AHA Unstoppable: ఫ్యాన్స్ నిరీక్ష‌ణకు ఫుల్‌స్టాప్‌.. బాల‌య్య షోలో మ‌హేష్ సంద‌డి ఎప్పుడంటే..

AHA Unstoppable: సినిమాల్లో డైలాగ్‌ల‌తో విల‌న్‌ల‌ను ముప్పుతిప్పు పెట్టే న‌ట సింహం బాల‌కృష్ణ వ్యాఖ్యాత‌గా మారి గెస్ట్‌ల‌ను ఇరుకున పెడుతున్నారు. త‌న‌దైన చ‌లోక్తుల‌తో న‌వ్వులు పూయిస్తున్నారు. ఇది ఒక్క మాట‌లో అన్‌స్టాప‌బుల్ విత్ ఎన్‌బీకే టాక్ షో గురించి...

AHA Unstoppable: ఫ్యాన్స్ నిరీక్ష‌ణకు ఫుల్‌స్టాప్‌.. బాల‌య్య షోలో మ‌హేష్ సంద‌డి ఎప్పుడంటే..
Follow us
Narender Vaitla

|

Updated on: Jan 20, 2022 | 9:57 PM

AHA Unstoppable: సినిమాల్లో డైలాగ్‌ల‌తో విల‌న్‌ల‌ను ముప్పుతిప్పు పెట్టే న‌ట సింహం బాల‌కృష్ణ వ్యాఖ్యాత‌గా మారి గెస్ట్‌ల‌ను ఇరుకున పెడుతున్నారు. త‌న‌దైన చ‌లోక్తుల‌తో న‌వ్వులు పూయిస్తున్నారు. ఇది ఒక్క మాట‌లో అన్‌స్టాప‌బుల్ విత్ ఎన్‌బీకే టాక్ షో గురించి చెప్పాలంటే. ఆహా ఓటీటీ వేదిక‌గా ప్ర‌సార‌మ‌వుతోన్న ఈ టాక్ షో అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది. ఓటీటీ వేదిక‌ల్లో మునుపెన్న‌డూ లేని విధంగా ఐఎమ్‌డీబీలో 9.8 రేటింగ్ సాధించి రికార్డులు బ‌ద్ద‌లు కొట్టిందీ షో.

ఇదిలా ఉంటే ఎంతో విజ‌య‌వంతంగా కొన‌సాగుతోన్న ఈ టాక్‌షో తొలి సీజ‌న్‌కు ముగింపు ద‌గ్గ‌ర ప‌డింది. చివ‌రి ఎపిసోడ్‌కు టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు హాజ‌రుకానున్న విష‌యం తెలిసిందే. గ‌త‌కొన్ని రోజులుగా ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన సోష‌ల్ మీడియాలో పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌రుగుతోంది. త‌మ అభిమాన హీరోను డిజిట‌ల్ స్క్రీన్‌పై చూడ‌డానికి మ‌హేష్ ఫ్యాన్స్ వేయి క‌ళ్ల‌తో ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ ఎపిసోడ్ ప్ర‌సార‌మ‌య్యే తేదీని ఆహా అధికారికంగా ప్ర‌క‌టించింది.

ఫిబ్ర‌వ‌రి 4వ తేదీ నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. ఈ ఎపిసోడ్‌తో తొలి సీజ‌న్ ముగియ‌నుంది. ఇప్ప‌టి వ‌ర‌కు అత్య‌ధిక వ్యూస్‌తో రికార్డులు బ‌ద్ద‌లు కొట్టిన అన్‌స్టాప‌బుల్ మ‌హేష్ ఎపిసోడ్‌తో మ‌రెన్ని వండ‌ర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఇక త్వ‌ర‌లోనే ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమోను కూడా విడుద‌ల చేయ‌నున్నారు.

Aha'

 

Also Read: Lily Flower: లిల్లీ ఫ్లవర్ సాగుతో అధిక సంపాదన.. తక్కువ ఖర్చు అధిక రాబడి..

Bank Accounts: ఒకరికి ఎన్ని బ్యాంకు ఖాతాలుండాలి.. ఎక్కువ ఉంటే ఏమవుతుందంటే..

షాకింగ్‌.. విరాట్‌ కోహ్లీపై చర్యలకు సిద్దమవుతున్న గంగూలీ.. షోకాజ్ నోటీసు రెడీ..?