Cricket: ధోతీ కుర్తా ధరించి క్రికెట్ ఆడిన వేద పండితులు.. బహుమతులుగా ఏమిచ్చారో తెలుసా?
సాధారణంగా క్రికెటర్లు అంటే ఒంటికి జెర్సీలు, టీ-షర్ట్ లు, కాళ్లకు ఖరీదైన షూస్ లు, తలకు క్యాప్ లు , కళ్లకు కూలింగ్ గ్లాసెస్.. అబ్బో చాలా ఉండాల్సిందే. గల్లీ క్రికెట్ మ్యాచ్ ల్లో
సాధారణంగా క్రికెటర్లు అంటే ఒంటికి జెర్సీలు, టీ-షర్ట్ లు, కాళ్లకు ఖరీదైన షూస్ లు, తలకు క్యాప్ లు , కళ్లకు కూలింగ్ గ్లాసెస్.. అబ్బో చాలా ఉండాల్సిందే. ఆఖరుకు గల్లీ క్రికెట్ మ్యాచ్ ల్లో కూడా ప్యాంటు, టీ- షర్ట్ ధరించే ఆడతాం. కానీ మధ్య ప్రదేశ్ రాజధాని భోపాల్ లో నిర్వహిస్తున్న ఓ టోర్నీలో క్రికెటర్లు ధోతి, కుర్తా పైజామా ధరించి మైదానంలోకి దిగారు. అయితే వారు ప్రొఫెషనల్ క్రికెటర్లు కాదు.. వేదాలను అవపోసన పట్టిన వేద పండితులు. వేద పండితులు క్రికెట్ ఆడడమేంటి? అనుకుంటున్నారా? అయితే అసలు విషయంలోకి వెళ్దాం రండి.
సంస్కృత భాషలోనే కామెంటరీ..
ప్రముఖ యోగా గురువు మహర్షి మహేశ్ యోగి జయంతిని పురస్కరించుకుని భోపాల్‌లో వేద పండితులకు క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. సంస్కృత్ బచావో మంచ్ ఆధ్వర్యంలో ఈ టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు. కాగా ఈ టోర్నీలో ఆడే ఆటగాళ్లకు ధోతీ కుర్తా డ్రెస్ కోడ్‌గా నిర్ణయించారు. సాధారణంగా క్రికెట్ కామెంటరీ ఇంగ్లిష్ , హిందీ, తెలుగు లేదా అక్కడి స్థానిక భాషల్లో ఉంటుంది. అయితే ఈ టోర్నమెంట్ లో ప్రాచీన సంస్కృత భాషలో కామెంటరీ చెప్పడం విశేషం. మ్యాచ్ ఆడే ఆటగాళ్లందరూ సంస్కృతంలోనే మాట్లాడతారు. మొత్తం నాలుగు రోజుల పాటు ఈ టోర్నీ జరగనుంది.
వేద పుస్తకాలు, పంచాంగాలు..
కాగా వైదిక కుటుంబాలలో క్రీడాస్ఫూర్తి, సంస్కృత భాష ప్రాధాన్యతను తెలియజేయడమే లక్ష్యంగా ఈ క్రికెట్ టోర్నీని జరుపుతున్నట్లు నిర్వాహకులు తెలిపారు. అయితే ప్రొఫెషనల్ క్రికెట్ కు ఏ మాత్రంతగ్గకుండా ఇందులోనూ ప్రతి మ్యాచ్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ పురస్కారాలు ప్రదానం చేస్తున్నారు. అయితే ఆ బహుమతులు ఏంటంటే.. వేద పుస్తకాలు, 100 సంవత్సరాల పంచాంగాలను బహూకరిస్తున్నారు. కాగా, ఈ టోర్నమెంట్‌కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Also Read: Coronavirus: మొన్న తండ్రి.. నేడు కుమారుడు.. కరోనా బారిన పడ్డ స్టార్ హీరో..
TOP 9 ET News : నీ సాయం మరువలేనిది.. | కోరిక తీరిస్తేనే సినిమా అవకాశం..(వీడియో)
AHA Unstoppable: ఫ్యాన్స్ నిరీక్షణకు ఫుల్‌స్టాప్.. బాలయ్య షోలో మహేష్ సందడి ఎప్పుడంటే..