల పాటు బ్యాంకుకు సంబంధించని పలు సర్వీసులు అందుబాటులో ఉండవు. ఇప్పుడు తాజాగా అతిపెద్ ప్రైవేట్ బ్యాంకు అయిన హెచ్‌డీఎఫ్‌సీ తన వినియోగదారులకు కీలక సందేశం అందించింది..

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఖాతాదారులకు అలర్ట్! 12వ తేదీన బ్యాంకు సేవలలో కొంత అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది. అందుకే వినియోగదారులు ముందుస్తుగా గమనించడం చాలా ముఖ్యం. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తన ప్లాట్‌ఫారమ్‌ల నిర్వహణలో భాగంగా, కొన్ని బ్యాంకింగ్ సేవల్లో అంతరాయం ఏర్పడవచ్చు.
ఏప్రిల్ 2వ తేదీన ఉదయం 2.30 గంటల నుంచి ఉదయం 6.30 గంటల వరకు (4 గంటలు) పలు సేవల్లో అంతరాయం ఏర్పడనుందని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు తెలిపింది. ఈ బ్యాంకు సిస్టమ్ నిర్వహణలో భాగంగా ఏర్పడే అంతరాయాల్లో చాట్‌బ్యాంకింగ్, ఎస్‌ఎంఎస్ (SMS) బ్యాంకింగ్, ఫోన్‌బ్యాంకింగ్ ఐవీఆర్ (IVR) సేవల్లో అంతరాయం ఉండవచ్చు. బ్యాంక్ తన కోర్ బ్యాంకింగ్ సిస్టమ్ (CBS) ను కొత్త ప్లాట్‌ఫామ్‌కు అప్‌గ్రేడ్ చేస్తోంది. దాని 93 మిలియన్ల వినియోగదారులకు కస్టమర్ అనుభవాన్ని మెరుగుపరచడం క్ష్యంగా పెట్టుకుంది.
దీంతో బ్యాంకు వినియోగదారులను మెయిల్స్, సందేశాన్ని కూడా పంపినట్లు తెలిపింది. సిస్టమ్ అప్‌గ్రేడ్ చేస్తున్నందున బ్యాంకు అకౌంట్‌కు సంబంధించి యూపీఐ సేవలతో పాటు ఇతర సేవలు అందుబాటులో ఉండవని తెలిపింది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




